జగన్ కంపెనీపై పవన్ ప్రశంసలు-ఫస్ట్ టైమ్ అంబటి థ్యాంక్స్..!
ఏపీ రాజకీయాల్లో ఎప్పుడు ఎవరేం చేస్తారో తెలియని పరిస్ధితి. ఒకప్పుడు ప్రత్యర్థులుగా ఉన్నవారు కలిసి దర్శనమిస్తుంటారు, అలాగే ప్రాణస్నేహితుల్లా కనిపించిన వారు ప్రత్యర్థులుగా మారిపోతుంటారు, రాజకీయ ప్రత్యర్దులుగా విమర్శలు గుప్పించిన వారు తిరిగి స్నేహితుల్లా మారి పోయి అన్నీ మర్చిపోతుంటారు. గతంలో చంద్రబాబు-విజయసాయిరెడ్డి వంటి ఉదాహరణలే ఇందుకు నిదర్శనం. ఇదే క్రమంలో వైసీపీ నేత అంబటి రాంబాబు తన చిరకాల రాజకీయ ప్రత్యర్ధిగా ఫీలయ్యే పవన్ కళ్యాణ్ కు థ్యాంక్స్ చెప్పారు. దీని వెనుక పెద్ద రీజనే ఉంది.
నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉమ్మడి కర్నూలు జిల్లాలో గ్రీన్ కో సంస్థ నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ (ఐఆర్ఇపి)ని సందర్శించారు. ఇది మన దేశానికే తలమానికమైన ప్రాజెక్ట్ అన్నారు. ఒకే చోట సోలార్, విండ్, హైడల్... ఇలా మూడు విభాగాల్లో విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా ప్రాజెక్ట్ ను డిజైన్ చేసిన విధానం అద్భుతం అంటూ ప్రశంసలు కురిపించారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే రాష్ట్రానికి కావాల్సిన విద్యుత్ అవసరాల్లో మూడో వంతు తీర్చవచ్చని తెలిపారు. ఈ మెగా పవర్ ప్రాజెక్ట్ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 50 వేల మంది వరకు ఉపాధి లభిస్తుందన్నారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తున్న గ్రీన్ కో సంస్థకు అభినందనలు తెలిపారు.

ఇంతకీ ఈ గ్రీన్ కో సంస్థను రాష్ట్రంలో ఏర్పాటు చేసింది గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే. రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా చేశారని, పారిశ్రామిక వేత్తల్ని తరిమేశారని కూటమి పార్టీలు నిత్యం తిట్టిపోసే జగన్ హయాంలోనే ఇదంతా జరిగింది. ఇప్పుడు ఈ గ్రీన్ కో సంస్థే కర్నూలు జిల్లాలో ఓ భారీ ప్రాజెక్టు పెట్టేందుకు సిద్దమైంది. వైసీపీ నేత చలమలశెట్టి సునీల్ కు చెందిన సంస్థే ఇది. దీంతో ఇప్పుడు వైసీపీ నేత పెట్టిన, వైసీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన గ్రీన్ కో సంస్థను ప్రశంసించినట్లయింది. దీనిపై వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు.
జగన్ హయాంలో పరిశ్రమలు
— Ambati Rambabu (@AmbatiRambabu) January 11, 2025
రాలేదని ,ఉన్నవి పోయాయని
ప్రచారం చేస్తున్న సమయంలో,
జగన్ గారు తీసుకువచ్చిన
GREENKO ENERGY PROJECT
ప్రపంచంలోనే అద్భుతమని ప్రశంసించిన
డిప్యూటీ CM గారికి ధన్యవాదాలు !@PawanKalyan
జగన్ హయాంలో పరిశ్రమలు రాలేదని ,ఉన్నవి పోయాయని ప్రచారం చేస్తున్న సమయంలో, జగన్ గారు తీసుకువచ్చిన GREENKO ENERGY PROJECT ప్రపంచంలోనే అద్భుతమని ప్రశంసించిన డిప్యూటీ CM గారికి ధన్యవాదాలు ! అంటూ అంబటి రాంబాబు ఎక్స్ లో పోస్టు చేశారు. తద్వారా కూటమి సర్కార్ గతంలో చేసిన విమర్శలు.. ఇప్పుడు పవన్ యూటర్న్ తీసుకున్న తీరును సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications