ఏపీ రాజకీయాలపై మాట మార్చిన చిరంజీవి.,వీడియో వైరల్
ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అధికార వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు పావులు కదుపుతున్నాయి. మరోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ అడుగులు వేస్తోంది. మే 13న రాష్ట్రంలో ఎన్నికలు జరగనుండగా, జున్ 4 ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు తన మద్దతు ప్రకటించారు. కూటమి తరుఫున పోటీ చేస్తోన్న సీఎం రమేష్, పంచకర్ల రమేష్‌లకు చిరంజీవి తన మద్దతు ప్రకటించారు.
బీజేపీ తరుఫున పోటీ చేస్తోన్న సీఎం రమేష్ అనకాపల్లి ఎంపీగా బరిలోకి దిగుతున్నారు. అదే విధంగా పెందూర్తి నియోజకర్గం నుంచి పంచకర్ల రమేష్ బాబు జనసేన అభ్యర్థిగా రంగంలోకి దిగతున్నారు. వీరిద్దరికి చిరంజీవి తన మద్దతు ప్రకటించారు. కూటమి నేతలకు చిరంజీవి మద్దతు ప్రకటించడంతో వైసీపీ శ్రేణులు ఆయనసై మండిపడుతున్నారు. గతంలో చిరంజీవి మాట్లాడిన వీడియోలను బయటకు తీస్తూ ఆయన్ను ట్రోల్ చేస్తున్నారు.

చిరంజీవి గతంలో ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ...నాకు ఏపీలో ఓటు లేదని.. అక్కడ రాజకీయాలతో తనకు సంబంధం లేదని చిరంజీవి తెలిపారు. నాకు ఎక్కడైతే ఓటు హక్కు ఉందో అక్కడ నుంచే తాను మాట్లాడుతున్నా అంటూ చిరంజీవి ఈ ఇంటర్వ్యూలో చెప్పారు. నాకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేదని మెగాస్టార్ చెప్పుకొచ్చారు. అక్కడ ఏం జరుగుతుందో పేపర్లు, టీవీలు ద్వారానే తెలుసుకుంటున్నాను తప్పిస్తే..అంతకు మించి తనకు అక్కడ రాజకీయాల గురించి ఎటువంటి ఆసక్తి లేదని ఆయన తెలిపారు.
నా ఫోకస్ అంతా కూడా సినిమాలపైనే ఉందని చిరంజీవి వ్యాఖ్యానించారు.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను వైసీపీ తమ గ్రూపుల్లో తెగ షేర్ చేస్తోంది. ఏపీ రాజకీయాలపై ఏమాత్రం సంబంధం లేదని తెలిపిన చిరంజీవి ఇప్పుడు ఎలా కూటమి అభ్యర్థులకు మద్దతు ఇస్తున్నారో చెప్పాలని వైసీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. తమ్ముడు పవన్ కల్యాణ్ గెలుపు కోసమే చిరంజీవి ఇదింతా చేస్తున్నారని వైసీపీ నాయకులు మండిపడుతున్నారు. చిరంజీవి కల కలగానే మిగిలిపోతుందని వారు ఎద్దెవా చేస్తున్నారు.
-
చిరంజీవికి సీనియర్ NTR సినిమాల్లో అదంటే మహా ప్రాణం.. ఎవరూ ఊహించనది -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications