విగ్గు రాజాకు అన్నీ భయాలే-కానిస్టేబుల్ అన్నా, ట్రైన్ అన్నా.. సాయిరెడ్డి సెటైర్ ట్వీట్స్

వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీపైనే నిత్యం విమర్శల పోరాటం చేస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తాజాగా భీమవరంలో ప్రధాని మోడీ టూర్ కు వచ్చేందుకు విఫలయత్నం చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు చేదు అనుభవాల్ని సైతం ఎదుర్కొన్నారు. ఇప్పుడు వాటిని మరోసారి ఆయనకు గుర్తుచేస్తూ వైసీపీ కీలక ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ ట్వీట్ చేశారు.

గతంలోనూ పలుమార్లు రఘురామకృష్ణంరాజును టార్గెట్ చేస్తూ ట్వీట్లు పెట్టిన విజయసాయిరెడ్డి ఈసారి ఆయన్ను మరింతగా టార్గెట్ చేశారు. ముఖ్యంగా భీమవరం టూర్ కు వచ్చేందుకు రఘురామకృష్ణంరాజు చేసిన ప్రయత్నం, అనంతరం హైదరాబాద్ లోని ఆయన ఇంట్లో ఏపీ ఐబీ కానిస్టేబుల్ పై రఘురామ భద్రతా సిబ్బంది దాడి వంటి అంశాల్ని ప్రస్తావిస్తూ సాయిరెడ్డి పెట్టిన ట్వీట్స్ ఇప్పుడు రఘురామరాజుకు కచ్చితంగా మంటపుట్టించేలా ఉన్నాయి..

ysrcp mp vijayasai reddy mocks rebel mp raghurama raju for his fears with everything

సాయిరెడ్డి తన తొలి ట్వీట్ లో ... భయం...కానిస్టేబుల్ ని చూస్తే భయం...నీ ఇంటి ముందు కారు వెళితే భయం..ట్రైన్ ఎక్కాలంటే భయం...బాత్రూంకి వెళ్ళాలన్నా Z+సెక్యూరిటీ...ఛీ..ఛీ ఇంత పిరికితనం ఏంట్రా విగ్గుగా? నీ పచ్చ కుల మీడియా నిన్ను...నీ బతుకు ఒక బతుకేనా అంటుందిరా! అని వ్యంగాస్త్రాలు సంధించారు.

మరో ట్విట్ లో.. ఏమిరా గబ్బూ! నీవల్ల లోకానికి ఏం ప్రయోజనం రా! నిద్రలేవడం, పాచినోటితోనే పెగ్గువేయడం, పందిలా తినడం, విగ్గు పెట్టుకుని పచ్చ కుల మీడియా ముందు పెంటకూతలు కూయడం. ఇంతకంటే దరిద్రమైన బతుకు ఇంకోటి ఉందా? కేకరించి ఊస్తున్నా సిగ్గులేని సంతతి. నీ ఎంగిలి బతుక్కి ఇంతకు మించి ఆశించడం కూడా తప్పేరా... అంటూ ఆడుకున్నారు.

ఇంకో ట్వీట్ లో... ఒరేయ్ విగ్గూ, లేని భయాలు ఊహించుకుని మానసికంగా కుంగిపోతున్నావు. యధాలాపంగా ఎవరు నిన్ను చూసినా లేపేయడానికి ప్లాన్ చేస్తున్నారని వణికి పోవడం స్కిట్జోఫ్రీనియా(Schizophrenia) లక్షణం. యాంక్జయిటీ, భ్రాంతికి లోనవడం అందుకే. మందుతో మేనేజ్ చేస్తున్నావు కానీ సైకియాట్రిక్ చికిత్స అవసరంరా నీకు!.. అంటూ సాయిరెడ్డి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+