పొత్తుల, సీట్లు తర్వాత, విపక్షాల సీఎం అభ్యర్ధి ఎవరు-సాయిరెడ్డి ప్రశ్న-వరుస ట్వీట్లతో ఫైర్..

ఏపీలో ఎన్నికల దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. ముఖ్యంగా ఎన్నికల్లో సీట్ల పంపకాలు, సీఎం అభ్యర్ధుల ఎంపిక వంటి అంశాలపై అధికార వైసీపీకి ఉన్న క్లారిటీ విపక్షాల్లో కనిపించడం లేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో విపక్షాలన్నీ కలిసి పోటీ చేస్తాయా లేక ఏయే పార్టీలు కలిసి పోటీ చేస్తాయి, చేస్తే ఎన్ని సీట్లు ఎవరికి కేటాయిస్తారు, అసలు సీఎం అభ్యర్ధి ఎవరన్న దానిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఇదే అంశంపై ఇవాళ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఓ విమర్శనాత్మక ట్వీట్ చేశారు.

పొత్తులు, సీట్ల పంపకాల మాట అటుంచితే... అసలు సీఎం అభ్యర్థి ఎవరో తేల్చుకోలేని దుస్థితి ఏపీలో టీడీపీ యితర విపక్షాలది అంటూ సాయిరెడ్డి ట్వీట్ చేశారు. సీఎం అభ్యర్థినే తేల్చుకోలేనోళ్లు రాష్ట్ర భవిష్యత్తుకు ఏం భరోసా ఇస్తారు? అంటూ విపక్షాల దుస్ధితిని సాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

ysrcp mp vijayasai reddy tweet question on oppositions cm candidate selection

మరో ట్వీట్ లో టీడీపీని టార్గెట్ చేస్తూ సాయిరెడ్డి పలు విమర్శలు చేశారు. జగన్ గారిపై అసూయ, ద్వేషం పెంచుకోవడం తప్ప ప్రజలు తమను ఎందుకు తిరస్కరించారో ఆత్మశోధన చేసుకోవడానికి టీడీపీ ఇష్టపడటం లేదన్నారు. ప్రజాక్షేత్రాన్ని వదిలి సిఎం లక్ష్యంగా మౌఖిక దాడులకు తెగబడటం వల్ల ఒనగూరేది ఏమీ ఉండదన్నారు. గ్రామానికి 10 మంది కొత్త కార్యకర్తలను తయారు చేసుకున్నా రాజకీయ పార్టీగా మనుగడ ఉండేదన్నారు.

ఇంకో ట్వీట్లో తమ రాజకీయ ప్రత్యర్ధి చంద్రబాబును సాయిరెడ్డి టార్గెట్ చేశారు. అన్ని రాజకీయ పార్టీల్లో బాబు గారి స్లీపర్ సెల్స్ ఉంటాయిని, తనకు అవసరమైనప్పుడు వారికి స్క్రిప్ట్ పంపించి డైరెక్షన్ ఇస్తాడని సాయిరెడ్డి ఆరోపించారు. ఖాళీ దొరికినప్పుడల్లా కలుగుల్లోంచి బయటకు వచ్చే స్లీపర్ సెల్స్, మోల్స్ ఎన్ని విమర్శలు చేసినా ప్రయోజనం శూన్యమన్నారు. ధూళితో కూడిన సుడిగాలి వచ్చిపోయినట్టుంది తప్ప...వారిని ఎవరు పట్టించుకోరన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+