రఘురామ సభ్యత్వ రద్దు ఖాయం : జగన్ జైలుకు వెళితే మరింత బలపడతారు ...కానీ : సీపీఐ నారాయణ సంచలనం..!!

నిత్యం సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ మరోసారి ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం లోక్ సభ స్పీకర్ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు కు అనర్హత పిటీషన్ పైన నోటీసులు ఇచ్చిన అంశం పైన నారాయణ స్పందించారు. ఎంపీ రఘురామ సభ్యత్వ రద్దు ఖాయమని వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం జగన్ బెయిలు రద్దు అవుతుందో లేదో కానీ వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణ రాజు పార్లమెంటు సభ్యత్వం రద్దు అవుతుందని చెప్పుకొచ్చారు.

జగన్ పార్టీలో ఉంటూ ఆ పార్టీ విధానాలు వ్యతిరేకంగా నిత్యం వ్యవహరిస్తున్న రఘు రామ సభ్యత్వాన్ని రద్దు చేయమని కొరడంలో తప్పు లేదని నారాయణ పేర్కొన్నారు. గతంలో రాజ్యసభ చైర్మన్ గా వెంకయ్య నాయుడు .. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు రాగానే శరద్ యాదవ్ సభ్యత్వాన్ని రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రఘురామ సభ్యత్వం ఇప్పటికే రద్దు జరగాల్సి ఉన్న రాజకీయ కారణాలతో జాప్యం జరిగిందని అభిప్రాయపడ్డారు.

CPI Narayana had made sensational comments over YSRCP rebel MP Raghurama and CM Jagan

జగన్ బెయిలు రద్దు చేయాలని ఆయన పార్టీకి చెందిన రఘురామ పిటిషన్ వేయడాన్ని నారాయణ తప్పు బట్టారు. పార్టీ నుంచి బయటకు వచ్చి తెలంగాణలో ఈటెల రాజేంద్ర తరహాలో పోరాటం చేసి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. ఒక వేళ ఆయన కోరుకున్నటు జగన్ బెయిలు రద్దు అయితే ఏమి అవుతుందని ప్రశ్నించారు. ఇంతకు ముందే జగన్ 16 నెలలు జైలులో ఉన్నారని...ఆ సింపతితో ఎన్నికల్లో గెలిచారని తెలిపారు. మరోసారి జైలుకు వెళితే ఆయన అర్ధ ఆయుష్షు సంపూర్ణ ఆయుష్షు గా మారుతుందని పేర్కొన్నారు.

జైలుకు పంపి రాజకీయాలు మార్చాలి అనుకోవడం అవివేకమే అవుతుందన్నారు. దేశంలో మోడీకి వ్యతిరేకంగా జరుగుతున్న సమీకరణాలు రీతిలో ప్రజా క్షేత్రంలో జగన్ ను ఓడించాలని సూచించారు. ఇక సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ దేశద్రోహం చట్టం పై చేసిన వ్యాఖ్యానాల నేపథ్యంలో పార్లమెంటులో చర్చ చేసి 124 ౼A ని రద్దు చేయాలని నారాయణ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+