147 సీట్లలో వైసీపీ ముందంజ - టీడీపీ అంచనా , వీడియో వైరల్..!!

ఏపీలో అధికారంలోకి వచ్చేదెవరు. ఎన్నికల వేళ ఇప్పుడు ఇదే బిగ్ డిబేట్ గా మారింది. టీడీపీ కూటమి, వైసీపీ ఇద్దరూ గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టీడీపీ నేతలు ఎన్నికల పైన సమీక్ష చేస్తూ చేసిన వ్యాఖ్యల వీడియోను వైసీపీ విడుదల చేసింది. 2014,2019 ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తూ...ప్రస్తుత ఎన్నికల పైన టీడీపీ నేతలు ఆ వీడియోలో వివరిస్తున్నారు. అందులో 147 స్థానాల్లో రెండు శాతం ఓటింగ్ పెంచుకోవటం ద్వారా గెలుపుకు అవకాశాలు ఉన్నాయని చెప్పటం ఆసక్తి కరంగా మారుతోంది.

కూటమిలో భాగంగా మూడు పార్టీలు వైసీపీ ఓటమే లక్ష్యంగా పోటీ చేస్తున్నాయి. కొన్ని సీట్ల మార్పు పైన టీడీపీ, బీజేపీ మధ్య చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో సోషల్ మీడియా కేంద్రంగానూ పార్టీల మధ్య వార్ కొనసాగుతోంది. తాజాగా వైసీపీ విడుదల చేసిన ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. కూటమి పార్టీలకు దక్కే ఓటింగ్ గెలుపు అవకాశాల పైన ఆ వీడియోలో టీడీపీ నేత చేసిన విశ్లేషణ ఆసక్తి కరంగా మారింది. టీడీపీ రాష్ట్ర ఎన్నికల సెల్ కో ఆర్డినేటర్ చేసిన విశ్లేషణ ఆ వీడియోలో ఉంది. 2014 ఎన్నికల్లో టీడీపీ కూటమి 1.95 శాతం ఓట్ల తేడాతో గెలిచిన అంశాన్ని ఆ వీడియోలో ప్రస్తావించారు.

YSRCP Releases TDP predictions over Elections and Vote share Goes viral

2019 ఎన్నికల్లో 60 సీట్లలో ఓట్ల చీలిక కారణంగా ఓడిపోయామని వివరించారు. లేకపోతే ఓడినా..23 సీట్లకు పరిమితం అయ్యే అవకాశం ఉండేది కాదని విశ్లేషించారు. తాజాగా 147 స్థానాల్లో కూటమి - వైసీపీ మధ్య అయిదు శాతం ఓట్ల తేడా ఉందని చెప్పుకొచ్చారు. 2019 ఎన్నికల్లో పోలైన ఓట్లను నిలబెట్టుకుంటూ..మరో రెండు శాతం ఓటింగ్ పెంచుకుంటే 147 స్థానాల్లో గెలిచేందుకు అవకాశం ఉంటుందని పార్టీ నేతలకు వివరించినట్లుగా ఆ వీడియోల అర్దం అవుతోంది. కడప, కర్నూలు జిల్లాల్లో కూటమి కంటే వైసీపీ 10 లక్షల ఓట్ల ముందంజలో ఉందని పేర్కొన్నారు. ఇది చాలా పెద్ద తేడాగా విశ్లేషించారు. 28 నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఉందని...అయితే, అన్ని నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాల్సి ఉంటుందని వివరించారు. ఇప్పుడు వైసీపీ విడుదల చేసిన ఈ వీడియో పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+