టీడీపీ ఐవీఆర్ఎస్ కాల్స్..! ఎలక్షన్ ప్లాన్ రిపీట్ పై వైసీపీ ఫైర్..!

ఏపీలో నకిలీ మద్యం కేసుపై వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం జోరుగా సాగుతోంది. అన్నమయ్య జిల్లా ములకలచెరువులో కల్తీ మద్యం కేసు బయటపడగానే ఇద్దరు టీడీపీ నేతల్ని సస్పెండ్ చేసిన సీఎం చంద్రబాబు.. ఆ తర్వాత ఈ కేసును సిట్ కు అప్పగించారు. దీంతో వైసీపీ నకిలీ మద్యం వ్యవహారంపై టీడీపీ పాత్రపై జనంలోకి వెళ్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ రూటు మార్చి ఐవీఆర్ఎస్ కాల్స్ చేసి కల్తీ మద్యానికి కారణం వైసీపీయేనని ప్రచారం సాగిస్తోంది. దీనిపై వైసీపీ మండిపడుతోంది.

ప్రభుత్వ పెద్దల ప్రోత్సహాంతో నకిలీ మద్యం దందాలో టీడీపీ నేతలు అడ్డంగా దొరికిపోవడంతో, ప్రజల దృష్టిని మళ్ళించేందుకు ఐవీఆర్‌ఎస్ కాల్స్‌తో వైయస్ఆర్‌సీపీపై తప్పుడు ప్రచారానికి చంద్రబాబు తెగబడ్డారని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌ బాబు మండిపడ్డారు. వివేకా హత్యతో లింక్ చేస్తూ, నకిలీ మద్యం దందాపై ప్రజలకు ఐవీఆర్‌ఎస్ కాల్స్ చేయిస్తున్న చంద్రబాబుకు నిజంగా దీనిపై వాస్తవాలు వెల్లడి కావాలంటే సీబీఐ విచారణ కోరడానికి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఈ దందాలో కిలారు రాజేష్, నారా లోకేష్‌ల దోపడీ వ్యవహారం బయటపడుతుందని చంద్రబాబు కంగారు పడుతున్నారని ఆరోపించారు.

YSRCP Slams TDP s IVRS Campaign on Spurious Liquor Case Dares Party to Seek CBI Probe

చంద్రబాబు నేతృత్వం లోని ప్రభుత్వం నకిలీ మద్యం రాకెట్‌ను ప్రోత్సహిస్తూ మద్యం దుకాణాలు, బార్లు, బెల్ట్‌షాప్‌ల ద్వారా పెద్ద ఎత్తున అమ్ముతోంది. ఈ విషయం కాస్తా బయటపడిపోవడం, ఈ నకిలీ మద్యం దందా వెనుక ఉన్న టీడీపీ నేతల పేర్లు వెలుగులోకి రావడంతో ప్రజలు టీడీపీని అసహ్యించుకుంటున్నారన్నారు. దీని నుంచి బయటపడటానికి సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌ను తెరమీదికి తీసుకువచ్చి, వైయస్ఆర్‌సీపీకి ఆ బురద అందించేందుకు సిద్దమయ్యాడన్నారు. అందులో భాగంగానే నిందితుడు జనార్థన్‌తో మాజీ మంత్రి జోగి రమేష్‌పై తప్పుడు ఆరోపణలు చేయించారన్నారు.

YSRCP Slams TDP s IVRS Campaign on Spurious Liquor Case Dares Party to Seek CBI Probe

ఈ విషయాలను ప్రజలు నమ్మడం లేదని తెలిసి, పదేపదే ఈ నిందను వైయస్ఆర్‌సీపీపై మోపుతూ పెద్ద ఎత్తన ప్రచారం చేయించేందుకు తెగబడ్డాడు. దీనిలో భాగంగా ఐవీఆర్‌ఎస్ కాల్స్ ద్వారా ప్రజలకు ఫోన్లు చేయించి, ముందుగా రికార్డు చేసిన మెసేజ్‌ను వారి మెదళ్ళలో జొప్పించేందుకు దిగజారుడు రాజకీయం చేస్తున్నారన్నారు. గత ఎన్నికలకు ముందు కూడా ఇలాగే ఐవీఆర్‌ఎస్ కాల్స్ ద్వారా 'మీ భూమిని వైయస్ జగన్ లాగేసుకుంటున్నారు, మీ భూములకు రక్షణ లేదంటూ' ఒక ఫేక్ న్యూస్‌ను విస్తృతంగా ప్రచారం చేసి లభ్దిపొందారన్నారు. తిరిగి అదే కుట్ర అమలు చేస్తున్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+