Kotamreddy Sridhar Reddy : కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హౌస్ అరెస్ట్-నెల్లూరులో టెన్షన్ టెన్షన్...
ఏపీలో వైసీపీతో విభేదిస్తూ తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసి సస్పెండైన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. జగన్ సర్కార్ పై సమర సంఖం పూరించేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా వైసీపీకి పదికి పది స్ధానాలు గెలిపించిన నెల్లూరు జిల్లాలో ప్రభుత్వం ఏమీ చేయలేదని ఆరోపిస్తూ ఒక్కో సమస్యపై పోరాటానికి సిద్ధమయ్యారు. దీంతో ఇవాళ ఆయన్ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.
నెల్లూరులోని పొట్టెపాలెం కలుజు వద్ద వంతెన నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఇవాళ జల దీక్షకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి పిలుపునిచ్చారు. ఇవాళ 8 గంటల పాటు జల దీక్ష చేయాలని కోటంరెడ్డి నిర్ణయించారు. దీనికి బయలుదేరి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా.. పోలీసులు భారీ ఎత్తున ఆయన ఇంటికి చేరుకున్నారు. కోటంరెడ్డిని హౌస్ అరెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు. జలదీక్షకు వెళ్లేందుకు ఆయనకు అనుమతి లేదని తెలిపారు. దీంతో ఆయనకు గట్టి షాక్ తగిలింది.

నెల్లూరులో కోటంరెడ్డి నివాసం ఉంటున్న మాగుంట లేఔట్ వద్ద పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. కోటంరెడ్డిని హౌస్ అరెస్టు చేసిన నేపథ్యంలో ఆయన అభిమానులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు. దీంతో పోలీసులు భద్రతను మరింత పెంచారు.
నెల్లూరు: రెబల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హౌజ్ అరెస్ట్#KotamreddySridharReddy #Nellore #AndhraPradesh #ApPolitics #YSJagan #YSJaganGovt #Oneindiatelugu pic.twitter.com/l42u0SvGLQ
— oneindiatelugu (@oneindiatelugu) April 6, 2023
భారీ పోలీసు వాహనం సిద్ధం చేసి అవసరమైతే వీరిని అరెస్టు చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో నెల్లూరు సిటీలో ఉద్రిక్తత నెలకొంది. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యే అనిల్ తో సై అంటే సై అంటున్న కోటంరెడ్డి ఇవాళ నగరంలో తన సత్తా చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications