Sri Reddy:పెళ్లీ పెటాకుల్లేవ్-వదిలేయండి సార్ ప్లీజ్-శ్రీరెడ్డి వేడుకోలు.!
ఏపీలో సోషల్ మీడియా పోస్టులపై ప్రభుత్వం కొరడా ఝళిపిస్తోంది. వైసీపీ నేతలతో పాటు సోషల్ మీడియా కార్యకర్తలు, సానుభూతిపరుల్ని రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా వెంటాడుతోంది. ఇప్పటికే వందల సంఖ్యలో కేసులు కూడా నమోదు చేసింది. అలాగే చాలా మందిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై హైకోర్టులో సైతం హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ కూడా జరుగుతోంది. ఈ క్రమంలో గతంలో కూటమి నేతలపై విమర్శలు చేసిన వారంతా దారికొస్తున్నారు.

లోకేష్ గారూ మీకు సారీ, అలాగే మీ అమ్మ గారెకి, మీ భార్య గారెకి సారీ, అనిత గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికీ సారీ అంటూ శ్రీరెడ్డి ఇవాళ ఓ వీడియో విడుదల చేశారు. నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని, అలాగే తన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ( మధ్యలో నాకు భవిష్యత్తు లేదనుకోండి నేను పెళ్లీ పెటాకులు అని అనుకోవట్లేదంటూ ) తన వల్ల తన కుటుంబానికి ఇబ్బంది రాకూడదని ఈ క్షమాపణ చెబుతున్నట్లు శ్రీరెడ్డి తెలిపారు.
ఇకపై తన సోషల్ మీడియాలో మీపై, మీ కుటుంబ సభ్యులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని శ్రీరెడ్డి వెల్లడించారు. ఏ విధమైన తప్పుడు వ్యాఖ్యలు చేయనని హామీ ఇచ్చారు. ఈ యుద్ధాన్ని కార్యకర్తలకూ, మీకు కాకుండా లీడర్లు, లీడర్లకూ మధ్య జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తమ కార్యకర్తల్ని వదిలిపెట్టమంటూ విజ్ఞప్తి చేస్తూ విన్నవించుకుంటున్నట్లు శ్రీరెడ్డి ఎన్డీయే ప్రభుత్వానికి, నేతలకు విజ్ఞప్తి చేసారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
పవన్ కళ్యాణ్ గారు నన్ను క్షమించండి .. దయచేసి నన్ను వదిలిపెట్టండి..!!#Srireddy #PawanKalyan #YSJagan #YSRCP #YSRCPSocialMedia #Oneindiatelugu pic.twitter.com/yOI9yF5co1
— oneindiatelugu (@oneindiatelugu) November 8, 2024












Click it and Unblock the Notifications