ఆ రెండింటిలో... తమన్నా ఏంటి అలా చేసింది?
తెలుగులో 'శ్రీ' సినిమా చేసే సమయానికి తమన్నాకు కేవలం 16 సంవత్సరాల వయసే. అలా ప్రారంభమై 20 సంవత్సరాల కెరీర్ పూర్తిచేసుకుంది. ప్రారంభంలో చిన్న సినిమాలు చేసినప్పటికీ తర్వాత అగ్ర కథానాయకులందరితో నటించి పెద్ద రేంజ్ కు వెళ్లిపోయింది. దక్షిణాదిలో బిగ్గెస్ట్ హీరోయిన్లలో ఒకరుగా పేరు తెచ్చుకుంది.
కెరీర్లో ఎక్కువగా గ్లామర్ రోల్సే చేసినప్పటికీ.. హద్దులు దాటి అందాలు ఆరబోసింది కూడా ఏమీ లేదు. ఇంటిమేట్ సీన్లలో అసలు నటించలేదు. లిప్ లాక్ సీన్ కూడా చేయలేదు. తనకంటూ కొన్ని నియమ నిబంధనలను పెట్టుకొని వాటిని ఫాలో అయింది. అయితే సుదీర్ఘమైన రెండు దశాబ్దాల కెరీర్ పూర్తయిన తర్వాత తాను విధించుకున్న రూల్స్ అన్నింటినీ తమన్నా బ్రేక్ చేసింది. వారాల వ్యవధిలో విడుదలైన రెండు వెబ్ సిరీస్‌ల్లో తమన్నా రెచ్చిపోయింది. ఒకటి 'జీ కర్దా' కాగా.. మరొకటి 'లస్ట్ స్టోరీస్'.

అమెజాన్ ప్రైమ్ కోసం చేసిన 'జీ కర్దా'లో ఇద్దరు జూనియర్ కుర్రాళ్లతో తమన్నా రెచ్చిపోయి రొమాన్స్ చేసింది. ఆమెను ఇంతవరకు ఊహించుకోలేని సన్నివేశాల్లో నటించింది. ఇందులో ఉన్న బోల్డ్ డైలాగ్స్ పై కూడా చర్చ నడుస్తోంది. కుర్రాళ్లంతా తమన్నా హాట్ సీన్ల కోసమే చూశారుకానీ ఆ సిరీస్ లో ఆకర్షించే విషయం ఒక్కటీ లేదు. స్టోరీ, స్క్రీన్ ప్లే అత్యంత పేలవంగా ఉన్నాయి. ఈ సిరీస్ లో తమన్నా హాట్ సీన్లు ఉన్న టైమింగ్స్ ను నోట్ చేసి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు.
'లస్ట్ స్టోరీస్' విషయంలో కూడా అదే రిపీటవుతోంది. ఇందులోను తమన్నా చేసిన హాట్ సీన్లే హైలైట్ అయ్యాయి. మరింత బోల్డ్‌గా నటించింది. తన నిజ జీవిత బాయ్‌ఫ్రెండ్‌గా భావిస్తున్న విజయ్ వర్మతో రెచ్చిపోయి హాట్ సీన్లు చేసింది. క్లీవేజ్ షోలతో రెచ్చిపోయింది. 'లస్ట్ స్టోరీస్' మాత్రం బ్యాడ్ రివ్యూలు తెచ్చుకుంది. ఇదొక చెత్త సిరీస్ గా అభివర్ణిస్తున్నారు. తమన్నా ఇలాంటి సిరీస్‌ల కోసమా ఇన్నాళ్లు కాపాడుకుంటూ వచ్చిన ఇమేజ్‌ను దెబ్బ తీసుకుని ఇంత రెచ్చిపోయి నటించింది అనే ప్రశ్నలు అందరిలో తలెత్తుతున్నాయి












Click it and Unblock the Notifications