యాషెస్‌లో ఆస్ట్రేలియా తొండాట- ఇంగ్లాండ్ ఫ్యాన్స్ గొడవ: దూసుకెళ్లిన డేవిడ్ వార్నర్
లండన్: యాషెస్ 2023 సిరీస్‌లో భాగంగా లండన్‌లోని లార్డ్స్ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్.. రసవత్తరంగా సాగుతోంది. ఈ మ్యాచ్ గెలవడానికి ఇంగ్లాండ్ జట్టుకు 102 పరుగులు కావాలి. ఆస్ట్రేలియా విజయం సాధించడానికి నాలుగు వికెట్లను పడగొట్టాల్సి ఉంది. కేప్టెన్ బెన్ స్టోక్స్ క్రీజ్‌లో దుమ్ము దులుపుతున్నాడు. సెంచరీ బాది అవతలపడేశాడు.
తొలి ఇన్నింగ్‌లో ఆస్ట్రేలియా 416 పరుగులు చేసింది. దీనికి ప్రతిగా ఇంగ్లాండ్ 325 పరుగులు చేయగలిగింది. 91 పరుగుల భారీ ఆధిక్యతతో రెండో ఇన్నింగ్ ఆరంభించిన ఆస్ట్రేలియా తడబడింది. 279 పరుగులకే కుప్పకూలింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 370 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి రెండో ఇన్నింగ్ ఆరంభించిన ఇంగ్లాండ్ బ్యాటర్లు కూడా ఆశించిన స్థాయిలో సత్తా చాటట్లేదు.

ఓపెనర్ జాక్ క్రాలీ, వన్ డౌన్ ఒల్లె పోప్, మిడిలార్డర్‌లో హ్యారీ బ్రూక్, జో రూట్, వికెట్ కీపర్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో తక్కువ పరుగులకే అవుట్ అయ్యారు. బెన్ స్టోక్స్ ఒక్కడే క్రీజ్‌లో నిలిచాడు. ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపెడుతున్నాడు. ఏడు భారీ సిక్సర్లు, తొమ్మిది ఫోర్లతో 132 పరుగులతో ఆడుతున్నాడతను. మిఛెల్ స్టార్క్ బౌలింగ్‌లో స్టోక్స్ బాదిన హ్యాట్రిక్ సిక్సర్లు మ్యాచ్ మొత్తానికే హైలైట్.
ఈ మ్యాచ్‌లో జానీ బెయిర్‌స్టో అవుట్ అయిన తీరు దుమారం రేపుతోంది. ఆస్ట్రేలియన్ల తీరుపై ఇంగ్లాండ్ ఫ్యాన్స్ భగ్గుమన్నారు. ప్లేయర్లతో గొడవకు దిగారు. వారు లంచ్‌కు వెళ్తోన్న సమయంలో ఆస్ట్రేలియా ప్లేయర్లపై మాటల దాడికి దిగారు. ఓ అభిమాని ఉస్మాన్ ఖవాజా చెయ్యి పట్టుకుని పక్కకు లాగాడు. అతనితో వాదులాటకు దిగారు.
Usman Khawaja was pulled back by security after speaking to one the members inside the long room 😳
— Sky Sports Cricket (@SkyCricket) July 2, 2023
🗣️ "I've NEVER seen scenes like that!" pic.twitter.com/2RnjiNssfw
అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వారిని వారించారు. ఖవాజాను వెనక్కి పంపించారు. అతని వెనుకే ఉన్న డేవిడ్ వార్నర్ ఈ గొడవలో జోక్యం చేసుకున్నాడు. ఖవాజా చెయ్యి పట్టి లాగిన వ్యక్తి పైకి దూసుకెళ్లాడు. సెక్యూరిటీ సిబ్బంది వారిస్తున్నా వినిపించుకోలేదు. వారు బలవంతంగా వార్నర్‌ను వెనక్కి పంపించారు.

ఈ మ్యాచ్‌లో బెయిర్‌స్టో స్టంపవుట్ అయ్యాడు. కామెరాన్ గ్రీన్ సంధించిన స్లోయర్ బౌన్సర్‌ను ఎదుర్కొనే క్రమంలో కిందికి వంగాడు. బెయిర్‌స్టో మీదుగా దూసుకెళ్లిన ఆ బంతిని వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ అందుకున్నాడు. బంతి కీపర్ చేతుల్లోకి వెళ్లిన తరువాత యథాలాపంగా క్రీజ్ నుంచి బయటికొచ్చాడు బెయిర్‌స్టో.
You know it’s bad when the long room turns into millwall away #Ashes23 pic.twitter.com/gdaKCj8s54
— Josh Halliday (@JoshHalliday) July 2, 2023
బంతిని కీపర్ అందుకున్న కొద్దిసేపటి తరువాత.. క్రీజ్ నుంచి బయటికొచ్చాడు. దీన్ని చూసిన అలెక్స్ క్యారీ.. బంతితో వికెట్లను ఎగురగొట్టాడు. దీన్ని అవుట్‌గా తేల్చాడు థర్డ్ అంపైర్. ఇది కాస్తా ఇంగ్లాండ్ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. రన్ తీయాలనే ఉద్దేశంతో కాకుండా యథాలాపంగా క్రీజ్ నుంచి బయటికొచ్చినా అవుట్ ఇవ్వడం పట్ల మండిపడ్డారు.












Click it and Unblock the Notifications