Asthma: మీకు అస్తమా ఉందా.. అయితే ఈ పదార్థాలు తీసుకోండి..
అస్తమా సమస్య ఉన్న వారు చలికాలం చాలా జాగ్రత్తగా ఉండాలి. చలి ఎక్కువగా ఉండడంతో అస్తమా పెరిగే చాన్స్ ఎక్కువగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఆస్తమా బారిన పడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అస్తమా అనే వయస్సుతో సబంధం లేకుండా వస్తుంది. అస్తమా వచ్చిన వారికి త్వరగా వాయుమార్గాలు హైపర్సెన్సిటివ్‌గా మారతాయి. దీంతో నిరంతరం దగ్గు వస్తుంటుంది. అస్తమా రావడానికి
వాతావరణం కాలుష్యం ఒక కారణంగా చెప్పుకోవచ్చు.

విటమిన్ సి, విటమిన్ b6
అస్తమా వచ్చిన వారు కొన్ని పదార్థాలను తీసుకుని కాస్త అదుపులో ఉంచుకోవచ్చు.నారింజ పండ్లు ఊపిరితిత్తులకు మంచివట. నారింజ పండ్లలో విటమిన్ సి, విటమిన్ b6 అధిక పరిమాణంలో ఉండడమే కాకుండా అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు పరిమాణాలు ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన వ్యర్ధాలను బయటకు పంపిస్తాయి.

విటమిన్ ‘డి'
అస్తమా ఉన్నవారు విటమిన్ 'డి' ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఆస్తమా కంట్రోల్‌లో ఉంటుందట. ఆస్తమా పేషెంట్స్ వారి డైట్‌లో పాలు, గుడ్లు, చేపలు.. వంటివి తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.దానిమ్మ పండ్లను ఉదయం పూట తినడం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయట.

రక్తహీనత
దానిమ్మలో ఉండే ఔషధ గుణాలు రక్తహీనతను తగ్గించి ఊపిరితిత్తులను బలంగా చేస్తాయి. బీటా కెరోటిన్ శ్వాస సంబంధిత సమస్యలు రాకుండా చేస్తుంది. ఆస్తమా పేషెంట్స్ వారి డైట్‌లో బీటా కెరోటిన్ ఉండే ఆహార పదార్థలాలు తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. క్యారట్స్, చిలగడదుంపలు, బొప్పాయి, మునగ ఆకుకూరల్లో విటమిన్ 'ఎ' బీటా కెరోటిన్ రూపంలో ఉంటుందట.

మెగ్నీషియం
ఆస్తమా పేషెంట్స్‌కు మెగ్నీషియం మేలు చేస్తుందని నిపుణులు వివరిస్తున్నారు. శీతాకాలంలో మెగ్నీషియం పుష్కలంగా ఉండే.. గుమ్మడి గింజలు, చేపలు, డార్క్ చాక్లెట్, బ్రకోలీ, పచ్చి బఠానీలు, మొలకలు, బ్రౌన్ రైస్, ఓట్స్ తీసుకుంటే మంచిదని చెబుతున్నారు. ఆస్తమా లక్షణాలను తగ్గించడానికి యాపిల్ ఉపయోగపడుతుంది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications