Bajaj finserve app:క్విక్ లోన్ యాప్ ను అత్యవసరాలలో ఉత్తమ ఎంపికగా నిలిపే దాని 6 ఫీచర్స్

అత్యవసరాలను ఎప్పుడు ఊహించలేము మరియు ఇవి తరచూ ఆర్ధిక సవాళ్ళతో వస్తాయి. అది ఒక వైద్య అత్యవసరమైనా, వెంటనే చేయవలసిన ఇంటి మరమ్మత్తైనా లేదా అనుకోని ఖర్చు అయినా తక్షణం నిధుల ప్రాప్యత ఉండటం కీలకం అవుతుంది. ఇటువంటి పరిస్థితులలో, సమస్యలను వెంటనే పరిష్కరించుకొనుటకు అవసరమైన సౌకర్యము మరియు వేగాన్ని మీకు అందించే క్విక్ లోన్ యాప్ ప్రాణాలను రక్షించేది కావచ్చు. మీరు ఇన్స్టా పర్సనల్ లోన్ పొందుటకు బజాజ్ ఫిన్‎సర్వ్ యాప్ ను ఉపయోగించవచ్చు. ఇది మీకు నిధులు సత్వరమే అవసరమైనప్పుడు ఉత్తమమైన ఎంపిక అవుతుంది. ముందుగా-ఆమోదించబడిన ఆఫర్స్, త్వరిత పంపిణీ, అనువైన కాలపరిమితి ఎంపికలతో ఇది మీ అత్యవసర ఖర్చులను నిర్వహించుకొనుట మంచి ఎంపిక అవుతుంది. అత్యవసరాలలో క్విక్ లోన్ యాప్స్ ఎంత త్వరగా మీకు సహాయం చేయగలవు మరియు ఇవి చాలామందికి ఎందుకు ముఖ్యమైన ఎంపిక అయ్యాయి అనేది ఇప్పుడు మనం చూద్దాము.

1. నిధులకు తక్షణ ప్రాప్యత
ఒక క్విక్ లోన్ యాప్ యొక్క ముఖ్యమైన ఉపయోగాలలో ఒకటి మీరు నిధులను పొందగలిగే వేగము. ప్రక్రియ చేయటానికి రోజులు లేదా వారాలు పట్టే సంప్రదాయికమైన ఋణాల మాదిరిగా కాకుండా, ఒక క్విక్ లోన్ యాప్ మీకు కావలసిన మొత్తాన్ని కేవలం నిమిషాలు లేదా గంటలలో అందించగలదు. డబ్బుకు ఈ వేగవంతమైన ప్రాప్యత, కాలమే ముఖ్యమైన అత్యవసర సమయాలలో చాలా ప్రయోజనకారిగా ఉంటుంది. మీరు ఒక వైద్య చికిత్స కొరకు చెల్లించాలన్నా, పాడైన వాహనాన్ని మరమ్మత్తు చేసుకోవాలన్నా, లేదా అనుకోని ప్రయాణ ఖర్చులను కవర్ చేయాలన్నా, నిధులను సత్వరం పొందగలిగే సామర్థ్యం గణనీయమైన వ్యత్యాసం చూపుతుంది. బజాజ్ ఫిన్‎సర్వ్ ఇన్స్టా పర్సనల్ లోన్ విషయములో, మీకు కావలసిన నిధులను కేవలం 30 నిమిషాల* నుండి 4 గంటలలో పొందగలరు.

Bajaj finserve APP Know the salient features of this quick loan app in emergency fund requirement

2. సులభమైన దరఖాస్తు ప్రక్రియ
ఒక క్విక్ లోన్ యాప్ కొరకు దరఖాస్తు ప్రక్రియ సూటిగా మరియు యూజర్-ఫ్రెండ్లీగా ఉంటుంది. మీరు మీ ఋణము కొరకు ఒక బ్యాంకుకు వెళ్ళకుండా లేదా సుదీర్ఘమైన పేపర్ వర్క్ పూర్తి చేసే అవసరం లేకుండా, మీ స్మార్ట్‎ఫోన్ నుండే దరఖాస్తు చేసుకోవచ్చు. చాలా యాప్స్ కు మీ పేరు, ఆదాయ వివరాలు మరియు బ్యాంక్ ఖాతా నంబరు వంటి ప్రాథమిక సమాచారము అవసరం ఉంటుంది. ఈ సరళత వలన అత్యవసర సమయాలలో ఋణాన్ని పొందుటకు ఆర్ధికపరమైన ప్రక్రియల గురించి తెలియని వారు కూడా సులభంగా దరఖాస్తు చేసుకోగలుగుతారు. బజాజ్ ఫిన్‎సర్వ్ యాప్ తో, ఇన్స్టా పర్సంల్ లోన్ కొరకు మీకు ఒక ముందుగా-ఆమోదించబడిన ఆఫర్ ఉందా అని మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు చేయవలసినదల్లా మీ మొబైల్ నంబరు మరియు ఓటిపి ఎంటర్ చేయడమే. ఇది ఋణ దరఖాస్తు ప్రక్రియను మరింత సరళము మరియు సౌకర్యవంతముగా చేస్తుంది.

3. అనువైన ఋణ మొత్తాలు
క్విక్ లోన్ యాప్ మీరు అప్పుగా తీసుకునే మొత్తానికి సంబంధించి అనుకూలతను అందిస్తాయి. మీకు ఒక చిన్న ఖర్చు కోసం తక్కువ మొత్తం కావలసినా లేదా మరింత ముఖ్యమైన అత్యవసర పరిస్థితి కోసం పెద్ద మొత్తం కావలసినా, ఈ యాప్ మీ అవసరాలకు ఉపయోగపడతాయి. ఈ అనుకూలత మీకు కావలసినంత మాత్రమే అప్పుగా తీసుకునే అవకాశం ఇస్తుంది, తద్వారా అవసరానికి మించిన పెద్ద ఋణాన్ని తిరిగి చెల్లించే భారాన్ని తగ్గిస్తుంది. ఉదాహరణకు, ఒకవేళ మీ కారు అకస్మాత్తుగా పాడైతే మరియు మరమ్మత్తు ఖర్చు రూ. 20,000 అయితే, మీరు క్విక్ లోన్ యాప్ ఉపయోగించి ఆ నిర్దిష్ట మొత్తము కోసం మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు.

4. కనీస డాక్యుమెంటేషన్ అవసరం
సంప్రదాయిక ఋణాలకు ఉన్న సాధారణ ఇబ్బందులలో ఒకటి దానికి కావలసిన విస్తృతమైన డాక్యుమెంటేషన్. ఆదాయ రుజువుల నుండి గుర్తింపు ధృవీకరణ వరకు, ఈ ప్రక్రియ ఎక్కువ సమయం తీసుకోవచ్చు మరియు గజిబిజిగా ఉండవచ్చు. దీనికి వ్యతిరేకంగా, ఒక క్విక్ లోన్ యాప్ కు కనీస డాక్యుమెంటేషన్ అవసరం అవుతుంది. దీనితో ప్రక్రియ వేగంగా మరియు సౌకర్యంగా అవుతుంది. చాలా సందర్భాలలో, మీరు ప్రాథమిక గుర్తింపు మరియు ఆదాయ వివరాలు మాత్రమే అందించవలసి ఉంటుంది. వీటిని మీరు యాప్ ద్వారా నేరుగా అప్లోడ్ చేయవచ్చు. ఈ కనీస డాక్యుమెంటేషన్ అనేది మీ డాక్యుమెంట్స్ అన్నిటికి మీకు యాక్సెస్ ఉండని అత్యవసర పరిస్థితులలో సహాయకారిగా ఉంటుంది. బజాజ్ ఫిన్‎సర్వ్ యాప్ తో, ఎంపిక చేయబడిన వినియోగదారులు తమ ఇన్స్టా పర్సనల్ లోన్ ను ఎలాంటి దస్తావేజులు సబ్మిట్ చేయకుండానే పొందగలరు.*

5. 24/7 అందుబాటు
అత్యవసరాలు ఒక షెడ్యూల్ కు కట్టుబడి ఉండవు; అవి పగలు లేదా రాత్రి అని లేకుండా, ఏ సమయములో అయినా సంభవించవచ్చు. క్విక్ లోన్ యాప్ ఉపయోగించడములోని ముఖ్యమైన ఉపయోగం ఏమిటంటే, ఇది 24/7 అందుబాటులో ఉంటుంది. స్థిరమైన పనిగంటలలో మాత్రమే పనిచేసే సంప్రదాయిక బ్యాంకుల మాదిరి కాకుండా, ఒక క్విక్ లోన్ యాప్ వలన మీరు ఋణము కోసం ఏ సమయములో అయినా, ఎక్కడి నుండైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రౌండ్-ది-క్లాక్ అందుబాటు వలన మీరు అత్యవసర పరిస్థితి ఉత్పన్నం అయినప్పుడు నిధుల ప్రాప్యత పొందవచ్చు. ఇది కేవలం కొన్ని టాప్స్ దూరములో ఉందని తెలుసుకొని మనశ్శాంతిగా ఉండవచ్చు.

6. కొల్లాటరల్ అవసరం లేదు
చాలా సంప్రదాయిక ఋణాలకు ఋణానికి సురక్షతను అందించుటకు ఆస్తి లేదా విలువైన ఆస్తుల వంటి కొల్లాటరల్ అవసరం ఉంటుంది. ఈ ఆవశ్యకత ప్రధాన అవరోధం కావచ్చు, ముఖ్యంగా కొల్లాటరల్ ఏర్పాటు చేయటానికి మీకు సమయం లేదా వనరులు ఉండని అత్యవసర పరిస్థితులలో. ఒక క్విక్ లోన్ యాప్ సాధారణంగా అసురక్షితమైన ఋణాలను అందిస్తుంది, అంటే మీరు ఎలాంటి ఆస్తులను తాకట్టు పెట్టవలసిన పని ఉండదు. ఈ కొల్లాటరల్-అవసరం లేని ఫీచర్ వలన ప్రజలు తమ విలువైన ఆస్తులను ప్రమాదంలో పెట్టే ఒత్తిడి లేకుండా నిధులను సులభంగా వెంటనే పొందగలుగుతారు.

ముగింపు
ముగింపుగా, ఒక క్విక్ లోన్ యాప్ అత్యవసర పరిస్థితులలో ఒక అమూల్యమైన సాధనము కాగలదు. సులభమైన దరఖాస్తు ప్రక్రియ, కనీస డాక్యుమెంటేషన్ మరియు 24/7 అందుబాటులతో కలిపి నిధులకు తక్షణ ప్రాప్యతను ఇచ్చే దీని సామర్థ్యము దీనిని సౌకర్యవంతమైన మరియు విశ్వసనీయమైన పరిష్కారముగా చేస్తుంది. మీరు ఒక వైద్య విపత్తులో ఉన్నా, అనుకోని ఇంటి మరమ్మత్తులు వచ్చినా లేదా వేరే ఏదైనా అత్యవసర ఖర్చు వచ్చినా, ఒక క్విక్ లోన్ యాప్ ఈ పరిస్థితులను సులభంగా అధిగమించుటకు సహాయపడుతుంది. అనుకూలత, పారదర్శకత మరియు నియంత్రణలను అందించడము ద్వారా ఈ యాప్స్ సవాళ్లు విసిరే సమయాలలో మీ ఆర్ధిక విషయాలను సమర్థవంతంగా నిర్వహించుకొనుటకు సాధికారతను ఇస్తాయి. ఈరోజే బజాజ్ ఫిన్‎సర్వ్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి మరియు మీ ఇన్స్టా పర్సనల్ లోన్ ఆఫర్ ను చెక్ చేసుకోండి.

*నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+