College girl: ఆత్మలతో మాట్లాడాలని ఆశ, ఆన్ లైన్ క్లాసులు వదిలేసి యూట్యూబ్ లో?, రెండు నెలలు!
బెంగళూరు: ఆన్ లైన్ క్లాసుల్లో చదువుతున్న కాలేజ్ అమ్మాయి పక్కదారి పట్టింది. కాలేజ్ పుస్తకాలు చదువుకోవడం మానేసిన యువతి ఆత్మలతో ఎలా మాట్లాడాలి ? అంటూ యూట్యూబ్ లో ఎక్కువగా వీడియోలు చూసింది. మంత్రాలు, తంత్రాలు, క్షుద్రపూజలు ఎలా చెయ్యాలి అంటూ గూగుల్ లో ఎక్కువగా వెతికింది. ఆత్మలతో మాట్లాడాలని, ఆత్మలతో స్నేహం చెయ్యాలని, ఆత్మలతో మాట్లాడుతూ సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఆ అమ్మాయి ఊహించుకుంది. ఇంటర్ చదువుతున్న ఆ అమ్మాయి నేను ఆత్మలతో మాట్లాడటానికి రీసెర్చ్ చేస్తానని ఆమె కుటుంబ సభ్యులకు చెప్పింది.
మొదట బుద్దిగా ఇంటర్ పూర్తి చెయ్యాలని ఆ అమ్మాయికి తల్లిదండ్రులు చెప్పారు. రెండు నెలల క్రితం రెండు జతల బట్టలు చిన్న బ్యాగ్ లో పెట్టుకున్న ఆ యువతి బీరువాలో చిక్కిన డబ్బులు ఎత్తుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఆ అమ్మాయి అడ్రస్ లేదు. రెండు నెలలు పూర్తి అయినా ఇంత వరకు ఆ అమ్మాయి ఆచూకి లేకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

బెంగళూరులో ఇంటర్ అమ్మాయి
బెంగళూరులో నివాసం ఉంటున్న అనుష్కా (17) అనే యువతి ప్రముఖ ప్రైవేట్ కాలేజ్ లో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. ఆన్ లైన్ క్లాసుల్లో చదువుతున్న కాలేజ్ అమ్మాయి అనుష్కా పక్కదారి పట్టింది. కాలేజ్ పుస్తకాలు చదువుకోవడం మానేసిన అనుష్కా సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో ఎక్కువగా వీడియోలు చూడటం మొదలు పెట్టింది.

ఆత్మలతో మాట్లాడాలని, ఫేమస్ అయిపోవాలని ఆశ?
ఆత్మలతో ఎలా మాట్లాడాలి ?, ఆత్మలను ఎలా లొంగదీసుకోవాలని అంటూ అనుష్కా యూట్యూబ్ లో ఎక్కువగా వీడియోలు చూసింది. మంత్రాలు, తంత్రాలు, క్షుద్రపూజలు ఎలా చెయ్యాలి అంటూ అనుష్కా గూగుల్ లో ఎక్కువగా వెతికింది. ఇలా కాలేజ్ ఆన్ లైన్ క్లాసులు పక్కన పెట్టిన అనుష్కా ఎక్కువగా క్షుద్రపూజలకు సంబంధించిన విషయాలనే ఎక్కువగా గూగుల్ లో వెతికింది.

ఫస్ట్ ఇంటర్ పూర్తి చెయ్యాలని చెప్పిన ఫ్యామిలీ
నేను ఆత్మలతో మాట్లాడటానికి రీసెర్చ్ చేస్తానని అనుష్కా ఆమె కుటుంబ సభ్యులకు చెప్పింది. మొదట బుద్దిగా ఇంటర్ పూర్తి చెయ్యాలని అనుష్కాకు ఆమె తల్లిదండ్రులు చెప్పారు. ఇంటర్ పూర్తి కాకుండానే అనుష్కా ఎందుకు ఎక్కువ అతిగా ఆలోచిస్తోందని ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అయితే అనుష్కా మాత్రం ఆన్ లైన్ లో కాలేజ్ అధ్యాపకులు చెప్పే పాఠాలు పక్కన పెట్టి ఆత్మలతో ఎలా మాట్లాడాలి అంటూ వెతకడం మొదలు పెట్టింది.

మాయం అయిపోయిన యువతి
అక్టోబర్ 31వ తేదీన ఇంట్లో రెండు జతల బట్టలు చిన్న బ్యాగ్ లో పెట్టుకున్న అనుష్కా బీరువాలో ఉన్న డబ్బులు ఎత్తుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. ఆ రోజు నుంచి అనుష్కా అడ్రస్ లేకుండాపోయింది. అనుష్కా ఇంటి నుంచి బయటకు వెళ్లిన రెండు రోజుల నుంచి ఆమె కోసం ఆమె తల్లిదండ్రులు అభిషేక్, అర్చనా, వారి కుటుంబ సభ్యులు గాలించారు.

ఎప్పటికైనా వస్తుందని ఆశ
రెండు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిన అనుష్కా ఇప్పటి వరకు అడ్రస్ లేదు. రెండు నెలలు పూర్తి అయినా ఇంత వరకు ఆ అమ్మాయి అనుష్కా ఆచూకి లేకపోవడంతో ఆమె తల్లిదండ్రులు అభిషేక్, అర్చనా, వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. మా అమ్మాయి అనుష్కా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుందని, ఆమె కోసం సోషల్ మీడియా సహాయంతో వెతుకుతున్నామని అనుష్కా తల్లిదండ్రులు అభిషేక్, అర్చనా వారిని కలిసిన మీడియాకు చెప్పారు. బెంగళూరు పోలీసులు కూడా ఇంటర్ కాలేజ్ అమ్మాయి అనుష్కా కోసం గాలిస్తున్నా ఇప్పటి వరకు ఆమె ఆచూకి మాత్రం చిక్కలేదు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications