New Year: న్యూఇయర్ పార్టీల్లో డ్రగ్స్ కిక్ కు స్కెచ్, ఆయ్... శ్రీకాకులం సరుకండి, రూ. కోట్లలో, రెడ్డి దెబ్బకు!

బెంగళూరు/గోవా: ఐటీ హబ్ బెంగళూరులో న్యూఇయర్ వేడుకల సందర్బంగా డ్రగ్స్ సరఫరా చెయ్యడానికి ప్రయత్నించిన నిందితులు పోలీసులకు అడ్డంగా చిక్కిపోయారు. న్యూఇయర్ సందర్బంగా జోరుగా డ్రగ్స్ చేతులుమారుతోందని పక్కా సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసుల దాడుల్లో ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, బెంగళూరుకు చెందినవారు, విదేశీయులు చిక్కిపోయారు. న్యూఇయర్ సందర్బంలో బెంగళూరులో కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ పోలీసులకు చిక్కడం హాట్ టాపిక్ అయ్యింది.

న్యూఇయర్ పార్టీలకు రూ. 6 కోట్ల డ్రగ్స్

న్యూఇయర్ పార్టీలకు రూ. 6 కోట్ల డ్రగ్స్

న్యూ ఇయర్ సందర్భంగా బెంగళూరులోని వివిద ప్రాంతాల్లో జరుగుతున్న పార్టీలకు డ్రగ్స్ సరఫరా చేసే అవకాశం ఉందని బెంగళూరు పోలీసులకు అనుమానం వచ్చింది. డ్రగ్స్ మాఫియాపై భారీ ఆపరేషన్ నిర్వహించిన బెంగళూరు సీసీబీ పోలీసులు, బెంగళూరులో జరుగుతున్న పార్టీలకు సరఫరా చేసేందుకు నిల్వ ఉంచిన రూ.6.31 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు..

ఆయ్.... శ్రీకాకులం సరుకండి

ఆయ్.... శ్రీకాకులం సరుకండి

రూ. 6 కోట్ల డ్రగ్స్ సీజ్ చేసిన పోలీసులు విదేశీయులతో సహా 8 మంది పెడ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీకి చెందిన జాకబ్ వినోద్, అతని సహచరులు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం అటవీ ప్రాంతం సమీపంలో నివాసం ఉంటున్న రమణ సన్నపాటి అలియాస్ రమణ, కదిరిలో నివాసం ఉంటున్న ఇర్ఫాన్ అలీ, షేక్ మహ్మద్, బెంగళూరులోని నీలసంద్రలో నివాసం ఉంటున్న మహ్మద్ ఇర్ఫాన్, అడుగోడికి చెందిన ఇలియాస్, విదేశీయుడు కౌవ్ ఇస్సె సెబాస్టియన్‌లను అరెస్టు చేసి నిందితుల నుంచి రూ.6.31 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

న్యూఇయర్ టార్గెట్

న్యూఇయర్ టార్గెట్

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డ్రగ్స్ సరఫరా, సేవలను పర్యవేక్షించేందుకు సీసీబీ నార్కోటిక్ స్క్వాడ్ ఏసీపీ రామచంద్ర ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. బనసవాడి, కొత్తనూరు దిన్నే, ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్ల పరిధిలో గత నెల రోజులుగా డ్రగ్స్ నెట్‌వర్క్‌పై ప్రత్యేక బృందాలు సమాచారాన్ని సేకరించామని బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ సిహెచ్. ప్రతాప్ రెడ్డి మీడియాకు చెప్పారు.

ఆంధ్రా, గోవా, ఢిల్లీ నుంచి డ్రగ్స్ తెచ్చి?

ఆంధ్రా, గోవా, ఢిల్లీ నుంచి డ్రగ్స్ తెచ్చి?

నిందితులు ఆంధ్రప్రదేశ్, గోవా, ఢిల్లీలోని డ్రగ్స్ నెట్‌వర్క్ నుంచి తక్కువ ధరకు డ్రగ్స్ తెచ్చి బెంగళూరు నగరంలో విక్రయించేందుకు సిద్ధమయ్యారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, పార్టీలకు అధిక ధరలకు డ్రగ్స్ విక్రయించాలనేది నిందితుల పక్కాప్లాన్ వేశారని బెంగళూరు సిటీ పోలీసు కమిషనర్ ప్రతాప్ రెడ్డి వివరించారు.

ఢిల్లీలో డీల్ రాజా డీల్

ఢిల్లీలో డీల్ రాజా డీల్

ఢిల్లీకి చెందిన జాకబ్ వినోద్ వృత్తిరీత్యా డ్రగ్స్ వ్యాపారి, కొన్నాళ్లుగా బెంగళూరులోని కొత్తనూరులో జాకబ్ వినోద్ నివాసం ఉంటున్నాడు. నాలుగేళ్ల క్రితం 50 కిలోల గంజాయి విక్రయిస్తుండగా బెంగళూరు పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లాడు. బెయిల్ మీద బయటకు వచ్చిన తరువాత జాకబ్ గోవాకు వెళ్లి అక్కడ బీచ్, హోటళ్లలో పని చేస్తున్నాడ ప్రతాప్ రెడ్డి అన్నారు. బెంగుళూరు నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసేందుకు గోవా వెళ్తున్న విదేశీ పెడ్లర్లు, కస్టమర్లతో జాకబ్‌కు పరిచయం ఏర్పడింది.

నైజీరియన్లు

నైజీరియన్లు

జాకబ్ గోవాలోని నైజీరియన్ పెడ్లర్ల నుంచి తక్కువ ధరకు డ్రగ్స్ కొనుగోలు చేసి, అక్కడి నుంచి బెంగళూరు సిటీకి అక్రమంగా తరలించి తన సహచరుల ద్వారా అధిక ధరలకు కస్టమర్లకు డెలివరీ చేసేవాడు. అదేవిధంగా నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డ్రగ్స్ కు డిమాండ్ రావడంతో నాలుగైదు నెలల క్రితం కొత్తనూరు సమీపంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్న జాకబ్ డ్రగ్స్ సేకరించాడు. రెండు సంవత్సరాల క్రితం పరప్ప అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్న జాకబ్ ఇప్పుడు మళ్లీ అక్కడికి వెళ్లాడు.

విదేశాల నుంచి స్టూడెంట్ వీసాతో వచ్చి?

విదేశాల నుంచి స్టూడెంట్ వీసాతో వచ్చి?

రెండేళ్ల క్రితం స్టూడెంట్ వీసాపై ఇండియాకు వచ్చిన సెబాస్టియన్ డబ్బుల కోసం డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నాడు. విదేశీ వ్యాపారుల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి బెంగళూరు నగరంలో విక్రయిస్తుండేవాడు. అతని సోదరుడు కూడా పెడ్లర్ అని, కన్నడ సినీ నటీమణులకు సంబంధించిన డ్రగ్స్ కేసులో మూడేళ్ల క్రితం జైలుకెళ్లాడని బెంగళూరు సీసీబీ పోలీసు అధికారులు తెలిపారు. న్యూఇయర్ కు ఒక్కరోజు ముందు బెంగళూరులో రూ. 6 కోట్ల డ్రగ్స్ పట్టుబడటంతో ఎంజాయ్ చెయ్యాలని అనుకున్న డ్రగ్స్ ప్రియులు షాక్ అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+