Drug Case: నో బెయిల్, ప్రైవేటు ఆసుపత్రిలో ప్రముఖ హీరోయిన్, మూడు నెలలు జైల్లో, తీవ్ర అనారోగ్యం!
బెంగళూరు/ ముంబాయి/ న్యూఢిల్లీ: బెంగళూరు డ్రగ్స్ మాఫియా కేసులో అరెస్టు అయ్యి బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో విచారణ ఖైదీగా ఉన్న స్యాండిల్ వుడ్ బ్యూటీ, హనీ రాగిణి ద్వివేది షాక్ కు గురైయ్యింది. తీవ్ర అనారోగ్యగానికి గురైన స్యాండిల్ వుడ్ నటి రాగిణి ద్వివేదిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. తనకు డ్రగ్స్ గురించి ఏపాపం తెలీదని, బెయిల్ మంజూరు చెయ్యాలని నటి రాగిణి పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. రాగిణికి బెయిల్ ఇవ్వరాదని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గట్టిగా వాదించడంతో ఆమె బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడుతూనే వస్తోంది. బెయిల్ రాకపోవడంతో బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉన్న నటి రాగిణి ద్వివేది కన్నీరు పెట్టుకుంటున్నది. బ్రాహ్మా ఏమిటి నాకు ఈ ఖర్మ అంటూ రాగిణి ఆవేదనతో అనారోగ్యానికి గురైయ్యింది.

హీరోయిన్ ప్రయత్నాలు
బెంగళూరు డ్రగ్స్ మాఫియా కేసులో అరెస్టు అయిన స్యాండిల్ వుడ్ బ్యూటీ క్వీన్ తనకు బెయిల్ మంజూరు చెయ్యాలని బెంగళూరులోని ప్రత్యేక కోర్టుకు మనవి చేసింది. డ్రగ్స్ కేసు విచారణలో ఉందని, ఇలాంటి సమయంలో నటి రాగిణికి బెయిల్ మంజూరు చేస్తే ఆమె జైలు నుంచి బయటకు వచ్చి సాక్షుల మీద, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ప్రభావం చూపిస్తుందని, దయచేసి బెయిల్ ఇవ్వకూడదని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు మనవి చెయ్యడంతో రాగిణికి చెక్కెదురైయ్యింది.

సీసీబీ పోలీసుల దెబ్బ
స్యాండిల్ వుడ్ నటి రాగిణి ద్వివేదికి బెయిల్ ఇవ్వకూడదని బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కోర్టుకు పదేపదే మనవి చేశారు. వాదనలు విన్న బెంగళూరు ప్రత్యేక కోర్టు నటి రాగిణికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉంటున్న నటి రాగిణి ద్వివేది తనకు ఇంత వరకు బెయిల్ రాలేదని తెలుసుకుని బోరన విలపించినా ఫలితం లేదు.

ఎదురు దెబ్బలతో షాక్
స్యాండిల్ వుడ్ నటి రాగిణి ద్వివేదికి అనారోగ్యంగా ఉందని, ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందడానికి అవకాశం ఇవ్వాలని ఆమె తరపు న్యాయవాదులు ఇంతకు ముందే కోర్టులో మనవి చేసినా కోర్టు అందుకు అంగీకరించలేదు. పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో అన్ని సదుపాయాలతో ఆసుపత్రి ఉందని, నటి రాగిణి అక్కడ చికిత్స పొందవచ్చని కోర్టు సూచించింది. బయట నుంచి భోజనం తెప్పించుకోవడానికి నటి రాగిణి ప్రయత్నించింది. బయట కరోనా వైరస్ తాండవం చేస్తోంది, బయట నుంచి భోజనం తెప్పించుకోవడానికి తాము అనుమతి ఇవ్వమని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు అధికారులు స్యాండిల్ వుడ్ బ్యూటీ రాగిణి ద్వివేది కోరిక మీద నీళ్లు చల్లడంతో ఆ కోరిక తీరలేదు.

మూడు నెలలు అయినా నో బెయిల్
బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో తయారు చేసిన భోజనం నటి రాగిణికి అందిస్తున్నారు. ఇంతకాలం ఏ వంటలు కావాంటే ఆవంటలు చేయించుకుని ఎడాపెడా ఆరగించిన నటి రాగిణి ద్వివేది డ్రగ్స్ కేసు దెబ్బకు జైల్లో మూడు నెలల నుంచి చిప్పకూడు తినాల్సివచ్చింది. పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో రాత్రిపూట నిద్రపట్టక నటి రాగిణి రాత్రి పూర్తిగా జాగారం చేస్తోందని ఆమె సన్నిహితులు అంటున్నారు.

సుప్రీం కోర్టుకు రాగిణి
బెంగళూరు డ్రగ్స్ మాఫియా కేసులో నటి రాగిణి ద్వివేది అరెస్టు అయ్యి మూడు నెలలకు పైగా అవుతోంది. బెంగళూరు ప్రత్యేక కోర్టు, కర్ణాటక హై కోర్టు నటి రాగణికి బెయిల్ ఇవ్వడానికి ఇప్పటికే నిరాకరించాయి. తనకు బెయిల్ మంజూరు చెయ్యాలని నటి రాగిణి సుప్రీం కోర్టును ఆశ్రయించింది. నటి రాగిణికి బెయిల్ ఇప్పించాలని ఆమె న్యాయవాది అజ్మల్ పాషా అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

ఆసుపత్రిలో హీరోయిన్ రాగిణి
బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉన్న నటి రాగిణి తీవ్ర అనారోగ్యానికి గురైయ్యింది. ఊపిరి ఆడకపోవడం, ఎక్కువ కడుపునొప్పి రావడంతో సెంట్రల్ జైలులోని ఆసుపత్రిలో నటి రాగిణికి చికిత్స అందించారు. జైల్లో ఉన్న వైద్యులు నటి రాగిణిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలని శిఫారస్సు చెయ్యడంతో ఆమెను గురువారం ఉదయం 10 గంటలకు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

వైద్య నివేదిక కీలకం !
ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు ఇచ్చే నివేదిక ఆధారంగా నటి రాగిణి ద్వివేదికి షరతులో జామీను మంజూరు చెయ్యాలని ఆమె న్యాయవాది అజ్మల్ పాషా కోర్టును ఆశ్రయించడానికి సిద్దం అయ్యారని తెలిసింది. ఇప్పటికే బెంగళూరు డ్రగ్స్ మాఫియా కేసులో అరెస్టు అయిన మరో నటి సంజనా గల్రానీ ఇటీవల బెయిల్ మీద బయటకు వచ్చిన విషయం తెలిసిందే. సంజనా కంటే రాగిణి అంతకు ముందే ఆరెస్టు అయినా ఆమెకు ఇంత వరకు బెయిల్ మంజూరు కాలేదు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications