జయలలిత వస్తువులు వేలం, ఎన్ని కేజీల బంగారం ఉందో తెలుసా?, 11 వేల పట్టు చీరలు!
బెంగళూరు/చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి 'అమ్మ' జయలలిత పేరు చెబితే దక్షిణ భారతదేశంలోని సామాన్య ప్రజలు, రాజకీయాలు తెలిసిన వాళ్లు ఆమె ధైర్యసాహసాలను మెచ్చుకోకుండా ఉండలేరు. తమిళనాడు రాజకీయాలు శాసించిన జయలలితకు చెందిన ఖరీదైన వస్తువులు వేలం వెయ్యడానికి ప్రత్యేక కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఆదాయానికి మంచిన అక్రమాస్తుల కేసులో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఇంటిలోని విలువైన వస్తులవతో పాటు బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అక్రమాస్తుల కేసులో జయలలితకు నాలుగు ఏళ్లు జైలు శిక్ష, రూ. 100 కోట్ల జరిమానా విధిస్తూ బెంగళూరులోని ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు చెప్పింది.

జయలలిత ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం, వెండి, పట్టుచీరలు, విలువైన వస్తువులు భద్రపరచాలని బెంగళూరు సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. జైలుకు వెళ్లకముందే అనారోగ్యంతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో జయలలిత ప్రాణాలు వదిలేశారు.
జయలలిత అక్రమాస్తుల కేసులో ఆమె నెచ్చెలి వీకే. శశికళతో పాటు ఇళవరసి, సుధాకరన్ బెంగళూరు జైలుకు వెళ్లి జైలు శిక్ష పూర్తిగా అనుభవించి జైలు నుంచి విడుదలైనారు. జయలలిత ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న కోట్లాది రూపాయల విలువైన వస్తువులు వేలం వెయ్యడానికి బెంగళూరు ప్రత్యేక కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అందుకు కర్ణాటక రాష్ట్రానికి చెందిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ కిరణ్ ఎస్, జవళి అనే ఆయన్ను నియమిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు జయలలితకు చెందిన కోట్లాది రూపాయల విలువైన వస్తువులను బెంగళూరులో వేలం వెయ్యడానికి చర్యలు తీసుకుంటున్నారు.
అప్పట్లో చెన్నైలోని పోయస్ గార్డెన్ లోని అమ్మ జయలలిత ఇంటి నుంచి 7 కేజీల బరువు ఉన్న 468 ఆభరాలు, అందులో వజ్రాలుతో కూడిన బంగారు నగలు ఉన్నాయి. బంగారు నగలతో పాటు 700 కేజీల వెండి వస్తువులు, ఖరీదైన 740 జతల పాదరక్షకలు (చెప్పులు),, 11, 344 ఖరీదైన పట్టు చీరలు, 250 శాలువలు ఉన్నాయి.
వాటితె పాటు 12 రీప్రిజిరేటర్లు, 10 టీవీ సెట్ లు, నాలుగు సీడీ ప్లేయర్లు, 8 వీసీఆర్ లు, 1 వీడయో కెమెరా, 24 టూ ఇన్ వన్ టేప్ రికార్డర్లు, రెండు ఆడియో డెక్ లు, 3 ఐరన్ బాక్స్ లు, 1,040 వీడియో క్యాసెట్లను అధికారులు సీజ్ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు బంగారు నగలు, వెండి వస్తువులు, పట్టు చీరలతో పాటు జయలలితకు చెందిన వస్తులు మొత్తం వేలం వెయ్యడానికి అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications