Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Birthday: రెండు సింహాల మద్యలో హీరో ఫోటోలు, పుట్టిన రోజు దున్నపోతును బలి ఇచ్చిన ఫ్యాన్స్, వైరల్!

బెంగళూరు/ బళ్లారి: సినిమా హీరోల అభిమానులు వారి అభిమాన నటుడి పుట్టిన రోజు వేడుకలు ఏ రైంజ్ లో చేస్తారో అనే విషయం మనం చాలానే చూస్తుంటాము. భారీ ఫ్లెక్సీలు, కౌటౌట్ లు, బ్యానర్లు ఏర్పాటు చేసి గజమాలలు వేస్తుంటారు. వందలాది లీటర్ల పాలతో పాలాభిషేకం చేస్తుంటారు. అన్నదానాలు, రక్తదానాలు, నేత్రదానాలు చేస్తుంటారు. పేదలకు నిత్యవసర వస్తువులు, దుస్తులు, దప్పట్లు పంచిపెడుతుంటారు. ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు, బ్రెడ్ పంచిపెట్టిన సందర్బాలు చాలానే ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక స్టార్ హీరో అభిమానులు తన అభిమాన నటుడి పుట్టిన రోజు సందర్బంగా అతి తెలివి ఉపయోగించారు.

అందరిలో గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నించిన ఆ వీరాభిమానులు తమ అభిమాన హీరో పుట్టిన రోజు సందర్బంగా భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రెండు సింహాలు నడుచుకుని వస్తుంటే మద్యలో అభిమాన హీరో ఫోటోలు ఉండేలా పెద్ద భ్యానర్లు ఏర్పాటు చేశారు. హీరో ఫ్యాన్స్ అందరిని అక్కడికి పిలిపించిన ఆ వీరాభిమానులు ఓ దున్నపోతును తోలుకుని వచ్చారు.

మా అభిమాన హీరో జిందాబాద్, ఇక ముందు మా హీరో నటించిన సినిమాలు అన్నీ సూపర్ డూపర్ హిట్ కావాలని గట్టిగా నినాదాలు చేసిన ఆ వీరాభిమానులు ఆయన ఫోటో ముందు దున్నపోతును బలి ఇవ్వడం, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం హాట్ టాపిక్ అయ్యింది. జంతు బలిని చాలా మంది వ్యతిరేకిస్తున్న సమయంలో ఓ స్టార్ హీరో పుట్టిన రోజు సందర్బంగా అభిమానులు దున్నపోతును బలి ఇవ్వడం వివాదానికి కారణం అయ్యింది.

బహుబాషా నటుడు

బహుబాషా నటుడు

కన్నడ స్టార్ హీరో సుదీప్ గురించి సినీ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలీవుడ్ సూపర్ స్టార్, బిగ్ బి అమితాబ్ బచ్చన్, మెగాస్టార్ చిరంజీవి, అలనాటి అందాల నటి శ్రీదేవి తదితరుల స్టార్ హీరోలు అందరితో కలిసి నటించిన సుదీప్ కు భారతేదశ సినీరంగంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా సుదీప్ అతని సత్తా నిరూపించుకున్నాడు.

ఈగ ఫేమ్ తో తెలుగులో అభిమానులు

ఈగ ఫేమ్ తో తెలుగులో అభిమానులు

రామ్ గోపాల్ వర్మ నిర్మించిన కొన్ని సినిమాల్లో నటించిన సుదీప్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు, రక్తచరిత్ర సినిమాలో కూడా పోలీసు అధికారి పాత్రలో నటించిన సుదీప్ తెలుగు అభిమానులకు దగ్గర అయ్యారు. ఇక ఎస్ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాలో విలన్ గా నటించిన సుదీప్ ఆ సినిమాలో హీరో నాని, హీరోయిన్ సమంత కంటే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుని సినీ అభిమానులకు చాలా దగ్గర అయ్యారు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

పవర్ స్టార్ పుట్టిన రోజే సుదీప్ బర్త్ డే

పవర్ స్టార్ పుట్టిన రోజే సుదీప్ బర్త్ డే

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు (సెప్టెంబర్ 2వ తేది) నాడు కన్నడ స్టార్ హీరో సుదీప్ పుట్టిన రోజు కావడం విశేషం. గురువారం హీరో సుదీప్ అభిమానులు ఘనంగా ఆయన పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. కోవిడ్ కారణంగా తన పుట్టిన రోజు వేడుకలను ఎవ్వరు నిర్వహించుకోరాదని హీరో సుదీప్ ఆయన అభిమానులకు పదేపదే మనవి చేశారు. అయితే బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలోని ప్రతిజిల్లాలో హీరో సుదీప్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు.

హీరోలు అంటే ఫ్యాన్స్ కు పిచ్చి

హీరోలు అంటే ఫ్యాన్స్ కు పిచ్చి

ఏ బాష అయినా హీరోలను అభిమానులు ప్రత్యేకంగా పూజిస్తుంటారు. సినిమా హీరోల అభిమానులు వారి అభిమాన నటుడి పుట్టిన రోజు వేడుకలు ఏ రైంజ్ లో చేస్తారో అనే విషయం మనం చాలానే చూస్తుంటాము. భారీ ఫ్లెక్సీలు, కౌటౌట్ లు, బ్యానర్లు ఏర్పాటు చేసి గజమాలలు వేస్తుంటారు. వందల లీటర్ల పాలతో పాలాభిషేకం చేస్తుంటారు.

అన్నదానాలు, రక్తదానాలు, నేత్రదానాలు చేస్తుంటారు. పేదలకు నిత్యవసర వస్తువులు, దుస్తులు, దప్పట్లు పంచిపెడుతుంటారు. ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు, బ్రెడ్ పంచిపెట్టిన సందర్బాలు చాలానే ఉన్నాయి.

వీడు మామూలోడు కాదు

వీడు మామూలోడు కాదు

కర్ణాటకలోని బళ్లారి జిల్లా సండూరులో స్టార్ హీరో సుదీప్ అభిమాని తన అభిమాన నటుడి పుట్టిన రోజు సందర్బంగా అతి తెలివి ఉపయోగించారు. అందరిలో గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నించిన సుదీప్ వీరాభిమాని తన అభిమాన హీరో పుట్టిన రోజు సందర్బంగా భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. రెండు సింహాలు నడుచుకుని వస్తుంటే మద్యలో అభిమాన హీరో సుదీప్ ఫోటోలు ఉండేలా పెద్ద భ్యానర్ ఏర్పాటు చేశాడు. హీరో సుదీప్ ఫ్యాన్స్ అందరిని అక్కడికి పిలిపించిన ఆ వీరాభిమాని ఓ దున్నపోతును తోలుకుని వచ్చాడు.

హీరోకు దున్నపోతును దిష్టి తీసి బలి ఇచ్చేశారు

హీరోకు దున్నపోతును దిష్టి తీసి బలి ఇచ్చేశారు

మా అభిమాన హీరో కిచ్చా సుదీప్ జిందాబాద్, ఇక ముందు మా హీరో సుదీప్ నటించిన సినిమాలు అన్నీ సూపర్ డూపర్ హిట్ కావాలని గట్టిగా నినాదాలు చేసిన ఆ వీరాభిమాని ఆయన ఫోటో ముందు దున్నపోతు దిష్టి తీసినట్లు అటూఇటూ తిప్పాడు. దున్నపోతు అక్కడి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించినా దానిని వదిలి పెట్టకుండా హీరో సుదీప్ ఫ్లెక్సీలు, కటౌట్ ముందు బలి ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది.

Recommended Video

    Pawan Kalyan రాజ్యాన్ని ఏలడానికి 6 సూత్రాలు | Bheemla Nayak || Oneindia Telugu
    గతంలో వార్నింగ్ ఇచ్చిన హీరో

    గతంలో వార్నింగ్ ఇచ్చిన హీరో

    కన్నడ హ్యాట్రిక్ హీరో శివరాజ్ కుమార్, సుదీప్ హీరోలుగా నటించిన ది విలన్ సినిమా విడుదల సందర్బంగా కర్ణాటకలో సుదీప్ ఫ్యాన్స్ ఇలాగే దున్నపోతును బలి ఇచ్చి వివాదానికి కారణం అయ్యారు. తన పుట్టిరోజు సందర్బంగా, సినిమా విడుదల సందర్బంగా జంతు బలి ఇవ్వకూడదని అప్పట్లో హీరో సుదీప్ అయన అభిమానులకు వార్నింగ్ ఇచ్చారు. అయినా అదే హీరో సుదీప్ అభిమానులు ఇప్పుడు ఆయన పుట్టిన రోజు సందర్బంగా మరోసారి దున్నపోతును బలి ఇచ్చారు.

    హీరో సుదీప్ బర్త్ డే సందర్బంగా దున్నపోతును బలి ఇస్తున్న సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జంతు బలిని చాలా మంది వ్యతిరేకిస్తున్న సమయంలో ఓ స్టార్ హీరో పుట్టిన రోజు సందర్బంగా అభిమానులు దున్నపోతును బలి ఇవ్వడం వివాదానికి కారణం అయ్యింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+