రెబల్స్ దెబ్బ ఎలా ఉంటుందంటే ?, ఢిల్లీకి మాజీ సీఎం, నడ్డాతో ఢీల్, ఎస్ ఆర్ నో చెప్పండి?
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి ఏకంగా మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్ కు టిక్కెట్ ఇవ్వడానికి నిరాకరించిన బీజేపీ హైకమాండ్ ఇప్పుడు మరోసారి ఆలోచనలో పడిందని తెలిసింది. బీజేపీ హైకమాండ్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన మాజీ సీఎం జగదీష్ శెట్టర్ 24 గంటలు గడువక ముందే ఢిల్లీ వెళ్లి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ. నడ్డాతో భేటీ కావడం హాట్ టాపిక్ అయ్యింది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తకొత్త ప్రయోగాలు చెయ్యాలని అనుకున్న బీజేపీ హైకమాండ్ కు మొదటికే మోసం వచ్చేటట్లు ఉందని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్ తరహాలో ప్రయోగాలు చెయ్యాలని బీజేపీ హైకమాండ్ ప్రయత్నాలు చేస్తోంది. అయితే బీజేపీ సీనియర్లు చాలా మంది తిరుబాటు చెయ్యడానికి సిద్దం కావడంతో బీజేపీ హైకమాండ్ అయోమయంలో పడిందని తెలిసింది.

ఎప్పుడు వన్ వేలో ప్రయాణించాలని అనుకుంటే కష్టమని, దారిపోడవునా హైవేలు మాత్రమే ఉండవని, సర్వీసు రోడ్డులు కూడా ఉంటాయని కర్ణాటకకు చెందిన కొందరు బీజేపీ నాయకులు ఆ పార్టీ హైకమాండ్ నేతలకు తెలిసి వచ్చేలా చేస్తున్నారు. గుజరాత్ ప్రయోగాలు దేశం మొత్తం చెయ్యాలని అనుకోవడం చాలా పొరపాటు అని కొందరు బీజేపీ నాయకులు అంటున్నారు.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సినియర్ ఎమ్మెల్యే జగదీష్ శెట్టర్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి అవకాశం ఇవ్వకుండా కొత్త అభ్యర్థిని బీజేపీ హైకమాండ్ బరిలోకి దింపింది. అయితే మాజీ సీఎం జగదీష్ శెట్టర్ బీజేపీ హైకమాండ్ మీద తిరుగుబాటు చేసి తాను స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తానని బహిరంగంగా మీడియా ముందు తేల్చి చెప్పారు.
ఈ దెబ్బతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ, నడ్డా వెంటనే మాజీ సీఎం జగదీష్ శెట్టర్ ను ఢిల్లీ పిలిపించుకుని ప్రత్యేకంగా ఆయనతో చర్చలు జరిపారు. జేపీ, నడ్డా, మాజీ సీఎం మధ్య ఏం చర్చలు జరిగాయో ? అనే విషయం బయటకు రాకపోయినా మ్యాటర్ మాత్రం రాజీకి పిలిచారని అర్థం అవుతోందని కొందరు బీజేపీ నాయకులు అంటున్నారు.
అయితే మాజీ సీఎం జగదీష్ శెట్టర్ కు ఆయనతో ఇంతకాలం వెంటనడిచిన బీజేపీ కార్యకర్తలు, స్థానిక మెజారిటీ ఓటర్లు సంపూర్ణ మద్దతు ఇవ్వడంతో స్వతంత్ర పార్టీ అభ్యర్ధిగా పోటీ చెయ్యాలని ఆయన డిసైడ్ అయ్యారని తెలిసింది. అయితే జగదీష్ శెట్టర్ కు ఎమ్మెల్యే సీటు ఇచ్చే విషయంలో బీజేపీ హైకమాండ్ మరోపారి ఆలోచిస్తోందని తెలిసింది.












Click it and Unblock the Notifications