Cinema shooting: గాల్లోకి ఎగిరిన ఫైటర్, హైటెన్షన్ విద్యుత్ షాక్ తో ప్రాణం పోయింది, స్టార్ హీరో !

బెంగళూరు: సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో మరో కళాకారుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించడానికి సినిమా డైరెక్టర్, ఫైట్ మాస్టర్ ఉదయం నుంచి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సినిమా హీరోతో పాటు సినిమా దర్శకుడు, ఫైట్ మాస్టర్, నిర్మాత సినిమా సెట్ లో ఉన్నారు. సినిమా షూటింగ్ చూడటానికి పరిసర ప్రాంతాల గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి చేరుకున్నారు. టెన్షన్ గా ఫైట్ సీన్ తీస్తున్న సమయంలో అక్కడ ఉన్న సినిమా యూనిట్ మొత్తం షాక్ అయ్యింది. యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో ఓ ఫైటర్ గాల్లోకి ఎగరడంతో పైన వేలాడుతున్న హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలి అతని ప్రాణం పోయింది. ఇదే సమయంలో మరో ఫైటర్ కు తీవ్రగాయాలు కావడంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు. నిర్లక్షంగా సినిమా షూటింగ్ జరపడం వలనే ఫైటర్ ప్రాణం పోయిందని ఆరోపిస్తూ సినిమా దర్శకుడు, నిర్మాత, ఫైట్ మాస్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంచి హీరోతో సినిమా చెయ్యడానికి మొదటి సారి సినిమా డైరెక్టర్ గా చాన్స్ వచ్చిన దర్శకుడు ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు.

ఫేమస్ హీరో, హీరోయిన్ తో సినిమా

ఫేమస్ హీరో, హీరోయిన్ తో సినిమా

స్యాండిల్ వుడ్ (కన్నడ సినిమా)లో అజయ్ రావ్, రుచితా రామ్ కు మంచి క్రేజ్ ఉంది. అజయ్ రావ్, రుచితా రామ్ హీరో హీరోయిన్లుగా ఐలవ్ యూ రచ్చు అనే సినిమా నిర్మిస్తున్నారు. ప్రమఖ నిర్మాత గురు దేశ్ పాండే ఐ లవ్ యూ రచ్చు సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు శంకర్ రాజ్ అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్నారు.

దర్శకుడికి మొదటి సినిమా

దర్శకుడికి మొదటి సినిమా

స్యాండిల్ వుడ్ లో అనేక సినిమా డైరెక్టర్ల దగ్గర పని చేసిన శంకర్ రాజ్ ఐ లవ్ యూ రచ్చు సినిమాతో పూర్తి స్థాయి డైరెక్టర్ గా పని చెయ్యడానికి మొదటి అవకాశం వచ్చింది. తన ప్రతిభతో సినిమాను సూపర్ హిట్ చేసి మరన్ని మంచి సినిమాలు తియ్యాలని దర్శకుడు శంకర్ రాజ్ అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సినిమాకు ఫైట్ మాస్టర్ గా వినోద్ పని చేస్తున్నాడు.

బెంగళూరు శివార్లలో ఫైట్ సీన్ షూటింగ్

బెంగళూరు శివార్లలో ఫైట్ సీన్ షూటింగ్

బెంగళూరు నగరం శివార్లలోని బిడది సమీపంలోని జోగరపాళ్య గ్రామం దగ్గర ఐ లవ్ యూ రచ్చు సినిమా షూటింగ్ జరుగుతోంది. కోవిడ్ నియమాలు పాటిస్తూ సినిమా షూటింగ్ జరుపుకోవడానికి అధికారులు అనుమతి ఇచ్చారు. సోమవారం యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించడానికి సినిమా డైరెక్టర్ శంకర్ రాజ్, ఫైట్ మాస్టర్ వినోద్ ఉదయం నుంచి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సినిమా హీరో అజయ్ రావ్ తో పాటు సినిమా దర్శకుడు, ఫైట్ మాస్టర్, నిర్మాత గురు దేశ్ పాండే సినిమా షూటింగ్ సెట్ లో ఉన్నారు. సినిమా షూటింగ్ చూడటానికి బిడది పరిసర ప్రాంతాల గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి చేరుకున్నారు.

ఫైటర్ ప్రాణం పోయింది

ఫైటర్ ప్రాణం పోయింది

టెన్షన్ గా ఫైట్ సీన్ తీస్తున్న సమయంలో అక్కడ ఉన్న సినిమా యూనిట్ మొత్తం షాక్ అయ్యింది. యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో ఫైటర్ వివేక్ తో పాటు మరి కొందరు ఫైటర్లు గాల్లోకి ఎగరడంతో పైన వేలాడుతున్న 11 కేవీ హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలాయి. విద్యుత్ షాక్ తగిలిన ఫైటర్ వివేక్ ప్రాణం పోయింది. ఇదే సమయంలో మరో ఫైటర్ కు తీవ్రగాయాలు కావడంతో అతన్ని బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

పోలీసుల అదుపులో నిర్మాత, దర్శకుడు, ఫైట్ మాస్టర్

పోలీసుల అదుపులో నిర్మాత, దర్శకుడు, ఫైట్ మాస్టర్

పైన హైటెన్షన్ విద్యుత్ తీగలు ఉన్న విషయం పూర్తిగా మరిచిపోయారని, అందువలనే ప్రమాదం జరిగి ఫైటర్ వివేక్ ప్రాణం పోయిందని బిడిది పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. నిర్లక్షంగా సినిమా షూటింగ్ జరపడం వలనే ఫైటర్ వివేక్ ప్రాణం పోయిందని ఆరోపిస్తూ సినిమా దర్శకుడు శంకర్ రాజ్, నిర్మాత గురు దేశ్ పాండే, ఫైట్ మాస్టర్ వినోద్ ను బిడిది పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివేక్ ఫైట్ మాస్టర్ గా స్యాండిల్ వుడ్ లో ఉన్నత స్థాయికి ఎదుగుతాడని అనుకున్నామని, ఇలాంటి సమయంలో అతను ఇలా సినిమా షూటింగ్ ప్రమాదంలో ప్రాణాలు వదలేస్తాడని అస్సలు ఊహించలేదని అతని స్నేహితులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఫైట్ మాస్టర్ గా వివేక్ పైకి ఎదిగి మాకు జీవితాంతం తోడుగా ఉంటాడని అనుకుంటే ఇలా దూరం అయ్యాడని అతని కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు.

పాపం సినిమా డైరెక్టర్

పాపం సినిమా డైరెక్టర్


మంచి హీరోతో సినిమా చెయ్యడానికి మొదటి సారి సినిమా డైరెక్టర్ గా చాన్స్ వచ్చిన దర్శకుడు శంకర్ రాజ్ ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. గతంలో కూడా దునియా విజయ్ హీరోగా నిర్మించిన మస్త్ గూడి సినిమా షూటింగ్ సమయంలో హెలికాప్టర్ నుంచి చెరువులోని నీళ్లలోకి దూకే యాక్షన్ సీన్ లు చిత్రీకరిస్తున్న సమయంలో కన్నడలో ప్రముఖ విలన్ లుగా ఓ వెలుగు వెలుగుతున్న ఉదయ్, అనీల్ ఇద్దరూ ఒకేసారి జలసమాధి అయ్యారు. స్యాండిల్ వుడ్ లో అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగతున్నా కొందరు ఫైట్ మాస్టర్లు నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+