మోదీకి పోటీగా లోకనాయకుడు, వర్కౌట్ అవుతుందా, తంబి సౌక్యమా ?, స్వాతిముత్యం!
బెంగళూరు/చెన్నై: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రాలని లక్షంగా పెట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీ నాయకులు తిండితిప్పలు మానేసి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. స్టార్ హీరో ఇమేజ్ తో లాభం పొందాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ లీడర్స్ లోకనాయకుడు. దశావతారం కమల్ హాసన్ ను రంగంలోకి దింపడానికి ప్రయత్నిస్తున్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఆ పార్టీ నాయకులు కన్నడ స్టార్ హీరోలు కిచ్చా సుదీప్, చాలెంజింగ్ స్టార్ దర్శన్ ను రంగంలోకి దింపారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచార కమిటీలో స్యాండిల్ వుడ్ బ్యూటీ, మండ్య మాజీ ఎంపీ రమ్యా అలియాద్ దివ్యా స్పందనా పేరు ప్రకటించినా మేడమ్ మాత్రం ఇంత వరకు ఎన్నికల ప్రచారం చెయ్యడానికి ముందుకు రాలేదు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో వీలైనన్ని సీట్లలో విజయం సాధించి బీజేపీని ఇంటికి పంపించాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నది. బెంగళూరు నగరంలో తమిళ సోదరులు ఎక్కువగా ఉండే నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఎన్నికల ప్రచారం చెయ్యాలని ఆ పార్టీ నాయకులు బహుబాష నటుడు, దర్శక నిర్మాత, జాతీయ ఉత్తమ నటుడు కమల్ హాసన్ కు మనవి చేశారని తెలిసింది.
బెంగళూరులో తమిళ ప్రజలు ఎక్కువగా నివాసం ఉంటున్న గాంధీనగర, పులకేశీనగర, చిక్కపేట్, కేఆర్ పురం. మహదేవపుర తదితర నియోజక వర్గాల్లో హీరో కమల్ హాసన్ తో ఎన్నికల ప్రచారం చేయించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు బావిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంలో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీ హైకమాండ్ తో చర్చలు జరిపారని తెలిసింది.
మక్కల్ నీది మయ్యం అనే ప్రాంతీయ పార్టీ స్థాపించిన హీరో కమల్ హాసన్ తమిళనాడులో గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినా ప్రజలు మాత్రం వారిని ఆదరించలేదు. తరువాత కమల్ హాసన్ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన కన్యాకుమారి టూ కాశ్మీర్ జూడో యాత్రలో ప్రత్యక్షం అయిన కమల్ హాసన్ రాహుల్ గాంధీకి మద్దతు ప్రకటించారు.
వీలు చిక్కినప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్న కమల్ హాసన్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు దగ్గర అవుతూ వచ్చారు. తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీకి కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షం అయిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో హీరో కమల్ హాసన్ ను ఒప్పించి బెంగళూరు నగరంలోని వివిద నియోజక వర్గాల్లో, తమిళ ప్రజలు ఎక్కువగా నివాసం ఉంటున్న ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారం చేయించాలని ఆయనతో చర్చలు జరుపుతున్నారని తెలిసింది.












Click it and Unblock the Notifications