Bengaluru: మాజీ ప్రధాని దంపతులకు కరోనా పాజిటివ్; ఐటీ హబ్ హడల్, ధైర్యం చెప్పిన సీఎం !
బెంగళూరు: కరోనా వైరస్ మహమ్మారి (COVID-19) మరోసారి పంజా విసరడంతో ప్రజలు హడలిపోతున్నారు. భారత మాజీ ప్రధాని, జేడీఎస్ పార్టీ చీఫ్ హెచ్ డీ. దేవేగౌడ, ఆయన సతీమణి చెన్నమ్మ కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ దంపతులు కోవిడ్ నుంచి త్వరగా కోలుకోవాలని సీఎం బీఎస్. యడియూరప్ప దేవుడిని వేడుకున్నారు. ఐటీ బీటీ సంస్థల దేశ రాజధాని, ఐటీ హబ్ బెంగళూరు సిటీలో కరోనా వైరస్ ఎలా వ్యాపిస్తుందో ఈ విషయం చూస్తే అర్థం అవుతోంది. మాజీ ప్రధాని దేవేగౌడ, చెన్నమ్మ దంపతులకు కరోనా పాజిటివ్ అని తెలిసిన వెంటనే జేడీఎస్ పార్టీ వర్గాలు హడలిపోయాయి.

కొంతకాలంగా అనారోగ్యం
మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ అనారోగ్యంతో బాధపడుతున్నారు. అనారోగ్య కారణంతో అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకున్న మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ బెంగళూరులోని పధ్మనాభనగర్ లోని ఆయన ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. వైద్యుల సలహామేరకు మాజీ ప్రధాని రక్తపరీక్షలు చేశారు. మాజీ ప్రధాని దేవేగౌడతో పాటు ఆయన సతీమణి చెన్నమ్మకు రక్తపరీక్షలు చేశారు.
దేవేగౌడ దంపతులకు కోవిడ్ పాజిటివ్
బుధవారం మాజీ ప్రధాని హోచ్.డీ. దేవేగౌడ, ఆయన సతీమణికి కరోనా పాజిటివ్ అని బుధవారం వైద్యులు చెప్పారు. తనకు, తన సతీమణి చెన్నమ్మకు కరోనా పాజిటివ్ చ్చిన విషయం భారత మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ స్వయంగా ఆయన ట్వీట్టర్ లో పోస్టు చేశారు.

జాగ్రత్తగా ఉండండి
తనతో ఇంతకాలం టచ్ లో ఉన్న వాళ్లు వైద్యపరీక్షలు చేయించుకుని వైద్యుల సలహాలు పాటించాలని మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ మనవి చేశారు. విషయం తెలుసుకున్న మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ. కుమారస్వామి, జేడీఎస్ పార్టీ నాయకులు బెంగళూరులోని పధ్మనాభనగర్ లో ఉన్న మాజీ ప్రధాని ఇంటికి పరుగు తీశారు.

ధైర్యం చెప్పిన సీఎం
ప్రస్తుతం మాజీ ప్రధాని దేవేగౌడ బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మాజీ ప్రధాని దేవేగౌడ సతీమణి చెన్నమ్మ హోమ్ క్వారంటైన్ లో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. మాజీ ప్రధాని, సీనియర్ నాయకుడు హెచ్.డీ. దేవేగౌడ, ఆయన సతీమణి చెన్నమ్మ కోవిడ్ నుంచి త్వరగా కోలుకోవాలని, ఆయన ఇంకా ప్రజాసేవ చెయ్యాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ట్వీట్ చేశారు. ఐటీ హబ్ బెంగళూరులో ఏ రైంజ్ లో కరోనా వైరస్ తాండవం చేస్తుందో ఈ విషయం తెలిస్తే అర్థం అవుతోందని ప్రజలు అంటున్నారు.












Click it and Unblock the Notifications