ఢిల్లీ వెళ్లకుండా ధైర్యంగా ఉండిపోయిన డీకే, హైకమాండ్ కు అన్నీ తెలుసు, నేను!
బెంగళూరు/న్యూఢిల్లీ: ఎవరో ఏదో మాట్లాడారని తాను దానికి కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. తన వర్గంలో ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అని చెప్పనవసరం లేదని, అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన 135 మంది ఎమ్మెల్యేలు నావాళ్లే అని, గత ఐదు ఏళ్లలో ఏం జరిగింది అని ఇప్పుడు తాను చెప్పాల్సిన అవసరం లేదని. భవిష్యత్తులో ఆ విషయాల గురించి మాట్లాడుతానని కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
గురువారం మద్యాహ్నం డీకే శివకుమార్ ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. హెచ్ఏఎల్ నుంచి ప్రత్యేక విమానంలో సిద్దరామయ్య ఢిల్లీ వెళ్లిపోయారు. అయితే డీకే శివకుమార్ మాత్రం బెంగళూరులోనే ఉండిపోయారు. ఈ రోజు మే 15వ తేదీ డీకే శివకుమార్ బర్త్ డే. పుట్టిన రోజు సందర్బంగా బెంగళూరులోని సదాశివనగర్ లోని డీకే శివకుమార్ కుటుంబ సభ్యులు ఇంట్లో ప్రత్యేక పూజలు చేయించారు.

ఇంట్లో పూజలు చేసిన తరువాత ఉదయం నుంచి డీకే శివకుమార్ వివిద దేవాలయాలకు వెళ్లి పూజలు చేశారు. పుట్టిన రోజు సందర్బంగా కనకపుర వెళ్లిన డీకే శివకుమార్ స్నేహితులు, సన్నిహితులు ఏర్పాటు చేసిన బర్త్ డే ఫంక్షన్ లో పాల్గొన్నారు. తరువాత బెంగళూరులోని సదాశివనగరకు చేరుకున్న డీకే శివకుమార్ అక్కడ మీడియాతో మాట్లాడారు.
మీరు ఎందుకు ఇంకా ఢిల్లీ వెళ్లలేదని మీడియా ప్రశ్నించడంతో డీకే శివకుమార్ ఇలా సమాధానం ఇచ్చారు. 2019లో కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వాన్ని కుప్పకూల్చిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను మళ్లీ పార్టీలోకి పిలుచుకుని రావడానికి తాను ఒక్కడే పోరాటం చేశానని, ముంబాయి వెళ్లి వాళ్ల కాళ్లు పట్టుకోవడానికి నేను ఒక్కడే ప్రయత్నించానని డీకే శివకుమార్ గుర్తు చేశారు.
ఆ సందర్బంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలను మళ్లీ కాంగ్రెస్ లోకి రప్పించడానికి తాను ఒక్కడే శక్తి వంచనలేకుండా పని చేశానని. ఆ సందర్బంలో తనకు మల్లికార్జున ఖార్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ధైర్యం చెప్పి ముందుకు వెళ్లాలనని తనను ప్రోత్సహించారని కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ అన్నారు.
తనకు ముఖ్యమంత్రి పదవి దక్కకుండా కొందరు ప్రయత్నిస్తున్నారని తాను ఆరోపణలు చెయ్యడం లేదని డీకే శివకుమార్ అన్నారు. తనకు మెజారీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని సిద్దరామయ్య చెప్పారని మీడియా ప్రశ్నించగా అవునా చాలా సంతోషం, ఏది జరిగినా నా మంచికే, నేను ఎంతకష్టపడ్డాను అనే విషయం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు తెలుసు, వాళ్లు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూస్తానని డీకే శివకుమార్ అన్నారు. సోమవారం రాత్రి డీకే శివకుమార్ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు అంటున్నారు.












Click it and Unblock the Notifications