బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Enjoy: చైనా డివైజ్ లు, ఖరీదైన కార్లు ?, గోవాలో అమ్మాయిలు, ఆంటీతో ఎంజాయ్, బీకాం చదివి ఏం చేశాడంటే!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/మదనపల్లె/చిత్తూరు: అమ్మాయిలు, ఆంటీల పిచ్చితో ఓ యువకుడు చైనా టెక్నాలజీ ఉపయోగించి సామాన్య ప్రజలకు, పోలీసులకు నిద్రలేకుండా చేశాడు. యూట్యూబ్ లో కొన్ని వీడియోలు చూసిన యువకుడు చైనాకు చెందిన డివైజ్, టూల్స్ చాకచక్యంగా తెప్పించుకున్నాడు. రోడ్డు పక్కన, ఇంటి ముందు పార్క్ చేసిన కార్లను చాకచక్యంగా చోరీ చేసిన నిందితుడు వాటికి నెంబర్ ప్లేట్ లు మార్చి, నకిలి ఆర్ సీ పత్రాలు తయారు చేసి వాటిని విక్రయిస్తున్నాడు. తన టేస్ట్ కు తగ్గట్లు అందమైన అమ్మాయిలు, ఆంటీలతో పాటు వ్యభిచారులను పర్యాటక కేంద్రాల్లోని స్టార్ హోటల్స్ కు పిలుచుకుని వెళ్లి పిచ్చపాటిగా ఎంజాయ్ చేశాడు.

చోరీ చేసిన కార్లు విక్రయించి లగ్జరీ లైఫ్ అనుభవించాడు. అయితే టైమ్ కలిసిరాకపోవడంతో చోరీ చేసిన బైక్ లో వెలుతున్న నిందితుడు పోలీసులకు చిక్కిపోయాడు. ఆంధ్రప్రదేశ్ లో జైలు జీవితం గడుపుతున్న సమయంలో సాటి ఖైదీ ఇచ్చిన సలహాలు, సూచనలతో ఇంతకాలం నిందితుడు పోలీసులకు, ప్రజలకు సినిమా చూపించాడని వెలుగు చూసింది.

Illegal affair: మహిళ దారుణ హత్య, శవం కాల్చి బూడిద చేసిన రెండో భర్త, ఉంగరం గుర్తు పట్టిన లేడీ ఫ్రెండ్!Illegal affair: మహిళ దారుణ హత్య, శవం కాల్చి బూడిద చేసిన రెండో భర్త, ఉంగరం గుర్తు పట్టిన లేడీ ఫ్రెండ్!

డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఐటీ హబ్ వచ్చాడు

డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఐటీ హబ్ వచ్చాడు

కర్ణాటకలోని కోలారు జిల్లా ముళబాగిల్ (ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతం)కు చెందిన అరుణ్ కుమార్ అలియాస్ అరుణ్ (25) బీకాం పూర్తి చేశాడు. ఉద్యోగం చెయ్యడానికి ఐటీ హబ్ బెంగళూరు చేరుకుని దేవరబీచనహళ్లిలో అద్దె ఇల్లు తీసుకుని నివాసం ఉంటున్నాడు. కొంతకాలం ఉద్యోగం సంపాధించాలని అనేక ప్రయత్నాలు చేశాడని తెలిసింది.

అమ్మాయిలు, ఆంటీల పిచ్చి

అమ్మాయిలు, ఆంటీల పిచ్చి

అరుణ్ కు అమ్మాయిలు, ఆంటీలను అనుభవించాలని ఎక్కువ ఆశ ఉందని వెలుగు చూసింది. అమ్మాయిలతో ఎంజాయ్ చెయ్యడానికి మొదట్లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లో అరుణ్ దారిదోపిడీలు, చోరీలు చేశాడు. దారిదోపిడీ కేసులో ఆంధ్రప్రదేశ్ లోని కర్ణాటక సరిహద్దులోని మదనపల్లె పోలీసులకు అరుణ్ చిక్కిపోయాడు.

సబ్ జైల్ లో ఫ్రెండ్

సబ్ జైల్ లో ఫ్రెండ్

కొంతకాలం అరుణ్ మదనపల్లె సబ్ జైలులో శిక్ష అనుభవించాడు. ఆ సమయంలో చోరీ కేసుల్లో అదే సబ్ జైలులో ఉన్న రాకేష్ అనే వ్యక్తి అరుణ్ కు పరిచయం అయ్యాడు. కార్లు ఎలా చోరీ చెయ్యాలని అంటూ రాకేష్ సాటి ఖైదీ అరుణ్ కు స్టోరీలు, గతంలో అతను ఎలా చోరీలు చేశాడు అని పూర్తి సమాచారం ఇచ్చాడు.

చైనా డివైజ్, టూల్స్

చైనా డివైజ్, టూల్స్

జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చిన అరుణ్ యూట్యూబ్ లో కొన్ని వీడియోలు చూశాడు. తరువాత అరుణ్ చైనాకు చెందిన డివైజ్, ఎక్స్ టూల్స్ ఆటో డయాగ్నిస్టిక్ టూల్స్ చాకచక్యంగా బెంగళూరు తెప్పించుకున్నాడు. రోడ్డు పక్కన, ఇంటి ముందు పార్క్ చేసిన కార్లను చాకచక్యంగా చోరీ చేసిన నిందితుడు అరుణ్ వాటికి నెంబర్ ప్లేట్ లు మార్చి, నకిలి ఆర్ సీ పత్రాలు తయారు చేసి వాటిని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లో విక్రయిస్తున్నాడు.

అమ్మాయిలు, ఆంటీలతో గోవాలో ఎంజాయ్

అమ్మాయిలు, ఆంటీలతో గోవాలో ఎంజాయ్

చోరీ చేసిన వాహనాలు, కార్లు ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో విక్రయించిన అరుణ్ వచ్చిన డబ్బుతో తన టేస్ట్ కు తగ్గట్లు అందమైన అమ్మాయిలు, ఆంటీలతో పాటు వ్యభిచారులను గోవా, పాండిచ్చేరి, తమిళనాడులోని వివిద పర్యాటక కేంద్రాల్లోని స్టార్ హోటల్స్ కు పిలుచుకుని వెళ్లి పిచ్చపాటిగా ఎంజాయ్ చేశాడు. చోరీ చేసిన కార్లు విక్రయించిన అరుణ్ ఇంతకాలం అమ్మాయిలు, ఆంటీలతో ఎంజాయ్ చేస్తూ లగ్జరీ లైఫ్ అనుభవించాడు.

అర్దరాత్రి టైమ్ రివర్స్

అర్దరాత్రి టైమ్ రివర్స్

బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఔట్ లోని టీచర్స్ కాలనీలో చోరీ చేసిన బైక్ లో వెలుతున్న అరుణ్ ను గస్తీ తిరుగుతున్న పోలీసులు అడ్డగించి విచారణ చేశారు. ఆ సమయంలో అరుణ్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు షాక్ అయ్యారు. ఇంతకాలం బెంగళూరు పోలీసులు వెతుకుతున్నది అరుణ్ ఇతనే అని తెలుసుకుని అతన్ని అరెస్టు చేశారు. బెంగళూరులోని మైకోలేఔట్, కోణణేకుంట, బిడిది తదితర పోలీస్ స్టేషన్ల పరిధిలో అరుణ్ కార్లు చోరీ చేశాడని అతనే అంగీకరించాడని పోలీసులు తెలిపారు.

English summary
Enjoy: Accused arrested for car theft case in HSR layout in Bengaluru city in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X