సుమలత మీద సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం, నామాట ఎవరు విన్నారు?
బెంగళూరు/మండ్య: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల దెబ్బతో అధికారం కోసం బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీ నాయకులు అధికారంలోకి రావాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో నేను చెప్పింది ఒకటి అయితే ప్రజలు మాత్రం సినీనటి సుమలత అంబరీష్ ను గెలిపించి పెద్ద తప్పు చేశారని మాజీ సీఎం సిద్దరామయ్య విచారం వ్యక్తం చేశారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ 10వ తేదీ జరగనుండటంతో ఎన్నికల ప్రచారంలో లబ్ది పొందడానికి అన్ని పార్టీల నాయకులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన జాతీయ నాయకులు, కర్ణాటకకు చెందిన సీనియర్ నాయకులు తిండితిప్పలు, నిద్ర మానేసి ఎన్నికల ప్రచారంలో బిజీ అయిపోయారు.

కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య మండ్య జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్-జేడీఎస్ పార్టీలు పొత్తు పెట్టుకుని మండ్య లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేశారని, ఆ సమయంలో తాను మాజీ సీఎం హెచ్.డీ. కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమార్ స్వామికి ఓటు వెయ్యాలని మండ్య జిల్లా ప్రజలకు పదేపదే గుర్తు చేశానని సిద్దరామయ్య అన్నారు.
అయితే గత లోక్ సభ ఎన్నికల్లో మండ్య జిల్లా ప్రజలు తన మాట ఎవ్వరూ వినలేదని, కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల ఉమ్మడి అభ్యర్థి నిఖిల్ కుమారస్వామికి ఓటు వెయ్యకుండా స్వతంత్ర పార్టీ అభ్యర్థి సుమలతా అంబరీష్ కు ఓటు వేశారని కర్ణాటక మాజీ మఖ్యమంత్రి సిద్దరామయ్య విచారం వ్యక్తం చేశారు.
మండ్య లోక్ సభ ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ ఎంపీగా విజయం సాధించిన బహుబాష నటి, తెలుగింటి ఆడపడుచు, స్యాండిల్ వుడ్ రెబల్ స్టార్ అంబరీష్ సతీమణి సుమలత ఇప్పడు బీజేపీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మండ్య జిల్లాలోని పలు అసెంబ్లీ నియోజక వర్గాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని సమలత అంబరీష్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. సుమలత హవా తట్టుకోలేని కొందరు నాయకులు ఆమె మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని కొందరు బీజేపీ నాయకులు మండిపడుతున్నారు.
-
బీహార్ సీఎంగా లాలూకు నమ్మినబంటు: నాడు రబ్రీదేవి కేబినెట్ లో మంత్రి -
Pawan Khera: కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు సుప్రీం షాక్-తెలంగాణ హైకోర్టు బెయిల్ పై..! -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications