Girlfriend: ప్రియురాలి నిశ్చితార్థంతో మాజీ ప్రియుడు ఫైర్, పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురి నగ్న వీడియో షేర్!
బెంగళూరు: కాలేజ్ లో చదువుకుంటున్న సమయంలో యువతి, యువకుడికి పరిచయం అయ్యింది. ఇద్దరి పరిచయం ప్రేమగా మారింది. నాలుగు సంవత్సరాలు ఇద్దరూ కలిసి తిరిగారు. ప్రేమించిన అమ్మాయికి మాయమాటలు చెప్పి ఏకాంతంగా గడుపుతున్న సమయంలో ప్రియుడు ఆమె నగ్న ఫోటోలు, ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేస్తున్న సమయంలో సీక్రేట్ గా వీడియోలు తీశాడు. కొంతకాలం తరువాత ప్రేమికులు విడిపోయారు. మంచి పెళ్లి సంబంధం కుదరడంతో ప్రియురాలికి వేరే అబ్బాయితో నిశ్చితార్థం జరిగిపోయింది.
పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు పెళ్లి పనులు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో ఎంట్రీ ఇచ్చిన మాజీ ప్రియుడు నువ్వు నన్ను కాకుండా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే నీ నగ్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బ్లాక్ మెయిల్ చేశాడు. మాజీ ప్రియుడి మాటలు లెక్క చెయ్యని యువతి సైలెంట్ గా ఉండిపోయింది. మాజీ ప్రియురాలి నగ్న ఫోటోలు, వీడియోలు పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులకు పంపించిన మాజీ ప్రియుడు చేతులు దులుపుకున్నాడు.

కాలేజ్ లవర్స్
బెంగళూరులోని సుబ్రమణ్యపురలో 23 ఏళ్ల రంజిత (పేరు మార్చడం జరిగింది) అనే యువతి నివాసం ఉంటున్నది. బెంగళూరులోని ప్రముఖ ప్రైవేట్ కాలేజ్ లో చదువుకుంటున్న రంజితకు నాలుగు సంవత్సరాల క్రితం దిలీప్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. రంజిత, దిలీప్ ఇద్దరూ స్నేహితులు అయ్యారు.

సీక్రేట్ గా వీడియోలు, ఫోటోలు తీసిన ప్రియుడు
కాలేజ్ లో చదువుకుంటున్న సమయంలో దిలీప్, రంజితల పరిచయం తరువాత ప్రేమగా మారింది. నాలుగు సంవత్సరాలు రంజిత, దిలీప్ ఇద్దరూ కలిసి తిరిగారు. ప్రేమించిన అమ్మాయి రంజితకు మాయమాటలు చెప్పి ఏకాంతంగా గడుపుతున్న సమయంలో ఆమె ప్రియుడు దలీప్ ఆమె నగ్న ఫోటోలు, ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేస్తున్న సమయంలో సీక్రేట్ గా వీడియోలు తీసి పెట్టుకున్నాడు.

తేడా రావడంతో హ్యాండ్ ఇచ్చిన ప్రియురాలు
రంజిత ఆమె కాలేజ్ లో చదువుకుంటున్న సాటి అబ్బాయిలతో మాట్లాడింది. నువ్వు నాతో తప్పా వేరే అబ్బాయిలతో మాట్లాడకూడదని, వాళ్లను చూడకూడదని ప్రియుడు దిలీప్ అతని ప్రియురాలు రంజితకు కండీషన్లు పెడుతూ వచ్చాడు. రానురాను ప్రేమికులు రంజిత, దిలీప్ ల మద్య తేడాలు వచ్చాయి. ప్రియుడు దిలీప్ తిక్కచేష్టలు తట్టుకోలేని రంజిత అతనికి దూరం అయ్యి పూర్తిగా హ్యాండ్ ఇచ్చింది.

ప్రియురాలి పెళ్లి ఫిక్స్
మంచి పెళ్లి సంబంధం కుదరడంతో దిలీప్ ప్రియురాలు రంజితకు బెంగళూరులోనే నివాసం ఉంటున్న వేరే అబ్బాయితో నిశ్చితార్థం జరిగిపోయింది. పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకున్న రంజిత కుటుంబ సభ్యులు పెళ్లి పనులు చేసుకుంటున్నారు. మాజీ ప్రియురాలు రంజితకు పెళ్లి ఫిక్స్ అయ్యిందని తెలుసుకున్న ఆమె మాజీ ప్రియుడు దిలీప్ రగిలిపోయాడు.

బ్లాక్ మెయిల్ చేసిన మాజీ ప్రియుడు
రంజిత జీవితంలో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె మాజీ ప్రియుడు దిలీప్ నువ్వు నన్ను కాకుండా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే నీ నగ్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడు. మాజీ ప్రియుడు దిలీప్ మాటలు లెక్క చెయ్యని రంజిత ఏం చేస్తావో చేసుకో అంటూ సైలెంట్ గా ఉండిపోయింది.

పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురు నగ్న ఫోటోలు, వీడియోలు షేర్
రంజిత తనను లెక్క చెయ్యలేదని ఇంకా రగిలిపోయిన దిలీప్ అతని మాజీ ప్రియురాలి నగ్న ఫోటోలు, వీడియోలు పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులకు పంపించి చేతులు దులుపుకున్నాడు. కాబోయే భార్య నగ్న ఫోటోలు, వీడియోలు చూసి షాక్ అయిన పెళ్లి కొడుకు మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా జీవితం నాశనం అవుతుందని చెప్పి ఆ పెళ్లి రద్దు చేశాడు.

మాజీ ప్రియుడు అందర్
విషయం తెలుసుకున్న పెళ్లి కూతురు ఆమె మాజీ ప్రియుడు దిలీప్ మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దిలీప్ ను అరెస్టు చేసి అతని మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. మొత్తం మీద మాజీ ప్రియుడి దెబ్బతో పెళ్లి రద్దు కావడంతో అమ్మాయి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications