Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Girlfriend: గర్ల్ ఫ్రెండ్ ఆత్మహత్య, కాలేజ్ అమ్మాయిని ఈ నాయకుడు ఏం చేశాడంటే?, క్లైమాక్స్ లో!

బెంగళూరు/చిక్కమగళూరు: విద్యార్థిని ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలోని కలస గ్రాడ్యుయేట్ కళాశాల విద్యార్థిని ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు నితీష్‌ను పోలీసులు చిక్కమగళూరులో అరెస్టు చేశారు. నితీష్‌ మీద కేసు నమోదు కాగానే అతను అదృశ్యమయ్యాడు. అరెస్టు నుంచి తప్పించుకుని తిరుగుతున్న నితేష్ మీద నిఘా పెట్టిన పోలీసులు చివరికి అతన్ని అరెస్టు చేశారు.

జనవరి 10వ తేదీన సాంసే సమీపంలోని జోగికుంబ్రి గ్రామానికి చెందిన చన్నప్ప గౌడ కుమార్తె దీప్తీ (17) ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. దీప్తీని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు చికిత్స విఫలమై దీప్తీ మృతి చెందింది. దీప్తి డెత్ నోట్‌లో నితీష్ పేరు ఉంది. భజరంగ్ దళ్ కోఆర్డినేటర్ అయిన అతని పేరును దీప్తి డెత్ నోట్ లో రాసింది. దీప్తీ, నితీష్ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో దీప్తీ ఆవేదన చెందిన పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది.

Hindu community leader arrested in college girl suicide case in Karnataka, what did he do after falling in love with a minor girl ?

ఈ విషయమై మృతురాలు దీప్తీ తల్లిదండ్రులు నిందితుడు నితీష్ మీద ఫిర్యాదు చేయాలనుకున్నా కుదేర్ముఖ్ పోలీసులు కేసు నమోదు చేసేందుకు వెనుకడుగు వేశారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు కుద్రేముఖ్ పోలీసులపై జిల్లా పోలీసు సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లారు. ఎస్పీ ఉమా ప్రశాంత్ కుద్రేముఖ్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో కుద్రేముఖ్ పోలీసులు నిందితుడు నితీష్‌పై కేసు నమోదు చేశారు.

ఈ మేరకు కుద్రేముఖ్ పోలీస్ స్టేషన్‌లో నితీష్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఈ ఉదంతం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నితీష్‌ను భజరంగ్ దళ్ నుంచి ఆ సంస్థ నాయకులు బహిష్కరించారు. మైనర్ బాలికను ప్రేమ వలలో వేసి మోసం చేసి ఆమె మృతికి కారణమైన నితీష్‌ను అరెస్ట్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేశారు.ఇప్పుడు పోలీసులు చిక్కమగళూరులో నితీష్‌ను అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ జరుపుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+