Illegal affair: ప్రియురాలి భర్తను జైల్లో పెట్టాలని ప్రియుడు ఏం స్కెచ్ వేశాడంటే ?, కంత్రీగాడి కథ క్లోజ్, మేడమ్!
బెంగళూరు/శివమొగ్గ: వివాహిత మహిళ మీద ఓ వ్యక్తి కన్ను పడింది. రానురాను ఆమహిళకు అతను దగ్గర అయ్యాడు. మహిళ భర్త అతని భార్య విషయం తెలుసుకుని ఆమె ప్రియుడికి వార్నింగ్ ఇచ్చాడు. ప్రియురాలి భర్త బయట ఉంటే మనకు లేనిపోని సమస్యలు వస్తాయని ప్రియుడు అనుకున్నాడు. మహిళ భర్తను చంపేస్తే జైలుకుపోతామని, తరువాత మొదటికే మోసం వస్తోందని ప్రియుడు అనుకున్నాడు.
ప్రియురాలి భర్తను చంపకుండా అతని అడ్డుతొలగించుకోవాలని, అప్పుడు ప్రియురాలితో సంతోషంగా ఎంజాయ్ చెయ్యడానికి, ఆమెతో కలిసి తిరగడానికి అవకాశం ఉంటుందని ప్రియుడు డిసైడ్ అయ్యాడు. ఆకాశరామన్న లెటర్ దెబ్బతో ప్రియురాలి భర్తను జైలుకు పంపించాలని ప్రియుడు సినిమా స్కెచ్ వేశాడు.

మహిళతో అక్రమ సంబంధం
కర్ణాటకలోని శివమొగ్గలో మోహమ్మద్ ఖాన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. మొహమ్మద్ ఖాన్ కు వివాహం అయ్యింది. వివాహిత మహిళ మీద ఓ అయూబ్ ఖాన్ అనే వ్యక్తి కన్ను పడింది. రానురాను ఆమహిళకు అయూబ్ ఖాన్ దగ్గర అయ్యాడు. మొహమ్మద్ ఖాన్ భార్య అయూబ్ ఖాన్ ప్రియురాలు.

భార్యకు, ప్రియుడికి వార్నింగ్
మోహమ్మద్ ఖాన్ భార్యతో అయూబ్ ఖాన్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలిసింది. కొంతకాలం అయూబ్ ఖాన్ వ్యవహారం సీక్రేట్ గా సాగిపోయింది. భార్య విషయం తెలుసుకున్న మోహమ్మద్ ఖాన్ ఆమె ప్రియుడు అయూబ్ ఖాన్ కు వార్నింగ్ ఇచ్చాడు. ప్రియుడు అయూబ్ ఖాన్ కావాలనుకుంటే నీ అంత చూస్తానని మోహమ్మద్ ఖాన్ అతని భార్యను హెచ్చరించాడు.

చంపేస్తే జైలుకు పోతామని భయం
ప్రియురాలి భర్త మోహమ్మద్ ఖాన్ బయట ఉంటే మనకు లేనిపోని సమస్యలు వస్తాయని అయూబ్ ఖాన్ అనుకున్నాడు. ప్రియురాలి భర్త మోహమ్మద్ ఖాన్ ను చంపేస్తే జైలుకుపోతామని, తరువాత మొదటికే మోసం వస్తోందని అతని భార్య రసిక ప్రియుడు అయూబ్ ఖాన్ అనుకున్నాడు. ప్రియురాలి భర్త మోహమ్మద్ ఖాన్ ను చంపకుండా అతని అడ్డుతొలగించుకోవాలని అయూబ్ ఖాన్ స్కెచ్ వేశాడు.

ఆకాశరామన్న లెటర్ స్కెచ్
మోహమ్మద్ ఖాన్ బతికి ఉండాలని, అయితే అతను బయట ఉండకూడదని, అప్పుడు ప్రియురాలితో సంతోషంగా ఎంజాయ్ చెయ్యడానికి, ఆమెతో కలిసి తిరగడానికి అవకాశం ఉంటుందని ఆమె ప్రియుడు అయూబ్ ఖాన్ డిసైడ్ అయ్యాడు. ఆకాశరామన్న లెటర్ దెబ్బతో ప్రియురాలి భర్త మోహమ్మద్ ఖాన్ ను జైలుకు పంపించాలని అయూబ్ ఖాన్ స్కెచ్ వేశాడు.

మార్వాడి హత్యకు స్కెచ్ వేశారు..... మీరు జాగ్రత్త?
శివమొగ్గలోని గాంధీ బజార్ లోని గంగా పరమేశ్వరి దేవాలయం సమీపంలో అయూబ్ ఖాన్ ఓ లెటర్ రాసి అక్కడ విసిరేసి వెళ్లిపోయారు. ఈ లెటర్ చూసిన వెంటనే పోలీసులకు ఇవ్వాలని లెటర్ కవర్ మీద రాశాడు. స్థానికంగా నివాసం ఉంటున్న లెటర్ చూసిన ఓ వ్యక్తి వెంటనే పోలీసులకు అందించారు. మార్వాడిని హత్య చేసి శివమొగ్గలో వినాయకచవితి పండుగ అడ్డుకోవాలని కొందరు ప్రయత్నిస్తున్నారని ఆ లేఖలో రాసి ఉంది.

ప్రియురాలి భర్త మీద ఆరోపణలు
మార్కెట్ సమీపంలోని బాత్ రూమ్ దగ్గర మోహమ్మద్ ఖాన్ అనే వ్యక్తి అతని స్నేహితులతో మార్వాడి హత్యకు స్కెచ్ వేశారని, మంగళూరు నుంచి హంతకులను పిలుచుకుని రావాలని మాట్లాడుకుంటుంటే నేను విన్నానని లేఖలో రాశాడు. పోలీసులు మోహమ్మద్ ఖాన్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు.

అడ్డంగా చిక్కిపోయిన ప్రియుడు
నేను ఎప్పుడు హత్యకు స్కెచ్ వెయ్యలేదని, గంజాయి మాత్రం సేవిస్తానని, నా భార్యకు సన్నిహితంగా ఉంటున్న అయూబ్ ఖాన్ ఈ పని చేసి ఉంటాడని మోహమ్మద్ ఖాన్ పోలీసులకు చెప్పాడు. పోలీసులు అయూబ్ ఖాన్ ను అదుపులోకి తీసుకుని బెండ్ తీస్తే తానే ఆకాశరామన్న ఉత్తరం రాశానని అంగీకరించాడు. మొత్తం మీద పరాయిస్త్రీ వ్యామోహంలో ఆమె భర్తను జైలుకు పంపించాలని స్కెచ్ వేసిన అయూబ్ ఖాన్ అడ్డంగా బుక్కైపోయాడు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications