బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Illegal affair: ఫ్రెండ్ భార్య తో పక్కా టైమ్ టేబుల్ తో రొమాన్స్, లిక్కర్ పార్టీ ఇచ్చి లేపేసిన ఫ్రెండ్స్!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: భార్యతో కాపురం చేస్తున్న భర్త వ్యాపారం చేస్తున్నాడు. కరోనా వైరస్ దెబ్బతో వ్యాపారంలో నష్టం వచ్చింది. వ్యాపారానికి చెక్ పెట్టిన భర్త సోదరుడి సొంత టెంపో వాహనం చూస్తున్నాడు. కరోనా దెబ్బతో ఇంటిని కూడా ఖాళీ చేసి వేరే ప్రాంతంలో అద్దె ఇంటిని తీసుకుని నివాసం ఉంటున్నాడు. టెంపో వాహనం తిప్పుతూ డబ్బు బాగా సంపాదిస్తున్నాడు. ఈ మద్యకాలంలో అతను ఫ్రెండ్ ఇంటికి వెళ్లి వస్తూ అతని భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.

భర్త ఎక్కడెక్కడికి వెలుతున్నాడు, ఎప్పుడు ఇంటికి తిరిగి వస్తాడు ? అని పూర్తి సమాచారం ముందుగానే తెలుసుకుంటున్నాడు, ఫ్రెండ్ బయట ఉన్న సమయంలో అతని భార్యతో ఎంజాయ్ చేస్తున్న వ్యక్తి రాత్రి దారుణ హత్యకు గురైనాడు. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలుసుకున్న భర్త పక్కాప్లాన్ తో స్నేహితులకు మందు పార్టీ ఇచ్చి అదే సమయంలో భార్య ప్రియుడిని కూడా పిలిపించి దారుణంగా హత్య చేసి పక్క రాష్ట్రానికి చెక్కేశాడు.

EX lover: ఎంజాయ్ చేసిన ప్రియుడు సీక్రేట్ పెళ్లి, ప్రియురాలి దెబ్బతో మాజీ లవర్ భార్య ?, పగ, ప్రతీకారం!EX lover: ఎంజాయ్ చేసిన ప్రియుడు సీక్రేట్ పెళ్లి, ప్రియురాలి దెబ్బతో మాజీ లవర్ భార్య ?, పగ, ప్రతీకారం!

10 సంవత్సరాల క్రితం పెళ్లి

10 సంవత్సరాల క్రితం పెళ్లి

కర్ణాటకలోని మండ్యకు చెందిన చంద్రశేఖర్ అలియాస్ శేఖర్ అలియాస్ చంద్ర (43) అనే వ్యక్తికి శైలజా (39) అనే మహిళకు 10 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. కొన్ని సంవత్సరాలు మండ్యలో కాపురం చేసిన చంద్రశేఖర్, శైలజా దంపతులు తరువాత వ్యాపారం చెయ్యడానికి బెంగళూరు వచ్చారు.

కరోనా దెబ్బతో వ్యాపారంలో నష్టం

కరోనా దెబ్బతో వ్యాపారంలో నష్టం

బెంగళూరులోని శ్రీనగర్ లోని కాళిదాస నగర్ లేఔట్ లో చంద్రశేఖర్, శైలజా దంపతులు నివాసం ఉండేవారు. చంద్రశేఖర్ పూల వ్యాపారం చేసి మొదట డబ్బులు బాగా సంపాధించేవాడు. కరోనా వైరస్, లాక్ డౌన్ దెబ్బతో చంద్రశేఖర్ కు వ్యాపారంలో నష్టం వచ్చింది. ఎంత ప్రయత్నించినా చంద్రశేఖర్ వ్యాపారంలో లాభాలు సంపాధించలేకపోయాడు.

సోదరుడి సొంత టెంపో

సోదరుడి సొంత టెంపో

వ్యాపారానికి చెక్ పెట్టిన చంద్రశేఖర్ అతని సోదరుడి సొంత టెంపో వాహనం నడుకుంటున్నాడు. టెంపో వాహనంలో వచ్చే డబ్బు మొత్తం తీసుకుంటున్న చంద్రశేఖర్ ఆ వాహనం అతనే చూస్తున్నాడు. కరోనా దెబ్బతో శ్రీనగర్ లోని ఇంటిని కూడా ఖాళీ చేసిన చంద్రశేఖర్, శైలజా దంపతులు బెంగళూరులోని రాజరాజేశ్వరినగర్ ప్రాంతంలో అద్దె ఇంటిని తీసుకుని నివాసం ఉంటున్నాడు.

ఫ్రెండ్ భార్యతో అక్రమ సంబంధం

ఫ్రెండ్ భార్యతో అక్రమ సంబంధం

టెంపో వాహనం తిప్పుతూ చంద్రశేఖర్ డబ్బు బాగా సంపాదిస్తున్నాడు. ఇదే సమయంలో చంద్రశేఖర్ అతని ఫ్రెండ్ రాజేష్ ఇంటికి ఎక్కువగా వెళ్లి వస్తున్నాడు. ఆ సమయంలో రాజేష్ భార్యతో చంద్రశేఖర్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. గత ఏడాది నుంచి రాజేప్ భార్యతో చంద్రశేఖర్ ఎంజాయ్ చేస్తున్నాడని తెలిసింది.

 ప్రియుడు, ప్రియురాలి పక్కా టైమ్ టేబుల్

ప్రియుడు, ప్రియురాలి పక్కా టైమ్ టేబుల్

ప్రియురాలి భర్త రాజేష్ ఎక్కడికి వెలుతున్నాడు, ఎప్పుడు ఇంటికి తిరిగి వస్తాడు ? అని చంద్రశేఖర్ పూర్తి సమాచారం ముందుగానే తెలుసుకుంటున్నాడు, రాజేష్ బయట ఉంటున్న సమయంలో అతని ఇంటికి వెళ్లి అతని భార్యతో చంద్రశేఖర్ అతని భార్యతో ఎంజాయ్ చేస్తున్నాడు. చంద్రశేఖర్ అతని ఫ్రెండ్ భార్యతో ఎంజాయ్ చెయ్యడానికి పక్కా టైమ్ టేబుల్ సిద్దం చేసుకున్నాడు.

రగిలిపోయిన భర్త పక్కాప్లాన్

రగిలిపోయిన భర్త పక్కాప్లాన్

రెండు నెలల క్రితం రాజేష్ కు అతని భార్య, చంద్రశేఖర్ అక్రమ సంబంధం గురించి తెలిసిపోయింది. భార్యకు, చంద్రశేఖర్ కు వార్నింగ్ ఇచ్చిన రాజేష్ మీరు పద్దతి మార్చుకోకపోతే ఇద్దరిని చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. అయినా రాజేష్ భార్య, చంద్రశేఖర్ పద్దతి మార్చుకోలేదు. స్నేహితులతో కలిసి రాజేష్ చంద్రశేఖర్ హత్యకు పక్కా స్కెచ్ వేశాడు.

మాట్లాడాలని పిలిపించి మందు పార్టీలో నరికి చంపేశారు

మాట్లాడాలని పిలిపించి మందు పార్టీలో నరికి చంపేశారు

రాత్రి 9 గంటల సమయంలో రాజేష్ అతని స్నేహితులు హోసకరహళ్ళి మెయిన్ రోడ్డులోని మందు పార్టీ జరుపుకున్నారు. ఆ సమయంలో చంద్రశేఖర్ కు ఫోన్ చేసి మాట్లాడాలని, ఇక్కడికి రావాలని చెప్పారు. చంద్రశేఖర్ ఒక్కడే అక్కడికి వెళ్లాడు. ఆ సమయంలో నా భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుంటావా ? అంటూ రాజేష్ అతని స్నేహితులతో కలిసి చంద్రశేఖర్ ను దారుణంగా కత్తులతో పొడిచి, కొడవలితో నరికి చంపేశారు.

ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎస్కేప్

ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎస్కేప్

చంద్రశేఖర్ మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అక్కడి నుంచి నిందితులు పరారైనారు. మరుసటి రోజు ఉదయం చంద్రశేఖర్ హత్యకు గురైన విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. చంద్రశేఖర్ ను హత్య చేసిన రాజేష్ తో పాటు అతని స్నేహితులు తమిళనాడు పారిపోయారని తెలిసిందని, నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు.

English summary
Illegal affair: Man killed by friends in Bengaluru City.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X