Illegal affair: మహిళ దారుణ హత్య, శవం కాల్చి బూడిద చేసిన రెండో భర్త, ఉంగరం గుర్తు పట్టిన లేడీ ఫ్రెండ్!
బెంగళూరు/యాదగిరి: వివాహం చేసుకున్న మహిళ ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది. కొన్ని సంవత్సరాలు భర్తతో కాపురం చేసిన మహిళ ఆమె భర్తతో విడిపోయింది. మరో యువకుడిని ప్రేమించి రెండో పెళ్లి చేసుకుంది. మొదటి భర్త దగ్గర ఓ బిడ్డ, భార్య దగ్గర ఓ బిడ్డ ఉన్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న రెండో భర్తతో ఆమె ఆరు సంవత్సరాల నుంచి కాపురం చేస్తోంది. ఇటీవల భార్య మీద ఆమె రెండో భర్త అనుమానం పెంచుకున్నాడు. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న భార్య అక్రమ సంబంధం పెట్టుకుని తనను మోసం చేస్తోందని ఆమె రెండో భర్తకు అనుమానం మొదలైయ్యింది.
ఇదే విషయంలో దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి. భార్యను హత్య చేసిన ఆమె రెండో భర్త ఆమె శవం మీద పెట్రోల్ పోసి నిప్పంటించి కాల్చి బూడిద చేశాడు. కాలిపోయిన మహిళ ఆచూకి ఏమాత్రం చిక్కలేదు. అయితే హత్యకు గురైన మహిళ చేతి వేలికి ఉన్న ఉంగరాన్ని ఆమెతో పాటు పని చేస్తున్న ఓ వ్యక్తి గుర్తు పట్టడంతో అక్కడ కథ మలుపు తిరిగింది.

మొదటి భర్తకు విడాకులు
బెంగళూరులో నివాసం ఉంటున్న నగీనా ఖానం అలియాస్ నగీనా (32) అనే మహిళకు 10 ఏళ్ల క్రితం వివాహం అయ్యింది. నగీనాకు ఇద్దరు పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టిన తరువాత నగీనా, ఆమె భర్త మద్య గొడవలు మొదలైనాయి. తరువాత నగీనా ఆమె భర్తతో విడిపోయింది. ఇద్దరు కొడుకుల్లో ఓ కొడుకు నగీనా దగ్గర, మరో కొడుకు ఆమె భర్త దగ్గర ఉన్నారు.

ప్రేమించి రెండో పెళ్లిచేసుకున్న నగీనా
యాదగిరి జిల్లాలోని హణుసగి ప్రాంతానికి చెందిన మోహమ్మద్ బెంగళూరు చేరుకుని జేసీబీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. నగీనా బెంగళూరులోనే ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఆరు సంవత్సరాల క్రితం మోహమ్మద్, నగీనాకు పరిచయం అయ్యింది. మోహమ్మద్ ను ప్రేమించిన నగీనా అతని రెండో పెళ్లి చేసుకుంది.

భార్య మీద రెండో భర్తకు డౌట్
ప్రేమించి పెళ్లి చేసుకున్న రెండో భర్త మోహమ్మద్ తో నగీనా కంగేరి ఉపనగర సమీపంలోని సన్ సిటీలోని అద్దె ఇంటిలో ఆరు సంవత్సరాల నుంచి కాపురం చేస్తోంది. ఇటీవల భార్య నగీనా మీద ఆమె రెండో భర్త మోహమ్మద్ అనుమానం పెంచుకున్నాడు. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న నగీనా వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని ఆమె రెండో భర్త మోహమ్మద్ కు అనుమానం పెరిగిపోయింది.

రెండో భార్యను చంపేయాలని స్కెచ్
అక్రమ సంబంధం పెట్టుకున్న తన రెండో భార్య నగీనా అందుకే ఎప్పుడంటే అప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్లడం, ఇంటికి రావడం చేస్తోందని, ప్రేమించి పెళ్లి చేసుకున్న తనను మోసం చేస్తోందని నగీనా మీద ఆమె రెండో భర్త మోహమ్మద్ కు అనుమానం మొదలైయ్యింది. తన భార్య నగీనాను చంేయాలని ఆమె రెండో భర్త మోహమ్మద్ స్కెచ్ వేశాడు.

భార్యను పక్కాప్లాన్ తో చంపేసిన రెండో భర్త
తన భార్య నగీనా నన్ను మోసం చేస్తోందని, ఆమెను చంపేయాలని మోహమ్మద్ అతనితో పాటు జేసీబీ డ్రైవర్ గా పని చేస్తున్న దోడ్డబళ్లాపురం సమీపంలోని సోణ్ణేనహళ్లికి చెందిన ప్రజ్వల్ అనే యువకుడికి చెప్పాడు. రామసంద్ర సమీపంలోకి నగీనాను పిలుచుకుని వెళ్లిన మోహమ్మద్ ఆమెను చంపేశాడు.

శవం కాల్చి బూడిద చేశారు
ఫ్రెండ్ ప్రజ్వల్ సహాయంతో నగీనా శవం మీద పెట్రోల్ పోసి నిప్పంటించి కాల్చి బూడిద చేసి అక్కడి నుంచి పరారైనారు. కాలిపోయిన మహిళ ఆచూకి ఏమాత్రం చిక్కలేదు. అయితే హత్యకు గురైన నగీనా చేతి వేలికి ఉన్న ఉంగరాన్ని తీసుకున్న పోలీసులు ప్రైవేట్ కంపెనీలు చుట్టూ తరిగి అందరి నుంచి వివరాలు సేకరించారు.

ఉంగరం గుర్తు పట్టిన నగీనా ఫ్రెండ్
నగీనాతో పాటు పని చేస్తున్న ఓ వ్యక్తి ఆ ఉంగరం గుర్తు పట్టడంతో అక్కడ కథ మలుపు తిరిగింది. నగీనాను హత్య చేసిన ఆమె రెండో భర్త మోహమ్మద్ యాదగిరిపారిపోయాడని, కొన్ని రోజుల తరువాత బెంగళూరు రావడంతో అతన్ని అరెస్టు చేశామని, నగీనా హత్యకు సహకరించిన ప్రజ్వల్ ను అరెస్టు చేశామని బెంగళూరు పోలీసలు తెలిపారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications