Permission: బళ్లారి వెళ్లాలని సుప్రీం కోర్టులో గాలి జనార్దన్ రెడ్డి పిటీషన్, సీబీఐ అభ్యంతరం, తీర్పు రిజర్వ్!

బెంగళూరు/బళ్లారి: మైనింగ్ కింగ్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి తాను బళ్లారి వెళ్లడాని అవకాశం ఇవ్వాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తన కూతురు యోగక్షేమాలు చూసుకోవడానికి తనకు అవకాశం ఇవ్వాలని, రెండు నెలల పాటు తాను బళ్లారిలో ఉండటానికి అవకాశం ఇవ్వాలని మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి సుప్రీం కోర్టులో అర్జీ సమర్పించారు.

అయితే మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి రెండు నెలల పాటు బళ్లారిలో ఉండటానికి అవకాశం ఇవ్వకూడదని సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సీబీఐ అభ్యంతరం వ్యక్తం చెయ్యడంతో గాలి జనార్దన్ రెడ్డి సుప్రీం కోర్టులో మరో పిటీషన్ వేశారు.

బిడ్డకు జన్మనిచ్చిన బ్రహ్మిణి

బిడ్డకు జన్మనిచ్చిన బ్రహ్మిణి

మైనింగ్ కింగ్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి బ్రహ్మిణి హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త రాజీవ్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గాలి జనార్దర్ రెడ్డి కుమార్తె బ్రహ్మిణి బెంగళూరులో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. బ్రహ్మిణి, ఆ బిడ్డ ప్రస్తుతం గాలి జనార్దర్ రెడ్డి సొంత ఊరు అయిన బళ్లారి సిటీలో ఉంటున్నారు.

సుప్రీం కోర్టును ఆశ్రయించిన గాలి జనార్దన్ రెడ్డి

సుప్రీం కోర్టును ఆశ్రయించిన గాలి జనార్దన్ రెడ్డి

మైనింగ్ కింగ్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి తాను బళ్లారి వెళ్లడాని అవకాశం ఇవ్వాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తన కూతురు బ్రహిణి, ఆమె బిడ్డ యోగక్షేమాలు చూసుకోవడానికి తనకు అవకాశం ఇవ్వాలని, రెండు నెలల పాటు తాను బళ్లారిలో ఉండటానికి అవకాశం ఇవ్వాలని మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి సుప్రీం కోర్టులో అర్జీ సమర్పించారు.

సీబీఐ అభ్యంతరం

సీబీఐ అభ్యంతరం

మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి రెండు నెలల పాటు బళ్లారిలో ఉండటానికి అవకాశం ఇవ్వకూడదని సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సీబీఐ అభ్యంతరం వ్యక్తం చెయ్యడంతో గాలి జనార్దన్ రెడ్డి సుప్రీం కోర్టులో మరో పిటీషన్ వేశారు. గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసు విచారణలో ఉన్న సమయంలో ఆయన అంతకాలం అక్కడ ఉంటే సమస్యలు వస్తాయని సీబీఐ అభిప్రాయం వ్యక్తం చేసిందని తెలిసింది.

కనీసం నెల రోజులు అవకాశం ఇవ్వండి

కనీసం నెల రోజులు అవకాశం ఇవ్వండి

అయితే కనీసం నెల రోజులు తాను బళ్లారిలో ఉండటానికి అవకాశం ఇవ్వాలని మరోసారి గాలి జనార్దన్ రెడ్డి సుప్రీం కోర్టుకు మనవి చేశారు. అర్జీ విచారణ చేసిన సుప్రీం కోర్టు తీర్పును రిజర్వులో పెట్టింది. అక్టోబర్ 10వ తేదీన సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వనుంది. తాను బళ్లారి వెళ్లడానికి సుప్రీం కోర్టు అవకాశం ఇస్తుంది మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఆశతో ఎదురు చూస్తున్నారని సమాచారం.

బళ్లారి, అనంతపురం, కడప

బళ్లారి, అనంతపురం, కడప

అక్రమ మైనింగ్ కేసులో అరెస్టు అయ్యి జైలుకు వెళ్లిన గాలి జనార్దర్ రెడ్డికి 2015లో సుప్రీం కోర్టు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. కర్ణాటకలోని బళ్లారి (గాలి జనార్దన్ రెడ్డి సొంత ఊరు)తో పాటు ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం, కడపలో అడుగుపెట్టకూడదని అప్పట్లో సుప్రీం కోర్టు షరతులు పెట్టింది. బళ్లారికి వెళ్లకుండా గాలి జనార్దన్ రెడ్డి బెంగళూరులో నివాసం ఉంటున్నారు. ఇంతకాలం సుప్రీం కోర్టులో అనుమతి తీసుకున్న తరువాతనే గాలి జనార్దన్ రెడ్డి బళ్లారి వెళ్లి వస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+