కులం పేరుతో దూషించిన టాప్ హీరో, కేసులు పెట్టడంతో మాయం అయిన స్టార్ హీరో!
బెంగళూరు: శ్యాండిల్‌వుడ్ నటుడు, దర్శకుడు రియల్ స్టార్ ఉపేంద్ర వివాదాస్పద ప్రకటనపై బెంగళూరులోని రెండు పోలీస్ స్టేషన్‌లలో, కర్ణాటక రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కులం పేరుతో దూషించానని కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులపై ఐపీసీ సెక్షన్ ప్రకారం ఉపేంద్ర అరెస్ట్ అవుతాడా ? శిక్ష పడుతుందా అని ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
గత మూడు రోజుల క్రితం ప్రజాకీయ పార్టీ గురించి సోషల్ మీడియాలో లైవ్ ప్రోగ్రాం నిర్వహించిన హీరో ఉపేంద్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే వీడియోలో ఓ కులాన్ని దూషించారని ప్రచారం జరగడం దుమారం రేగింది. ఆ తర్వాత నిరసనలు కూడా మొదలైనాయి.

అనంతరం పోలీస్ స్టేషన్లలో ఉపేంద్ర మీద అట్రాసిటీ ఫిర్యాదులు చేశారు. ఇప్పుడు విచారణకు హాజరుకాకుండా ఉపేంద్ర అదృశ్యమయ్యారు. హీరో ఉపేంద్రపై నమోదైన కేసుకు ఎలాంటి శిక్ష పడుతుందో, ఐపీసీ సెక్షన్లు ఏం చెబుతాయనేది ఆయన అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది.
ఏదైనా సంఘానికి, కులానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చెయ్యడం, సంఘానికి వ్యతిరేకంగా ఇతరలను ప్రేరేపించడం, రెండు వర్గాల మధ్య ద్వేషం లేదా చెడు ఇష్టాన్ని సృష్టించడం, ఇతరులను రెచ్చగొట్టడం, ఉద్దేశ్యంతో పుకారు వ్యాపించడానికి ప్రయత్నించడం చేస్తు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటారు.
మతం, జాతి, జన్మస్థలం, నివాసం, భాష, కులం లేదా సంఘాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తే జైలు శిక్షపడుతుందని పోలీసు అధికారులు, న్యాయవాదులు అంటున్నారు. ఇప్పుడు ఓ కులానికి వ్యతిరేకంగా హీరో ఉపేంద్ర వ్యాఖ్యలు చెయ్యడం. పలు పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు కావడంతో ఆయన మాచం అయ్యారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే హీరో ఉపేంద్ర ఈ విషయంలో ఇంత వరకు మీడియా ముందుకు రాలేదు.












Click it and Unblock the Notifications