డెడ్ లైన్ పెట్టిన డీకే శివకుమార్ ?, అయితే సీఎం, లేకపోతే మీ ఇష్టం, రాజీ లేదు!
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి, సీఎం కుర్చీ నీకా ?, నాకా ? అంటూ మాజీ సీఎం సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ పోటీ పడుతున్నారు. ఇదే సమయంలో మాజీ మంత్రి డీకే. శివకుమార్ చెప్పిన మాటలతో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తో పాటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల దిమ్మతిరిగిపోయింది.
డీకే శివకుమార్ సోమవారం మద్యాహ్నం ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. హెచ్ఏఎల్ నుంచి ప్రత్యేక విమానంలో సిద్దరామయ్య ఢిల్లీ వెళ్లిపోయారు. అయితే డీకే శివకుమార్ మాత్రం బెంగళూరులోనే ఉండిపోయారు. ఈ రోజు మే 15వ తేదీ డీకే శివకుమార్ బర్త్ డే. పుట్టిన రోజు సందర్బంగా డీకే శివకుమార్ కుటుంబ సభ్యులు ఇంట్లో ప్రత్యేక పూజలు చేశారు.

సోమవారం రాత్రి డీకే శివకుమార్ ఢిల్లీ వెలుతారని ఆయన సన్నిహితులు మీడియాకు మ్యాటర్ లీక్ చేశారు. అయితే రాత్రి డీకే శివకుమార్ బాంబు పేల్చారు. తనకు కడుపు నొప్పిగా ఉందని, ప్రయాణం చెయ్యకుండా విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు సమాచారం అందించారు.
కర్ణాటక సీఎం పదవి కోసం మాజీ సీఎం సిద్దరామయ్య సోనియా గాంధీకి ఎంతో నమ్మకస్తుడు అయిన కేసీ వేణుగోపాల్ ను ప్రసన్నం చేసుకుని తనకు సీఎం పదవి ఇప్పించాలని వేడుకున్నారు. సిద్దరామయ్యకు సీఎం సీటు ఇప్పించాలని కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో చక్రం తిప్పుతున్నారని తెలుసుకున్న డీకే శివకుమార్ షాక్ అయ్యారని తెలిసింది.
కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కూడా తనకు సీఎం పదవి ఇప్పించాలని ఆయన మనసులో మాట రణదీప్ సింగ్ సూర్జేవాల ద్వారా హైకమాండ్ కు సమాచారం ఇచ్చారు. అయితే మ్యాటర్ మొత్తం ఇప్పటికే ఢిల్లీకి చేరిపోయింది. కర్ణాటక మఖ్యమంత్రి ఎవరు అనే విషయంలో టెన్షన్ మొదలైయ్యింది.
ఇదే సమయంలో డీకే శివకుమార్ హైకమాండ్ కు ఓ సందేశం పంపించారని తెలిసింది. ఇస్తే తనకు సీఎం పదవి ఇవ్వాలని, లేదంటే ఉప ముఖ్యమంత్రి పదవి, వేరే మంత్రి పదవలు తనకు ఏమాత్రం అవసరం లేదని, తాను కాంగ్రెస్ పార్టీకి సామాన్య కార్యకర్తగా, ఓ ఎమ్మెల్యేగా మాత్రమే ఉంటానని డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు తేల్చి చెప్పారని తెలిసింది. అందుకే డీకే శివకుమార్ ఢిల్లీ వెళ్లలేదని, రానురాను పరిస్థితులు మారిపోయే అవకాశాలు ఉన్నాయని తెలిసింది.












Click it and Unblock the Notifications