Lady: భర్తకు విడాకులు ఇచ్చింది. ప్రియుడికి రసగుల్లా ఇచ్చింది, ప్రియురాలి కూతుర్ని ఏం చేశాడంటే ?
బెంగళూరు: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో సంతోంగా కాపురం చేసింది. దంపతులకు కూతురు పుట్టింది. కూతురు పుట్టిన తరువాత దంపతుల మధ్య గొడవలు ఎక్కువ అయ్యాయి. భార్య రోజూ ఉద్యోగానికి వెళ్లి వస్తుండటంతో ఆమె మీద భర్తకు అనుమానం మొదలైయ్యింది. ఇదే విషయంలో దంపతుల మద్య కొంతకాలం గొడవలు కూడా జరిగాయి. భర్త అనుమానించడంలో భార్య తీరుకూడా అలాగే ఉంది. భార్యకు టాటా చెప్పేసిన భర్త అతని దారి అతను చూసుకున్నాడు. భర్తను వదిలేసి కూతురితో కలిసి ఒంటరిగా ఉంటున్న మహిళ ఓ ప్రియుడిని సెట్ చేసుకుని అతన్ని ఆమె ఇంట్లోనే పెట్టుకుంది. అక్కడే ప్రియుడు అసలు కథ మొదలుపెట్టాడు.

భర్తతో సంతోషంగా కాపురం చేసింది
బెంగళూరు నగరంలోని కామాక్షిపాళ్యలో వాణి (పేరు మార్చడం జరిగింది) అనే మహిళ నివాసం ఉంటున్నది. ఐదు సంవత్సరాల క్రితం వాణి ఓ యువకుడిని పెళ్లి చేసుకుంది. వివాహం చేసుకున్న తరువాత భర్తతో వాణి సంతోషంగానే కాపురం చేసింది. వాణి, ఆమె భర్త ఇరు వైపు కుటుంబ సభ్యులకు దూరంగా ఇద్దరూ అద్దె ఇంటిలో నివాసం ఉంటూ హ్యాపీగా గడిపారు.

భార్యకు టాటా చెప్పేసిన భర్త
వాణికి మూడు సంవత్సరాల కుమార్తె ఉంది. కామాక్షిపాళ్య సమీపంలోని ఓ గార్మెంట్స్ ఫ్యాక్టరీలో వాణి ఉద్యోగం చేస్తున్నది. ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతున్న భార్య రాత్రి ఎప్పుడో తిరిగి ఇంటికి వస్తోంది. భర్త ఏమైనా ప్రశ్నిస్తే వాణి తిక్కతిక్కగా సమాధానం ఇవ్వడం మొదలుపెట్టింది. భార్య వాణికి అక్రమ సంబంధం ఉందని భర్తకు తెలిసిపోయింది. ఇదే విషయంలో దంపతుల మధ్య గొడవలు జరిగాయి, భార్య వాణి ఎంత చెప్పినా పద్దతి మార్చుకోకపోవడంతో గత ఏడాది భర్త ఆమెకు గుడ్ బై చెప్పి ఆమెతో విడిపోయాడు.

ప్రియుడిని సెట్ చేసుకుంది
భర్తను వదిలేసిన రెండు నెలలకే వాణి మరో ప్రియుడిని సెట్ చేసుకుంది, వాణి ప్రియుడికి 25 ఏళ్ల వయసు ఉంటుంది. భర్తకు దూరంగా ఉంటున్న వాణి ఆమె ప్రియుడితో ఎంజాయ్ చేస్తూ అతన్ని ఏకంగా ఇంటిలోనే తెచ్చి పెట్టుకుంది. ప్రియుడు వాణితో ఎంజాయ్ చేస్తూ అతని చేతి ఖర్చులకు డబ్బు సంపాధిస్తూ ప్రియురాలి జీతం డబ్బుతో ఎంజాయ్ చేస్తున్నాడు.

గంజాయి మత్తులో ప్రియుడు ఏం చేశాడంటే ?
వాణి ప్రియుడికి గంజాయి సేవించడం, మద్యం తాగడం అలవాటు ఉంది. ఎప్పటిలాగే మూడు సంవత్సరాల కుమార్తెను చూసుకోవాలని చెప్పిన వాణి ఉద్యోగానికి వెళ్లింది, అమ్మాయి నిద్రపోతున్న సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె ప్రియుడు గంజాయి సేవించి ఇంటికి వెళ్లాడు. గంజాయి మత్తులో ఉన్న నిందితుడు అతని ప్రియురాలు వాణి కూతురి మీద లైంగిక దాడి చేసి మత్తులో అమ్మాయిని చంపేశాడు.

శాడిస్టు కోసం గాలిస్తున్న పోలీసులు
సాయంత్రం ఇంటికి వెళ్లిన వాణి షాక్ అయ్యింది. కూతురు శవమై కనిపించడం, ప్రియుడు కనపకడకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చింది. మూడు ఏళ్ల అమ్మాయి మీద లైంగిక దాడి జరిగి ఆమెను కామాంధుడు చంపేశాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. అక్రమ సంబంధం పెట్టుకున్న ప్రియుడిని నమ్మిన మహిళ ఆమె కూతుర్ని పొగొట్టుకుని ఇప్పుడు లోబదిలో అంటోందని, పోలీసులు తెలిపారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications