Lady doctor: లవ్ మ్యారేజ్, ఊరికి వెళ్లిన భర్త, కూతురితో సహ శవమైన లేడీ డాక్టర్, ఏం జరిగింది?!
బెంగళూరు: మెడికల్ కాలేజ్ లో చదివే సమయంలో ప్రేమించుకున్నారు. కాలేజ్ చదువు పూర్తి అయిన తరువాత ప్రేమికులు పెద్దల అంగీకారంతో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. లేడీ డాక్టర్ దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఓ కుమార్తె ఉంది. భర్త సొంతంగా క్లీనిక్ నిర్వహిస్తున్నాడు. భర్త ఊరికి వెళ్లిన సమయంలో లేడీ డాక్టర్, ఆమె కూతురు మాత్రమే ఇంటిలోనే ఉన్నారు.
రెండు రోజుల తరువాత ఇంటికి వెళ్లిన భర్త తన భార్య, కూతురు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులకు సమాచారం ఇచ్చారు. లేడీ డాక్టర్, ఆమె కూతురు ఇంట్లో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించడం తో లేడీ డాక్టర్ కుటుంబ సభ్యులు హడలిపోయారు.
Recommended Video


లవ్ మ్యారేజ్
బెంగళూరుకు చెందిన సైమా (39) అనే యువతి మెడికల్ కాలేజ్ లో చదవే సమయంలో అదే కాలేజ్ లో చదువుతున్న కోలారుకు చెందిన నారాయణ్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. మెడికల్ కాలేజ్ లో చదివే సమయంలోనే సైమా, నారాయణ్ ప్రేమించుకున్నారు. కాలేజ్ చదువు పూర్తి అయిన తరువాత 10 సంవత్సరాల క్రితం డాక్టర్ ప్రేమికులు సైమా, నారాయణ్ ఇరు వైపుల పెద్దల అంగీకారంతో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు.

సంతోషంగా కాపురం చేసిన లేడీ డాక్టర్
లేడీ డాక్టర్ సైమా, ఆమె భర్త డాక్టర్ నారాయణ్ బెంగళూరులోని బనశంకరి సమీపంలోని కావేరీ నగర్ లోని సొంత ఇంటిలో కాపురం ఉంటూ సంతోషంగా కాపురం చేశారు. లేడీ డాక్టర్ సైమా, నారాయణ్ దంపతులకు ఆరాధనా (10) అనే కుమార్తె ఉంది. డాక్టర్ సైమా భర్త నారాయణ్ ఇంటి సమీపంలోనే సొంతంగా క్లీనిక్ నిర్వహిస్తున్నాడు.

ఇంటిలో శవమైన లేడీ డాక్టర్
నారాయణ్ సొంత పని మీద కోలారుకు వెళ్లిన సమయంలో ఆయన భార్య లేడీ డాక్టర్ సైమా, ఆమె కూతురు ఆరాధన బెంగళూరులోని ఇంటిలోనే ఉన్నారు. రెండు రోజుల తరువాత బెంగళూరులోని కావేరీ నగర్ లోని ఇంటికి వెళ్లిన నారాయణ్ తన భార్య డాక్టర్ సైమా. నా, కూతురు ఆరాధన ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులకు సమాచారం ఇచ్చారు.

లేడీ డాక్టర్ ఇంట్లో డెత్ నోట్?
లేడీ డాక్టర్ సైమా, ఆమె కూతురు ఆరాధనా ఇంట్లో ఉరి వేసుకున్న స్థితిలో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించారని, సంఘటనా స్థలంలో డెత్ నోట్ లేదని పోలీసులు అన్నారు. లేడీ డాక్టర్ సైమా, ఆమె కూతురు ఆరాధన అనుమానాస్ప స్థితిలో శవమై కనిపించడంతో ఆమె కుటుంబ సభ్యులు హడలిపోయారు డాక్టర్ నారాయణ్ ను విచారణ చేసి వివరాలు సేకరిస్తున్నామని బనశంకరి పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications