Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lady: పండుగ రోజు సొంత షాపులో దారుణ హత్య, హంతకులను పట్టించిన ర్యాంబో, అసలు మ్యాటర్, లేడీ!

బెంగళూరు/గదగ్: బోరు మోటార్లు రిపేర్ చేసే పని చేస్తున్న వ్యక్తి సొంతంగా ఓ షాపు నిర్వహిస్తున్నాడు. మోటార్ వైండింగ్ చేస్తున్నాడు. చాలా సంవత్సరాల నుంచి ఆ వ్యక్తి అదే ప్రాంతంలో మోటార్ వైండింగ్ పని చేస్తున్నాడు. స్థానికంగా నివాసం ఉంటున్న చాలా మంది అతనికి పరిచయం ఉన్నారు. ఇటీవల మోటర్ వైండింగ్ చేసే వ్యక్తి అతని సొంత షాప్ లో దారుణ హత్యకు గురైనాడు. కత్తులతో పొడిచి తల మీద బండరాయి వేసి అతి దారుణంగా హత్య చేశారు.

మొదట హంతకుల ఆచూకి పోలీసులకు చిక్కలేదు. జిల్లా హెడ్ క్వాటర్ నుంచి పోలీసు జాగిలాన్ని రప్పించి దర్యాప్తు చేశారు. ఓ లేడీతో పాటు ఆమె తమ్ముడు, అతని ఫ్రెండ్స్ ఇద్దరిని పోలీసు జాగిలం ర్యాంబో పట్టుకోవడం హాట్ టాపిక్ అయ్యింది.

సొంత షాపు

సొంత షాపు

కర్ణాటకలోని గదగ్ జిల్లాలోని శిరహట్టి తాలుకాలోని హోసహళ్లి గ్రామంలో ఈరప్ప అనే వ్యక్తి మోటారు వైండింగ్ పని చేస్తున్నాడు. 20 ఏళ్ల క్రితం హోసహళ్లికి చేరుకున్న ఈరప్ప బోరు మోటార్లు రిపేర్ చేసే పని చేస్తూ అక్కడే సొంతంగా ఓ షాపు నిర్వహిస్తున్నాడు. మోటార్ వైండింగ్ చేస్తున్న ఈరప్ప ఒక్కోరోజు రాత్రిపూట అతని షాపులోనే నిద్రపోతున్నాడు.

షాపులో దారుణ హత్య

షాపులో దారుణ హత్య

20 ఏళ్లుగా ఈరప్ప అదే ప్రాంతంలో మోటార్ వైండింగ్ పని చేస్తున్నాడు. స్థానికంగా నివాసం ఉంటున్న చాలా మంది ఈరప్పకు పరిచయం ఉన్నారు. దీపావళి పండుగ రోజు మోటర్ వైండింగ్ పని పూర్తి చేసిన ఈరప్ప అతని షాప్ లో నిద్రపోయాడు. అదే రోజు రాత్రి ఈరప్ప దారుణ హత్యకు గురైనాడు.

నలుగురు అరెస్టు

నలుగురు అరెస్టు

ఈరప్పను కత్తులతో పొడిచి తల మీద బండరాయి వేసి అతి దారుణంగా హత్య చేశారు. ఈరప్ప హత్య కేసులో హంతకుల ఆచూకి పోలీసులకు చిక్కలేదు. గదగ్ జిల్లా హెడ్ క్వాటర్ నుంచి పోలీసు జాగిలాన్ని రప్పించి దర్యాప్తు చేశారు. ఓ లేడీతో పాటు ఆమె తమ్ముడు, అతని ఫ్రెండ్స్ ఇద్దరిని పోలీసు జాగిలం ర్యాంబో పట్టుకుంది.

అక్రమ సంబంధం

అక్రమ సంబంధం

ఈరప్ప హత్య కేసులో అదే గ్రామంలో నివాసం ఉంటున్న దేవక్క, ఆమె తమ్ముడు మార్కండేయను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేవక్కతో ఈరప్ప అక్రమ సంబంధం పెట్టుకుని ఆమెతో కాలం గడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మార్కండేయ మా అక్క జోలికిరాకూడదని ఈరప్పను హెచ్చరించాడు.

అక్కతో ఫోన్ చేయించి పక్కాప్లాన్ తో?

అక్కతో ఫోన్ చేయించి పక్కాప్లాన్ తో?

ఈరప్ప పద్దతి మార్చుకోలేదని తెలిసింది. మార్కండేయ అతని స్నేహితులు మల్లేష్, హుచ్చప్పతో కలిసి ఈరప్పను కత్తులతో పొడిచి తల మీద బండరాళ్లు వేసి హత్య చేశారని పోలీసులు చెప్పారు. ఈరప్పను రాత్రి షాపులో ఉండాలని మార్కండేయ అతని అక్క దేవక్కతో ఫోన్ చేపించి చెప్పించాడని పోలీసులు అన్నారు. ఈరప్ప హత్య కేసులో దేవక్క, మార్కండేయ, మల్లేష్, హుచ్చప్పను అరెస్టు చేశామని గదగ్ పోలీసులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+