Lady: వదిన మీద కన్నేసిన మరిది, మ్యాటర్ తెలిసి అన్న ఏం చేశాడంటే ?, పెళ్లికి ముందే పక్కాప్లాన్!
బెంగళూరు/ దావణగెరె: సొంత అక్కాచెల్లి వేర్వేరు వ్యక్తులను పెళ్లి చేసుకుని ఇద్దరూ ఇద్దరు కొడుకులకు జన్మనిచ్చారు. అక్కాచెల్లెలు కొడుకులు పెళ్లి వయసుకు వచ్చారు. అక్క కొడుక్కి ఇటీవల వేరే యవతితో పెళ్లి ఫిక్స్ అయ్యింది. కుటుంబ సభ్యులు అందరి సమక్షంలో గ్రాండ్ గా నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థం సమయంలో అన్నకు కాబోయే వదినను చూసిన తమ్ముడు ఆమె మీద మనుసుపడ్డాడు. వదిన ఫోన్ నెంబర్ తీసుకున్న మరిది ఆమెతో సీక్రేట్ గా మాట్లాడటం మొదలు పెట్టాడు. అన్నకు తెలీకుండా ఇప్పటికే కొన్ని సార్లు కాబోయే వదిన ఇంటికి వెళ్లి ఆమెతో రాసుకుని పూసుకుని తిరిగేశాడు.
తనకు కాబోయే భార్య మీద తన తమ్ముడు కన్ను వేశాడని, తాను పెళ్లి చేసుకున్నా ఆమెను వాడు వదలడని అన్న రగిలిపోయాడు. పెళ్లికి ముందే తన తమ్ముడిని లేపేస్తే తరువాత తన భార్యతో తాను సంతోషంగా ఉండటానికి అవకాశం ఉంటుందని అన్న అనుకున్నాడు. పెళ్లి బట్టలు తీసుకోవడానికి తోడుగా తమ్ముడిని వెంట పిలుచుకుని వెళ్లిన అన్న అతన్ని దారుణంగా చంపేసి శవాన్ని విసిరేశాడు.

సొంత అక్కా, చెల్లెలు
కర్ణాటకలోని దావణగెరె జిల్లాలోని హరిహర పట్టణంలో అక్కా, చెల్లెలు నివాసం ఉంటున్నారు. 25 ఏళ్ల క్రితం సొంత అక్కాచెల్లి వేర్వేరు వ్యక్తులను పెళ్లి చేసుకుని ఇద్దరూ ఇద్దరు కొడుకులకు జన్మనిచ్చారు. హరిహర పట్టణంలోనే నివాసం ఉంటున్న అక్కాచెల్లెలు కొడుకు ఇబ్రహీం, అల్తాఫ్ లు పెళ్లి వయసుకు వచ్చారు.

అన్న పెళ్లి ఫిక్స్
పేరుకు ఇబ్రహీం, అతని తమ్ముడు అల్తాఫ్ పేరుకు అన్నాతమ్ముడు అయినా ఇద్దరూ స్నేహితుల్లా ఉంటారు. ఎక్కడికి వెళ్లినా ఇబ్రహీం, అల్తాఫ్ కలిసే వెలుతుంటారు. పార్టీలు, పంక్షలకు ఇబ్రహీం, అల్తాఫ్ కలిసే తిరుగుతుంటారు. ఇదే సమయంలో ఇబ్రహీంకు ఓ అందమైన అమ్మాయితో పెళ్లి చెయ్యాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.

పెళ్లి డేట్ ఫిక్స్ చేసిన పెద్దలు
దావణగెరె సమీపంలోని ఊరిలో నివాసం ఉంటున్న అందమైన యువతితో ఇబ్రహీం పెళ్లి చెయ్యాలని ఇరు కుటుంబ సభ్యులు మాట్లాడుకున్నారు. కుటుంబ సభ్యులు అందరి సమక్షంలో ఇబ్రహీం, ఆ అమ్మాయి నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. నిశ్చితార్థం సమయంలో అన్న ఇబ్రహీంకు కాబోయే వదినను చూసిన అతని తమ్ముడు అల్తాఫ్ ఆమె మీద మనుసుపడ్డాడు.

వదిన ఇంటికి సీక్రేట్ గా వెళ్లి?
వదిన ఫోన్ నెంబర్ తీసుకున్న మరిది అల్తాఫ్ ఆమెతో సీక్రేట్ గా మాట్లాడటం మొదలు పెట్టాడు. అన్న ఇబ్రహీంకు తెలీకుండా ఇప్పటికే కొన్ని సార్లు కాబోయే వదిన ఇంటికి వెళ్లిన అల్తాఫ్ ఆమెతో రాసుకుని పూసుకుని తిరిగేశాడు. కొన్ని రోజులుగా తనకు వేరే పని ఉందని అన్న ఇబ్రహీంకు చెప్పి తప్పించుకుని తిరుగుతున్న అల్తాఫ్ అతనికి కాబోయే వదిన ఇంటి చుట్టూ తిరగడం మొదలు పెట్టాడని తెలిసింది.

తమ్ముడిని చంపేయాలని స్కెచ్ వేసిన అన్న
తనకు కాబోయే భార్య మీద తన తమ్ముడు అల్తాఫ్ కన్ను వేశాడని, తాను పెళ్లి చేసుకున్నా ఆమెను వాడు వదలడని అతని అన్న ఇబ్రహీం రగిలిపోయాడు. పెళ్లికి ముందే తన తమ్ముడు అల్తాఫ్ ను లేపేస్తే తరువాత తన భార్యతో తాను సంతోషంగా ఉండటానికి అవకాశం ఉంటుందని, ఎంత త్వరగా ఆ పని పూర్తి చేస్తే అంతే తనకు మంచి జరుగుతుందని ఇబ్రహీం అనుకున్నాడు.

పెళ్లి బట్టలు తీసుకోవలని స్కెచ్
జనవరి 18వ తేదీన దావణగెరెలో పెళ్లి బట్టలు తీసుకోవడానికి వెలుతున్నానని, బట్టలు సెలెక్ట్ చెయ్యడానికి నువ్వుకూడా రావాలని ఇబ్రహీం అతని తమ్ముడు అల్తాఫ్ కు చెప్పాడు. తన అన్నతో పాటు తాను దావణగెరె వెలుతున్నానని అల్తాఫ్ అతని తండ్రి మోహబూబ్, అతని తల్లికి చెప్పి ఇంటి నుంచి బయలుదేరి వెళ్లాడు.

మరుసటి రోజు శవమైన తమ్ముడు
అన్న ఇబ్రహీంతో కలిసి అల్తాఫ్ బైక్ లో దావణగెరె వెలుతున్న విషయం స్థానికులు కొందరు చూశారు. అయితే మరుసటి రోజు జనవరి 19వ తేదీన దావణగెరెలోని కుందవాడ సమీపంలోని మహాలక్ష్మి లేఔట్ సమీపంలోని నిర్జనప్రదేశంలో అల్తాఫ్ తీవ్రగాయాలై రోడ్డు పక్కన శవమై కనిపించడం కలకలం రేపింది.

మ్యాటర్ మొత్తం చెప్పిన అన్న
తన కొడుకు అల్తాఫ్ ను అతని అన్న ఇబ్రహీం బయటకు పిలుచుకుని వెళ్లాడని, అతనే చంపేసి ఉంటాడని అల్తాఫ్ తండ్రి మహబూబ్ పోలీసులకు సమాచరం ఇచ్చాడు. పోలీసులు ఇబ్రహీంను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. తనకు మార్చిలో పెళ్లి జరగాల్సి ఉందని, ఇప్పటికే నిశ్చితార్థం కూడా జరిగిపోయిందని ఇబ్రహీం పోలీసులకు చెప్పాడు.
Recommended Video

వదిన మీద కన్ను వేశాడని చంపేశాడు
తనకు కాబోయే భార్య మీద తన తమ్ముడు అల్తాఫ్ కన్ను వేశాడని, అందుకే అతని అడ్డు తొలగించుకోవడానికి అతన్ని నేనే చంపేశానని ఇబ్రహీం అంగీకరించాడని పోలీసులు అన్నారు. కాబోయే వదిన మీద కన్ను వేసిన తమ్ముడు అల్లాప్ అతని అన్న చేతిలోనే హత్యకు గురి కావడం కలకలం రేపింది. పెళ్లి కాకముందే తన తమ్ముడు అల్తాఫ్ తనకు కాబోయే భార్య ఇంటికి వెళ్లి వస్తున్నాడని. పద్దతి మార్చుకోవాలని ఇప్పటికే రెండుమూడు సార్లు తాను అతన్ని హెచ్చరించానని, తప్పు చేశాను, ఇక ముందు ఆమె ఇంటికి వెళ్లనని చెప్పాడని ఇబ్రహీం పోలీసులకు చెప్పాడు. అయితే పదేపదే తనకు కాబోయే భార్యకు ఫోన్లు చెయ్యడం, ఆమె ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో వెళ్లి గంటలు గంటలు అక్కడే ఉండటం మొదలు పెట్టాడని, అల్లాఫ్ మాటలతో వినేటట్లు లేడని అతన్ని కొత్త బట్టలు తీసుకునే నెపంతో బయటకు పిలుచుకుని వెళ్లి చంపేశానని ఇబ్రహీం విచారణలో అంగీకరించాడని పోలీసు అధికారులు అంటున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications