బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Leader: మాజీ కార్పోరేటర్ దారుణ హత్య, హత్య చేసింది సొంత అన్న కొడుకు చేతిలో ఫినిష్, భార్య లీడర్!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: మాజీ కార్పోరేటర్ అయిన వ్యక్తి రాజకీయాల్లో చురుకుగా ఉంటున్నాడు. రాజకీయాల్లో ఉంటున్న ఆ లీడర్ మసీదు ప్రెసిడెంట్ గా పని చేస్తున్నాడు. రాజకీయ నాయకుడిగా, మతపరమైన కార్యక్రమాల్లో నిత్యం బిజీగా ఉంటున్న అతనికి కుటుంబ సమస్యలు ఉన్నాయి. మసీదు ప్రెసిడెంట్ పదవి మీద మాజీ కార్పోరేటర్ సొంత అన్న కొడుకు కన్ను వేశాడు. గత 15 ఏళ్లుగా మసీదు ప్రెసిడెంట్ గా పని చేస్తున్న మాజీ కార్పోరేటర్ ఆ పదవి నుంచి తప్పుకోవడానికి ససేమిరా అంటున్నాడు.

ఇదే విషయంలో సొంత కుటుంబంలోనే మాజీ కార్పోరేటర్ కు ఇంట్లో సమస్యలు మొదలైనాయి. మాజీ కార్పోరేటర్ భార్య కూడా మాజీ కార్పోరేటర్ కావడంతో అతనికి స్థానికంగా పలుకుబడి ఎక్కువగా ఉంది. రాత్రి అన్న కొడుకు మాజీ కార్పోరేటర్ ను అడ్డుకున్నాడు. నువ్వు బతికున్నంత వరకు నాకు మసీదు ప్రెసిడెంట్ పదవి చిక్కదని గట్టిగా కేకలు వేసి అతన్ని నడిరోడ్డులో దారుంగా పొడిచేశాడు. కత్తిపోట్లు బలంగా పడటంతో మాజీ కార్పోరేటర్ ప్రాణాలు గాలిలో కలిసిపోవడంతో ఐటీ హబ్ లోని ఆ ప్రాంతంలో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి.

Illegal affair: ఫ్యామిలీ ఫ్రెండ్స్, పాన్ మసాలా వ్యాపారితో భార్య ?, భర్త ఏం చేశాడంటే ?, వ్యాపారి భార్య కూడా!Illegal affair: ఫ్యామిలీ ఫ్రెండ్స్, పాన్ మసాలా వ్యాపారితో భార్య ?, భర్త ఏం చేశాడంటే ?, వ్యాపారి భార్య కూడా!

మాజీ కార్పోరేటర్

మాజీ కార్పోరేటర్

బెంగళూరు నగరం బీబీఎంపీ టిప్పు నగర్ వార్డు నెంబర్ 139లో గతంలో అయూబ్ ఖాన్ కార్పోరేటర్ గా పని చేశాడు. తరువాత జరిగిన కార్పోరేషన్ ఎన్నికల్లో అయూబ్ ఖాన్ ఓడిపోయాడు. మాజీ కార్పోరేటర్ అయిన అయూబ్ ఖాన్ కు ఆ ప్రాంతంలో పలుకుబడి ఎక్కువగానే ఉంది. సిటీ మార్కెట్ కావడంతో అయూబ్ ఖాన్ అతని వర్గంలో యువతను ఆకట్టుకుని కొంచెం మాస్ లీడర్ అయ్యాడు.

మసీదు ప్రెసిడెంట్

మసీదు ప్రెసిడెంట్

బెంగళూరు నగరంలోని చామరాజపేటలోని టిప్పునగర్ లో ఖుదాయత్ మసీదు ఉంది. గత 15 సంవత్సరాల నుంచి ఖుదాయత్ మసీదు ప్రెసిడెంట్ గా అయూబ్ ఖాన్ పని చేస్తున్నాడు. మాజీ కార్పోరేటర్ అయిన అయూబ్ ఖాన్ రాజకీయాల్లో చురుకుగా ఉంటున్నాడు. కొంచెం మాస్ లీడర్ గా పేరు తెచ్చుకున్న అయూబ్ ఖాన్ క్రమం తప్పకుండా మసీదుకు వెళ్లి వస్తున్నాడు.

మసీదు పదవి మీద కన్ను వేసిన అన్న కొడుకు

మసీదు పదవి మీద కన్ను వేసిన అన్న కొడుకు

రాజకీయాల్లో ఉంటున్న పొలిటికల్ లీడర్ అయూబ్ ఖాన్ మసీదు ప్రెసిడెంట్ గా పని చేస్తున్నాడు. రాజకీయ నాయకుడిగా, మతపరమైన కార్యక్రమాల్లో అయూబ్ ఖాన్ బిజీగా ఉంటున్నాడు. మాజీ కార్పోరేటర్ అయూబ్ ఖాన్ సొంత అన్న కొడుకు మతిన్ చాలాకాలంగా ఖుదాయత్ మసీదు అధ్యక్ష పదవి మీద కన్ను వేశాడు.

భార్య కూడా మాజీ కార్పోరేటర్

భార్య కూడా మాజీ కార్పోరేటర్

గత 15 ఏళ్లుగా మసీదు ప్రెసిడెంట్ గా పని చేస్తున్న మాజీ కార్పోరేటర్ అయూబ్ ఖాన్ మాత్రం మసీదు అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడానికి ససేమిరా అంటున్నాడు. ఇదే విషయంలో సొంత కుటుంబంలోనే మాజీ కార్పోరేటర్ అయూబ్ ఖాన్ కు ఇంట్లో సమస్యలు మొదలైనాయి. మాజీ కార్పోరేటర్ అయూబ్ ఖాన్ భార్య కూడా మాజీ కార్పోరేటర్ కావడంతో అతనికి స్థానికంగా పలుకుబడి ఎక్కువగా ఉంది.

మసీదు నుంచి వస్తుంటే కత్తితో పొడిచేసిన అన్న కొడుకు

మసీదు నుంచి వస్తుంటే కత్తితో పొడిచేసిన అన్న కొడుకు

బుధవారం రాత్రి మసీదులో నమాజ్ చేసిన మాజీ కార్పోరేటర్ అయూబ్ ఖాన్ బయటకు వచ్చాడు. అదే సమయంలో అన్న కొడుకు మతిన్ మాజీ కార్పోరేటర్ అయూబ్ ఖాన్ ను అడ్డుకుని పెద్ద గొడవ పెట్టుకున్నాడు. ఆ సమయంలో ఇద్దరి మద్య మాటామాటా పెరిగిపోయింది. నువ్వు బతికున్నంత వరకు నాకు మసీదు ప్రెసిడెంట్ పదవి చిక్కదని గట్టిగా కేకలు వేసిన మతిన్ నడిరోడ్డులో మాజీ కార్పోరేటర్ అయిన చిన్నాన అయూబ్ ఖాన్ ను దారుంగా పొడిచేశాడు.

ప్రాణం పోయింది.... అదనపు బలగాలు

ప్రాణం పోయింది.... అదనపు బలగాలు

కత్తిపోట్లు బలంగా పడటంతో మాజీ కార్పోరేటర్ అయూబ్ ఖాన్ ను వెంటనే విక్టోరియా ఆసుపత్రికి, అక్కడి నుంచి ప్రైవేట్ ఆసుత్రికి తరలించారు. చికిత్స విఫలమై మాజీ కార్పోరేటర్ అయూబ్ ఖాన్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మాజీ కార్పోరేటర్ అయూబ్ ఖాన్ హత్యకు గురికావడంతో బెంగళూరులోని చామరాజపేట్ లో ఉద్రిక్తి పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక పోలీసులతో పాటు కేఎస్ఆర్ పీ బలగాలను రంగంలోకి దింపిన పోలీసులు చామరాజపేట, టిప్పు నగరలో గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు.

English summary
Leader: KR City market ward no 139 Ex Corporator Ayub khan murder reported in Tippunagr in Bengaluru in Karnataka
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X