Lovers:హ్యాపీ లైఫ్ అనుకున్నారు, తిరిగేశారు. జీవితాంతం సంతోషంగా ఉండాలని, ప్రియురాలి వేల్ తో?
బెంగళూరు/చిక్కమగళూరు: యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. ఇద్దరు చాలా సంతోషంగా తిరిగారు. వయసులో ఉన్న ప్రేమికులు హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఇద్దరూ హ్యాపీగా పెళ్లి చేసుకుని పిల్లలతో కలిసి జీవితాంతం హ్యాపీగా ఉండాలని ఎన్నో ఆశలు కన్నారు. తన ప్రియురాలిని పెళ్లి చేసుకోవాలని ప్రియుడు ఊహించుకున్నాడు. అయితే చివరి నిమిషయంలో అంతా రివర్స్ అయ్యింది.
కర్ణాటకలోని చిక్కమగళూరు సమీపంలోని కల్లుగుడ్డలోని అన్నూరు ప్రాంతంలో దర్శన్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కర్ణాటకలోని హాసన్ జిల్లాలోని హనబాళులో పూర్వికా అనే యువతి నివాసం ఉంటున్నది. గత సంవత్సరం పూర్వికా, దర్శన్ కు పరిచయం అయ్యింది. తరువాత దర్శన్, పూర్వికా ఫోన్ నెంబర్లు తీసుకుని టచ్ లో ఉన్నారు.

రానురాను ప్రతిరోజు పూర్విక దర్శన్ ఫోన్లు చేసుకుని మాట్లాడుకుంటున్నారు. దర్శన్, పూర్విక పీకలలోతుల్లో ప్రేమలో మునిగిపోయారు. దర్శన్ ను పెళ్లి చేసుకుంటానని పూర్విక ఆమె కుటుంబ సభ్యులకు చెప్పింది. పాత సినిమా టైపులో పూర్విక కుటుంబ సభ్యులు ఓ డైలాగ్ వేశారు. వాడిని పెళ్లి చేసుకుంటే మేము ఆత్మహత్య చేసుకుంటామని పూర్వికను ఆమె కుటుంబ సభ్యులు బెదిరించారు.
ఎలాగైనా ప్రియుడు దర్శన్ ను పెళ్లి చేసుకోవాలని పూర్విక డిసైడ్ అయ్యింది. ప్రియుడు దర్శన్ కు ఫోన్ చేసిన పూర్విన మనం కలవాలని చెప్పింది. ప్రియుడు దర్శన్ అతని ప్రియురాలు పూర్వికను పిలుచుకుని చిక్కమగళూరు వెళ్లాడు. తరువాత పూర్విక, దర్శన్ చాలా సేపు మాట్లాడుకున్నారు. పెద్దలను ఎదిరించి మనం పెళ్లి చేసుకుని జీవితాంతం సుఖంగా జీవించలేమని ప్రేమికులు డిసైడ్ అయ్యారు.
ప్రియురాలు పూర్విక వేసుకున్న పంజాబి డ్రెస్ లోని వేల్ బయటకు తీశాడు. ఇద్దరూ ఆత్మహత్య చేసుకుందామని ప్రేమికులు మాట్లాడుకున్నారు. తరువాత ప్రియురాలు పూర్వికాతో కలిసి దర్శన్ అదే వేల్ తో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పెద్దలు పెళ్లికి వ్యతిరేకించడంతో ప్రేమికులు ఒకే వేల్ తో ఒకే చోట ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.












Click it and Unblock the Notifications