బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Santro Ravi: సీఎం, హోమ్ మంత్రికి చెమటలు పట్టించాడు, ప్రధాని ఇలాకాలో అరెస్ట్, రెండో భార్యతో!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/మైసూరు/ అహమ్మదాబాద్: ఎక్కడైనా సీఎం, మంత్రులు, ప్రతిపక్ష నాయకులు, రాజకీయ నాయకుల విమర్శలు, స్టేట్ మెంట్లు వైరల్ అవుతుంటాయి. అయితే కర్ణాటకలో ఇప్పుడు వైరల్ అవుతు్న పేరు స్యాంట్రో రవి. తాను బీజేపీ లీడర్ అని స్యాంట్రో రవి చెప్పుకుని తిరిగేశాడు. అధికారులకు బదిలీలు చేయిస్తానని వాళ్ల నుంచి లక్షల్లో వసూలు చేశాడని ఆరోపణలు ఉన్నాయి. వాడు ఎవడో మాకు తెలీదు, వెంటనే వాడిని అరెస్టు చెయ్యండి అంటూ ఏకంగా సీఎం, హోమ్ మంత్రి చెప్పారు.

స్యాంట్రో రవిని అధికార పార్టీ నాయకులు కాపాడుతున్నరని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి, రెండో భార్య కేసు పెట్టడంతో స్యాంట్రో రవి మీద ఎస్సీ, ఎస్టీ యాక్ట్ తో పాటు అత్యాచారం, హత్య చేస్తానని బెదిరించడం, అక్రమంగా ఆస్తులు సంపాధించాడని ఇలా అనేక కేసులు నమోదు అయ్యాయి. చాలా రోజుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న స్యాంట్రో రవి ప్రధాని నరేంద్ర మోదీ సొంత ఇలాకాలో అరెస్టు కావడం హాట్ టాపిక్ అయ్యింది.

Business: అల్లుడామజాకా, అత్త కొంప ముంచేసిన అల్లుడు, ఎగిరెగిరి పడుతున్న భార్య, ఏం చేశాడంటే?Business: అల్లుడామజాకా, అత్త కొంప ముంచేసిన అల్లుడు, ఎగిరెగిరి పడుతున్న భార్య, ఏం చేశాడంటే?

గుజరాత్ లో స్యాంట్రో రవి సార్ అరెస్టు

గుజరాత్ లో స్యాంట్రో రవి సార్ అరెస్టు

అక్రమ వ్యాపారాలు చేశాడని, అత్యాచారం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు స్యాంట్రో రవి అలియాస్ మంజునాథ్‌ను మైసూరు పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. మైసూరు పోలీసులు గత 11 రోజులుగా స్యాంట్రో రవి కోసం కంటిమీద కనుకులేకుండా గాలిస్తున్నారు. కర్ణాటకలోని నలుమూలలకు వెళ్లి స్యాంట్రో రవి కోసం గాలించారు. కర్ణాటక వదలి పారిపోయి గుజరాత్‌లో తలదాచుకున్న స్యాంట్రో రవిని శుక్రవారం మైసూరు పోలీసులు అరెస్ట్ చేశారు.

క్రిమినల్ మైండ్

క్రిమినల్ మైండ్

స్యాంట్రో రవి అతని సొంత మొబైల్ ఫోన్ వాడకుండా వేరే మొబైల్ ఫోన్ ఉపయోగించడంతో పోలీసులకు చిక్కలేదు. స్యాంట్రో రవి కదలికలను పోలీసులు సైబర్ టెక్నాలజీని ఉపయోగించి వెంటపడ్డారు. స్యాంట్రో రవి ఫోన్, శాటిలైట్ సమాచారం ఆధారంగా మైసూరు పోలీసులు ఉడిపి సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు వెళ్లి విచారణ చేపట్టారు.

తలనొప్పిగా తయారైన స్యాంట్రో రవి

తలనొప్పిగా తయారైన స్యాంట్రో రవి

తెలంగాణాలోని హైదరాబాద్ లో కూడా స్యాంట్రో రవి కోసం గాలించారు. అయితే స్యాంట్రో రవి ఆచూకీ మాత్రం పోలీసులకు చిక్కలేదు. మైసూరులో సొంత ఫోన్ స్విచ్ఛాఫ్ చేసిన స్యాంట్రో రవి అప్పటి నుంచి ఇతరుల ఫోన్లు ఉపయెగించి ఇన్ని రోజులు తప్పించుకుని తిరిగేశాడు. స్యాంట్రో రవి వ్యవహారం కర్ణాటక ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా తయారైయ్యింది.

గుజరాత్ లో అరెస్టు

గత 11 రోజుల నుంచి స్యాంట్రో రవి కోసం మైసూరు పోలీసులు గాలిస్తున్నారు. గుజరాత్ లో మకాం వేశాడని తెలుసుకున్న మైసూరు పోలీసులు అక్కడికి వెళ్లి శుక్రవారం స్యాంట్రో రవిని అరెస్టు చేసి విమానంలో మైసూరుకు తీసుకువస్తున్నారు. మండ్య, రామనగర, మైసూరు, బెంగళూరు, బెంగళూరు గ్రామీణ జిల్లాల్లో స్యాంట్రో రవి కోసం పోలీసులు గాలించారు. బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్‌లోని స్యాంట్రో రవి ఇంట్లో సోదాలు నిర్వహించారు.

రెండో భార్య దెబ్బతో ఫినిష్

రెండో భార్య దెబ్బతో ఫినిష్

స్యాంట్రో రవి బ్యాంకు ఖాతాలు, లాకర్లు పరిశీలించి సమాచారాన్ని సేకరించేందుకు పోలీసులు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. స్యాంట్రో రవి మీద మైసూరు నగరంలోని విజయ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. స్యాంట్రో రవి రెండో భార్య కేసు పెట్టడంతో కిలాడీకి మైండ్ బ్లాక్ అయ్యింది. ఎస్సీ, ఎస్టీ యాక్ట్ తో పాటు, అత్యాచారం, అట్రాసిటీ తదితర సెక్షల కింద స్యాంట్రో రవి మీద కేసులు నమోదు అయ్యాయి.

స్యాంట్రో రవి భార్యతో పాటు ఆమె సోదరి ఇచ్చిన స్టేట్‌మెంట్ రికార్డ్ చేయబడింది. దీంతో పాటు స్యాంట్రో రవి అక్రమంగా సంపాదించిన సొమ్ముపై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద విచారణ జరిపేందుకు మైసూరు సిటీ పోలీసులు సిద్ధమయ్యారని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

English summary
Mysuru city police arrested Santro Ravi in Gujarat after 11 days
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X