Neighbour: అక్క పక్కింట్లో ఆంటీ, భార్యకు ఫోన్లు చేస్తున్నాడని భర్తకు తెలిసి, చంపేసి నేరుగా ఇంటికే వెళ్లి!

బెంగళూరు/ హాసన్: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. దంపతులు నివాసం ఉంటున్న ఏరియాలో ఉంటున్న అక్కను చూడటానికి అప్పుడప్పుడు ఆమె తమ్ముడు వెలుతున్నాడు. ఇదే సమయంలో అక్క పక్కింటిలో నివాసం ఉంటున్న మహిళ అతనికి పరిచయం అయ్యింది. ఇద్దరూ ఫోన్ నెంబర్లు మార్చుకుని మాట్లాడుకుంటున్నారు. తన భార్యకు వేరే వ్యక్తి ఫోన్ చేసి రోజూ మాట్లాడుతున్నాడని భర్తకు తెలిసింది.

భార్యతో పాటు ఆమెకు ఫోన్ చేసి మాట్లాడుతున్న వ్యక్తికి భర్త చాలాసార్లు వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఇద్దరూ ఫోన్ లో మాట్లాడుకుంటూ అప్పుడప్పుడు కలుస్తున్నారని సమాచారం. విషయం తెలుసుకున్న భర్త అతని స్నేహితులతో కలిసి భార్యకు ఫోన్లు చేసి మాట్లాడుతున్న వ్యక్తిని దారుణంగా చంపేసి అతని ఇంటికే నేరుగా వెళ్లిన భర్త మీ వాడు ఫినిష్ అని చెప్పాడు.

భార్యతో సంతోషంగా ఉంటున్న భర్త

భార్యతో సంతోషంగా ఉంటున్న భర్త

కర్ణాటకలోని హాసన్ జిల్లాలోని హళేనరసీపుర తాలుకా, హళ్ళి మైసూరు గ్రామంలో హోస్సళ, సుమా దంపతులు నివాసం ఉంటున్నారు. వివాహం చేసుకున్నప్పటి నుంచి హోస్సళ, సుమా దంపతులు చాలా సంతోషంగా కాపురం చేస్తున్నారు. హోస్సళ, సుమా దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. హోస్సళ వ్యవసాయం చేయిస్తూ వ్యాపారం చేస్తున్నాడు.

అక్క ఇంటికి వెలుతుంటే పక్కింట్లో మహిళకు?

అక్క ఇంటికి వెలుతుంటే పక్కింట్లో మహిళకు?

మైసూరు జిల్లాలోని కేఆర్ నగర్ తాలుకాలోని కుప్పముద్దేనహళ్ళిలో రవి (46) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. రవి అక్క మంజుల హళ్ళి మైసూరులో నివాసం ఉంటున్నది. అక్క మంజులను చూడటానికి అప్పుడప్పుడు ఆమె తమ్ముడు రవి హళ్ళి మైసూరుకు వెలుతున్నాడు. ఇదే సమయంలో అక్క మంజుల పక్కింటిలో నివాసం ఉంటున్న సుమా రవికి పరిచయం అయ్యింది.

భర్త ఎప్పుడు బయటకు వెలుతాడా?

భర్త ఎప్పుడు బయటకు వెలుతాడా?

సుమా, రవి ఇద్దరూ ఫోన్ నెంబర్లు మార్చుకుని మాట్లాడుకుంటున్నారు. సుమా భర్త హోస్సళ బయటకు వెళ్లిన వెంటనే రవి అతని ఇంటికి వెళ్లి అతని భార్య సుమాతో కాలం గడుపుతున్నాడని తెలిసింది. హోస్సళ ఎప్పుడు బయటకు వెలుతాడా అంటూ రవి వేచి చూసి అతని ఇంటికి వెళ్లి అతని భార్య సుమాతో టైమ్ పాస్ చేస్తున్నాడని సమాచారం.

వార్నింగ్ ఇచ్చిన భర్త

వార్నింగ్ ఇచ్చిన భర్త

కొంతకాలం తరువాత పక్కింటిలో నివాసం ఉంటున్న మంజుల తమ్ముడు రవి తన ఇంటికి వచ్చి తన భార్య సుమాతో ఎక్కువగా మాట్లాడుతున్నాడని హోస్సళకు తెలిసింది. తన భార్య సుమాతో రవి అనే వ్యక్తి ఫోన్ చేసి రోజూ మాట్లాడుతున్నాడని హోస్సలకు తెలిసిపోవడంతో అతను రగిలిపోయాడని తెలిసింది. భార్య సుమాతో పాటు ఆమెకు ఫోన్ చేసి మాట్లాడుతున్న రవికి హోస్సళ చాలాసార్లు వార్నింగ్ ఇచ్చాడు.

చంపేసిన భర్త, ఫ్రెండ్స్

చంపేసిన భర్త, ఫ్రెండ్స్

అక్క మంజుల ఇంటికి వెళ్లిన రవి ఉదయం 10.30 గంటలకు ఇంట్లో టిఫిన్ చేసిన బయటకు వెళ్లాడు. తరువాత రవి ఆచూకిలేదు. మంజుల ఆమె తమ్ముడు రవికి ఫోన్ చేసింది. ఆ సమయంలో ఫోన్ రిసీవ్ చేసిన మంజు అనే వ్యక్తి మేము మీ తమ్ముడు రవిని ఇంటికి పిలుచుకుని వస్తున్నామని చెప్పాడు. అప్పటికే సుమా భర్త హోస్సళ, అతని స్నేహితులు మంజు, శ్రీజిత్, సాగర్ అనే నలుగురు కలిసి రవిని కత్తితో పొడిచి అతనికి ఉరి వేసి చంపేశారు.

అందుకే చంపేశామని చెప్పిన భర్త

అందుకే చంపేశామని చెప్పిన భర్త

హోస్సళతో పాటు అతని స్నేహితులు నేరుగా రవి అక్క మంజుల ఇంటికి వెళ్లారు. మీ తమ్ముడు పదేపదే నా భార్య సుమాకు ఫోన్లు చేసి వేధిస్తున్నాడని, వాడిని చంపేశామని, వాడి కథ క్లోజ్ అయ్యిందని హోస్సళ చెప్పాడు. విషయం తెలుసుకుని హడలిపోయిన మంజుల పోలీసులను ఆశ్రయించింది.

రవిని హత్య చేసిన హోస్సళ, అతని స్నేహితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు. భార్య సుమాకు ఫోన్ చేసినందుకే ఆమె భర్త హోస్సళ, అతని స్నేహితులు రవిని హత్య చెయ్యలేదని, వేరే కారణాలు ఉంటాయని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+