SI: లాయర్ తో గేమ్స్ ఆడిన ఎస్ఐ. చోరీ కేసులో లాయర్ ను అరెస్టు చేసి ఏం చేశారంటే ?, క్లైమాక్స్ లో?
బెంగళూరు/మంగళూరు: పోలీసులు దొంగలతో ఎలా వ్యవహరిస్తారో కొత్తగా చెప్పనవసరం లేదు. దొంగలను పట్టుకుంటున్న పోలీసులు వారిని జైలుకు పంపిస్తారు. జైల్లో ఉన్న వారిని బెయిల్ మీద లాయర్లు బయటకు తీసుకువస్తారు. జైల్లో ఉన్న వారితో లాయర్లు సంప్రధిస్తుంటారని కొత్తగా చెప్పనవసరం లేదు.
పోలీసులు, లాయర్లు. క్రిమినల్స్ కు కొన్ని సందర్బాల్లో చర్చలు జరుగుతుంటాయి. ఓ కేసుకు సంబంధించి ఎస్ఐ అర్దరాత్రి లాయర్ ఇంటిలోకి వెళ్లి ఆయన్ను అరెస్టు చెయ్యడం కలకలం రేపింది. ఓ దొంగ ఇచ్చిన సమాచారం మేరకు నిన్ను అరెస్టు చేశామని ఎస్ఐ ఆ న్యాయవాదికి చెప్పడం కలకలం రేపింది.

కర్ణాటకలోని మంగళూరులోని పూంజాలకట్టి పోలీస్ స్టేషన్ ఎస్ఐప సుతేష్ అదే మంగళూరులోని యువ న్యాయవాది కుల్ దీప్ ను అరెస్టు చేశారు. ఓ చోరీ కేసులో లాయర్ కులదీప్ ను అరెస్టు చెయ్యడం మంగళూరులో కలకలం రేపింది. తాను ఎలాంటి తపపు చెయ్యలేదని న్యాయవాది కులదీప్ అంటున్నారు.
అయితే ఎస్ఐ సుతేష్ మాత్రం తాను మంచి పని చేశానని, లాయర్ కులదీప్ కు చోరీ కేసుతో సంబంధం ఉందని వాదించారు. అయితే పోలీసు అధికారుల విచారణలో ఎస్ఐ సుతేష్ తప్పు చేశారని వెలుగు చూడటంతో అతన్ని సస్పెండ్ చేశారు. లాయర్ కులదీప్ అరెస్టు కావడంతో మంగళూరులో లాయర్ల ఆందోళనకు దిగారు. ఈ వ్యవహారం కర్ణఆటక సీఎం బసవరాజ్ బోమ్మయ్ వరకు వెళ్లడం కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications