Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మైండ్ బ్లాక్, ఓడిపోయిన మాజీ సీఎంకు మంత్రి పదవి, లక్ష్మణుడికి కూడా, లిస్ట్ లో!

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య పేరు, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ పేరును కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అధికారికంగా ప్రకటించింది. ఇన్ని రోజులు సీఎం పదవి కోసం పోటీ పడిన సిద్దరామయ్య, డీకే శివకుమార్ చివరికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తో పాటు సోనియా గాంధీ చర్చలతో ఇద్దరూ రాజీ అయ్యారు.

కాంగ్రెస్ పార్టీకి 135 మంది ఎమ్మెల్యేలు ఉండటంతో ఐదు సంవత్సరాలు ప్రభుత్వానికి ఎలాంటి డోకా లేదు. మొదటి విడతలో సిద్దరామయ్య సీఎంగా, రెండో విడతలో డీకే శివకుమార్ సీఎంగా ఉండటానికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం సీటు కోసం ఇన్ని రోజులు పోటీ పడుతున్న ఇద్దరు నాయకులు రాజీ కావడంతో ఇప్పుడు అసలు కథ మొదలైయ్యింది.

Siddaramaiah and DK Shivakumar are setting minister posts for followers in Karnataka

సిద్దరామయ్య వర్గంలో, డీకే శివకుమార్ వర్గంలో మంత్రి పదవులు ఆశిస్తున్నా నాయకులు చాల మంది ఉన్నారు. సీనియర్ ఎమ్మెల్యేలతో పాటు ఊహించని నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన వారికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందని సమాచారం. ఇదే మయంలో సిద్దరామయ్య, డీకే శివకుమార్ వర్గంలోని ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆశిస్సుతో చాలా మంది మంత్రులు అయ్యే అవకాశం ఉంది.

ఈ లిస్టులో కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ తో పోటీ చేసి ఓడిపోయిన జగదీష్ శెట్టర్ కూడా ఉన్నారు. అలాగే బీజేపీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ మీద పోటీ చేసి ఎమ్మెల్యే అయిన మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సవది కూడా మంత్రి పదవుల లిస్ట్ లో ఉన్న నాయకుల జాబితాలో ఉన్నారు. రాజ్యసభ మాజీ సభ్యుడు హరిప్రసాద్, కేంద్ర మాజీ మంత్రి కేహెచ్ మనియప్ప మంత్రి పదవులు కోసం ఆశపడుతున్నారని వెలుగు చూసింది.

సిద్దరామయ్య వర్గంలో కాబోయే మంత్రులు ?

* కేజే జార్జ్

* బసవరాజ రాయరెడ్డి

* దినేష్ గుండురావ్

* ఎంబీ. పాటిల్

* జమీర్ అహమ్మద్ ఖాన్

* తుకారామ్

* రహీమ్ ఖాన్

* రాఘవేంద్ర హిట్నాల్

* శివలింగేగడ

* ఎస్ఎస్ మల్లికార్జున్

* ఈశ్వర్ ఖండ్రే

* టీబీ జయచంద్ర

* అజయ్ సింగ్

* కృష్ణభైరే గౌడ

* సతీష్ జారకిహోళి

* డాక్టర్ హెచ్ సీ మహదేవప్ప

* వినయ్ కులకర్ణి

* యూటీ ఖాదర్

డీకే శివకుమార్ వర్గంలో కాబోయే మంత్రులు ?

* లక్ష్మీ హెబ్బాళ్కర్

* ఎస్. రవి

* తన్వీర్ సేఠ్

Siddaramaiah and DK Shivakumar are setting minister posts for followers in Karnataka

* మధు బంగారప్ప తదితరులు

కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సూచించిన నాయకలు వీరే

* డాక్టర్ జీ పరమేశ్వర్

* బీకే హరిప్రసాద్

* రామలింగా రెడ్డి

* జగదీష్ శెట్టర్ (ఎమ్మెల్యేగా ఓడిపోయినా మంత్రి పదవి వస్తోంది)

* లక్ష్మణ సవది

* ప్రియాంక ఖార్గే

* కేంద్ర మాజీ మంత్రి కేహెచ్ మునియప్ప

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+