Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Sister: లాడ్జ్ లో శవమైన కాలేజ్ అమ్మాయి, అబ్బాయి. లవర్స్ కాదు. చెల్లెలితో ?, ఏం జరిగిదంటే?, చివరికి!

బెంగళూరు/ధారవాడ: అక్కాచెల్లెళ్లు పెళ్లి చేకుని వేర్వేరు ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. అక్కకు కాలేజ్ చదువు పూర్తి చేసిన కొడుకు ఉన్నాడు. చెల్లెలికి ఇంటర్ చదువుతున్న కూతురు ఉంది. పండుగలు. శుభకార్యాలతో పాటు అప్పుడప్పుడు అక్కాచెల్లెలు, వారి పిల్లలు పుట్టింటిలో కలుస్తున్నారు. అక్కాచెల్లెళ్లు ఒకరి ఇంటికి ఒకరు వెళ్లి వస్తున్నారు. అందరి పిల్లలు కలిసి సంతోషంగా తిరుతున్నారు.

అక్క కుమారుడికి బెంగళూరులో ఉద్యోగం వచ్చింది. నేను బెంగళూరు వెలుతున్నానని యువకుడు కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లిపోయాడు. కాలేజ్ కు వెలుతున్నానని యువతి ఇంట్లో చెప్పి వెళ్లిపోయింది. అయితే తరువాత లాడ్జ్ లో జరిగిన విషయం వేరే కావడంతో అక్కాచెల్లెళ్ల కుటుంబ సభ్యులు హడలిపోయారు.

అక్కాచెల్లెలు

అక్కాచెల్లెలు

కర్ణాటకలోని ధారవాడలో నవలగుంద తాలుకాలోని బెళవటి గ్రామంలో కుమార్ (22) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. నవలగుంద తాలుకాలోని నీరలకట్టే గ్రామంలో దీపా (19) అనే యువతి నివాసం ఉంటున్నది. కుమార్ తల్లి, దీపా తల్లి సొంత అక్కాచెల్లెళ్లు.

 అక్కాచెల్లెళ్ల ఫ్యామిలీ హ్యాపీలైఫ్

అక్కాచెల్లెళ్ల ఫ్యామిలీ హ్యాపీలైఫ్

అక్క కొడుకు కుమార్ కాలేజ్ చదువు పూర్తి చేశాడు. చెల్లెలి కుమార్తె దీపా ఇంటర్ చదువుతోంది. పండుగలు. శుభకార్యాలతో పాటు అప్పుడప్పుడు అక్కాచెల్లెలు, వారి పిల్లలు కుమార్, దీపా తదితరులు అమ్మమ్మ ఇంటిలో కలుస్తున్నారు. అక్కాచెల్లెళ్లు ఒకరి ఇంటికి ఒకరు వెళ్లి వస్తున్నారు. అందరి పిల్లలు కలిసి సంతోషంగా తిరుతున్నారు.

 చిన్నమ్మ ఇంటిలోనే మకాం వేసిన యువకుడు

చిన్నమ్మ ఇంటిలోనే మకాం వేసిన యువకుడు

గత ఏడాది కుమార్ ధారవాడలోని కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ధారవాడలో ఉద్యోగం చేస్తున్న కుమార్ పనికి వెళ్లడానికి దగ్గరగా ఉంటుందని అతని చిన్నమ్మ ఇంటిలో చాలా నెలలపాటు ఉన్నాడు. ఆ సందర్బంలో కుమార్ అతని చిన్నమ్మ కూతురు దీపాను కాలేజ్ దగ్గర వదిలిపెట్టడం, సాయంత్రం కాలేజ్ నుంచి పిలుచుకుని వచ్చాడు. చాలా నెలల పాటు కుమార్ అతని చిన్నమ్మ ఇంటిలోనే ఉన్నాడు.

 బెంగళూరులో ఉద్యోగం

బెంగళూరులో ఉద్యోగం

నవంబర్ 25వ తేదీన తనకు బెంగళూరులో ఉద్యోగం వచ్చిందని, వారం రోజుల తరువాత తాను బెంగళూరు వెలుతున్నానని కుమార్ అతని తల్లిదండ్రులకు చెప్పాడు. డిసెంబర్ 5వ తేదీన కుమార్ తాను బెంగళూరు వెలుతున్నానని ఇంటి నుంచి బయలుదేరాడు. అదే రోజు ఉదయం కుమార్ చిన్నమ్మ కూతురు దీపా తాను కాలేజ్ కు వెలుతున్నానని ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లింది.

లాడ్జ్ లో శవమైన అన్నాచెల్లెలు

లాడ్జ్ లో శవమైన అన్నాచెల్లెలు

దీపా ఆరోజు రాత్రి ఇంటికి వెళ్లలేదు. అన్న కుమార్ తో కలిసి దీపా ఊరికి వెళ్లి ఉంటుందని ఆమె తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోలేదు. అయితే దీపా, కుమార్ నేరుగా ధారవాడ జిల్లాలోని నవలగుంద పట్టణం చేరుకుని అశోక్ లాడ్జ్ లో రూమ్ తీసుకున్నారు. మేమ అన్నాచెల్లెలు అని లాడ్జ్ సిబ్బందికి చెప్పారు.

రెండు రోజులు లాడ్జ్ లో గడిపిన తరువాత?

రెండు రోజులు లాడ్జ్ లో గడిపిన తరువాత?

రెండు రోజుల పాటు కుమార్, అతని చిన్నమ్మ కూతురు దీపా లాడ్జ్ లో ఉంటూ పగలు బయట తిరిగి వచ్చారు. బుధవారం రూమ్ లోకి వెళ్లిన కుమార్, దీపా తరువాత బయటకు రాలేదు. ఒక్కరోజు పూర్తిగా కుమార్, దీపా రూమ్ లో నుంచి బయటకు రాకపోవడంతో లాడ్జ్ సిబ్బందికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఒకే ఫ్యాన్ కు ఉరి వేసుకున్న అన్నాచెల్లెలు

ఒకే ఫ్యాన్ కు ఉరి వేసుకున్న అన్నాచెల్లెలు

పోలీసులు లాడ్జ్ రూమ్ తాళాలు పగలగొట్టి చూడగా కుమార్, దీపా ఒకే ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగు చూసింది. విషయం తెలుసుకున్న దీపా, కుమార్ కుటుంబ సభ్యులు హడలిపోయారు. లాడ్జ్ లో ఆత్మహత్య చేసుకుందని లవర్స్ కాదని, అన్నా, చెల్లెలు అని వెలుగు చూడడటం ధారవాడ జిల్లాలో కలకలం రేపింది. అయితే కుమార్, దీపా ఆత్మహత్యకు కచ్చితమైన కారణాలు తెలియడం లేదని, కేసు విచారణలో ఉందని పోలీసులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+