Super police: నాటీకోళ్లను అరెస్టు చేసి సెల్ లో పెట్టిన సూపర్ పోలీస్, వీళ్లకు గోల్డ్ మెడల్ ఇచ్చేయండి!
బెంగళూరు/కోప్పళ: సంక్రాంతి పండుగ సందర్బంగా దక్షిణ భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో కోడి పందాలు. ఎద్దుల పోటీలు. పేకాట జోరుగా సాగిందని సమాచారం. అయితే ఇక్కడ పోలీసులు లా అండ్ ఆర్డర్ అదుపు తప్పితే మేము సహించలేము అంటూ పోలీస్ స్టోరీ సినిమాలో డైలాంగ్ కింగ్ సాయికుమార్ రెచ్చిపోయినట్లు ఇక్కడా పోలీసులు రెచ్చిపోయారు. పేకాట, కోడి పందాలు జరుగుతున్న ప్రాంతాల్లో పోలీసులు దాడులు చేశారు. నేరుగా సీనియర్ అధికారుల దగ్గరకు వెళ్లిన పోలీసులు సార్ మేము మూడు కోళ్లను అరెస్టు చేశామని చెప్పారు.
ఒరేయ్ ఎవరక్కడ, వెంటనే మనోళ్లకు బంగారు పథకాలు, అవార్డుల, రివార్డులు ఇవ్వడానికి ఏర్పాట్లు చెయ్యండిరా అంటూ సీనియర్ అధికారులు చెప్పడంతో సాటి పోలీసులు షాక్ అయ్యారు. కోళ్లను అరెస్టు చేశామని వచ్చి సిగ్గులేకుండా చెబుతారా అంటూ ఆ పోలీసులకు పైఅధికారులు చివాట్లు పెట్టారని తెలిసింది.

కోడి పందాలు, పేకాట
కర్ణాటకలోని కోప్పళ జిల్లాలోని కరటగి అంటే కన్నడిగులకు రైస్ మిల్లులు గుర్తుకు వస్తాయి. కర్ణాటక రాష్ట్రంలోనే ఎక్కడా లేనన్ని రైస్ మిల్లులు కరటగిలో ఉన్నాయి, ఇటీవలి కాలంలో కరటగి ప్రాంతం పేకాట పాపారాయుళ్ల అడ్డాగా మారుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కోడి పందాలు, మట్కాతో సహా జూదం కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి, ఇలాంటి ప్రాంతంలో ఓ విచిత్రమైన సంఘటన జరిగింది.

కోళ్లను అరెస్టు చేసిన పోలీసులు
కరటగి తాలూకా బసన్న క్యాంపులో కోడిపందాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో పోలీసులు దాడి చేసి మూడు కోళ్లను పట్టుకుని కరటగి పోలీస్ స్టేషన్‌లోని జైలులో ఉంచారు. కోడిపందాలలోని సెల్ లో మూడు కోళ్లను పెట్టడం కోప్పళ జిల్లాలో హాట్ టాపిక్ అయ్యింది. కరటగిలోని బసన్న క్యాంపులో కోడిపందాలు జరుగుతున్నాయని సమాచారం తెలుసుకున్న పోలీసులు జీపులో కోడిపందాలు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లారు. పోలీసుల కంట పడిన జూదగాళ్లు బైక్‌లు వదిలి పారిపోయారు. ఈ సందర్భంలో పోలీసులు తొమ్మిది బైక్‌లు, మూడు కోళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కోళ్లను సెల్ లో కట్టేసి ఫోజులు కొట్టిన పోలీసులు
స్వాధీనం చేసుకున్న కోళ్లను పోలీస్ స్టేషన్ లోని సెల్ లో కట్టేసిన పోలీసులు ఫోజులు కొట్టారు. కారటగి పోలీస్ స్టేషన్‌లో సెల్ లో కోళ్లను కట్టేసిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పోలీసు అధికారులు మండిపడ్డారు. జూదగాళ్లనను వదిలేసిన పోలీసులు కోళ్లను అరెస్టు చేసి సెల్ లో కట్టేయడంతో పై పోలీసు అధికారులు మండిపడ్డారు.
పోలీసుల చర్యపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. నాటీ కోళ్లను పోలీస్ స్టేషన్ బయట కట్టేయకుండా పెద్ద మగాళ్లు లాగా వాటిని సెల్ లో కట్టేసి ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టిన తిక్కపోలీసుల మీద చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications