Wife: భార్య మీద కేసు పెట్టిన భర్త, లిస్ట్ లో పాస్టర్లు, రౌడీషీటర్లు, టార్చర్ పెడుతోంది, అత్తమామలు, టెన్షన్!

బెంగళూరు/హుబ్బళి: ఒకే కులానికి చెందిన యువతి, యువకుడికి పెద్దలు పెళ్లి చేశారు. దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. ఇటీవల దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. నువ్వు మతం మారితేనే నేను నీతో కలసి కాపురం చేస్తానని, లేదంటే నాదారి నేను చూసుకుంటానని భార్య రాద్దాంతం చేసింది.

మతం మారకూడదని తాను పదేపదే చెప్పినా అతని భార్య, అత్తమామలు ఏమాత్రం పట్టించుకోలేదని, కచ్చితంగా మతం మారాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపిస్తూ భర్త పోలీసులను ఆశ్రయించాడు. భార్యతో పాటు కొందరు పాస్టర్లు, కొందరు రౌడీషీటర్ల మీద భర్త కేసు పెట్టడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తి పరిస్థితులు నెలకొన్నాయి.

భార్యతో హ్యాపీ

భార్యతో హ్యాపీ

కర్ణాటకలోని హుబ్బళి నగరంలో సంపత్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. సంపత్ శిక్కలిగర్ కులానికి చెందిన. శిక్కలిగర్ కులానికే చెందిన అమ్మాయిని కొన్ని సంవత్సరాల క్రితం సంపత్ పెళ్లి చేసుకున్నాడు. సంపత్ ది పెద్దలు కుదుర్చిన వివాహం. వివాహం చేసుకున్న సంపత్ అతని భార్యతో కొంతకాలం క్రితం వరకు సంతోషంగా కాపురం చేశాడు.

క్రైస్తవ మతం స్వీకరించాలని భార్య ఒత్తిడి

క్రైస్తవ మతం స్వీకరించాలని భార్య ఒత్తిడి

ఇటీవల సంపత్ దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. నువ్వు క్రైస్తవ మతం స్వీకరించాలని, మతం మారితేనే నేను నీతో కలసి కాపురం చేస్తానని, లేదంటే నాదారి నేను చూసుకుంటానని సంతప్ తో అతని భార్య గొడవ పెట్టుకుంది. సంపత్ భార్య తల్లిదండ్రుల ఇంటికి కొందరు పాస్టర్లు వెళ్లి ప్రార్థనలు చేస్తున్నారని, వారిని చర్చికి పిలుచుకుని వెలుతున్నారని వెలుగు చూసింది.

టార్చర్ తట్టుకోలేక కేసు పెట్టిన భర్త

టార్చర్ తట్టుకోలేక కేసు పెట్టిన భర్త

మనం క్రైస్తవ మతంలోకి మారకూడదని, హిందువులగానే ఉందామని తాను పదేపదే చెప్పినా తన భార్య, ఆమె తల్లిదండ్రులు ఏమాత్రం పట్టించుకోలేదని, కచ్చితంగా మతం మారాలని తన మీద ఒత్తిడి చేస్తున్నారని ఆరోపిస్తూ సంపత్ హుబ్బళి పోలీసులను ఆశ్రయించాడు.శిక్కలిగర్ కులంలోని చాలా మందిని క్రైస్తవ మతం స్వీకరించాలని ఒత్తిడి చేస్తున్నారని సంపత్ మీడియాకు చెప్పారు.

15 మంది మీద ఫిర్యాదు, రౌడీషీటర్లు, పాస్టర్లు

15 మంది మీద ఫిర్యాదు, రౌడీషీటర్లు, పాస్టర్లు

సంపత్ అతని భార్య, అత్తమామలతో పాటు చర్చి పాస్టర్లు, హుబ్బళిలోని కొందరు రౌడీషీటర్ల మీద కేసు పెట్టడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తి పరిస్థితులు నెలకొన్నాయి. సంపత్ ఫిర్యాదు చేశాడని, అయితే ఇంకా చర్చి ఫాదర్ల మీద కేసు నమోదు చెయ్యాలని, కేసు విచారణలో ఉందని హుబ్బళి పోలీసు అధికారులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+