Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఫ్యామిలీతో వెలుతున్న సీఎం, పక్క సీటులో భార్య, సీఎం కారు నిలిపేసి సోదాలు చేసి ?, అంతా ఓకే !

బెంగళూరు/దొడ్డబళ్లాపురం: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమలులో ఉంది. మే 10వ తేదీన కర్ణాటకలోని 224 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఒకే రోజు పోలింగ్ జరగనుంది. మే 13వ తేదీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది. కర్ణాటకలో ఎన్నికల అధికారులు సోదాలు ముమ్మరం చేశారు. ప్రత్యేక చెక్ పోస్టులో కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్ ఫ్యామిలీతో వెలుతున్న కారును అధికారులు నిలిపేసి కారును క్షుణ్ణంగా పరిశీలించారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న విషయం తెలిసిందే. కర్ణాటకలోని పొరుగు రాష్ట్రాల సరిహద్దులో, కర్ణాటకలోని అన్ని జిల్లాల సరిహద్దుల్లో ఎన్నికల అధికారులు ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా బెంగళూరు సిటీ, బెంగళూరు గ్రామీణ జిల్లాల సరిహద్దులో కూడా ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.

 The election officials stopped and searched the Karnataka CMs car while he was leaving with his family near Bengaluru.

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరు గ్రామీణ జిల్లాలోని దోడ్డబళ్లాపురం సమీపంలోని ప్రముఖ పురాతన దేవాలయం ఘాటి సుబ్రమణ్యస్వామి దేవాలయానికి బయలుదేరారు. మార్గం మధ్యలో దోడ్డబళ్లాపురం తాలుకాలోని హోసగుడ్య సమీపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక చెక్ పోస్ట్ లో సీఎం బసవరాజ్ బోమ్మయ్ కారును ఎన్నికల అధికారులు నిలిపివేశారు.

కుటుంబ సభ్యులతో కలిసి వెలుతున్న సీఎం బసవరాజ్ బోమ్మయ్ కారును నిలిపిన అధికారులు ఆకారును క్షుణ్ణగా పరిశీలించారు. ఎన్నికల అధికారుల సోదాలకు సహకరించిన సీఎం బసవరాజ్ బోమ్మయ్ తరువాత ఆయన సతీమణితో కలిసి ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని శ్రీ ఘాటి సుబ్రమణ్య ఆలయం చేరుకుని ప్రత్యేక పూజలు చేసి శ్రీ సుబ్రమణ్యస్వామిని దర్శించుకున్నారు.

ఈ సందర్బంగా కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ వెంట బెంగళూరు గ్రామీణ జిల్లా ఎస్పీ మల్లికార్జున్, పోలీసు అధికారులు ఉన్నారు. కామన్ మెన్ సీఎంగా గుర్తింపు తెచ్చుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ ఆయన భార్యతో కలిసి వెలుతున్నా కారు నిలిపి ఎన్నికల అధికారులు సోదాలకు సహకరించడం హాట్ టాపిక్ అయ్యింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+