Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Wife: పక్కలో కొత్త పెళ్లికూతురు, గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసిందని భార్యను ట్రాఫిక్ లో వదిలేసి పరుగో పరుగు !

పెళ్లి అయిన కొద్ది రోజులకే భర్త అతని భార్యను ట్రాఫిక్ లో వదిలి పారిపోయాడు. మాజీ ప్రియురాలు ఫోన్ చెయ్యడంతో వెంటనే కారు దిగిన యువకుడు అతని భార్యను, కారును నడిరోడ్డులో వదిలేసి పరుగు తీశాడు.

బెంగళూరు/గోవా: పెళ్లి అయిన కొద్ది రోజులకే భర్త అతని భార్యను ట్రాఫిక్ లో వదిలి పారిపోయాడు. మాజీ ప్రియురాలు ఫోన్ చెయ్యడంతో వెంటనే కారు దిగిన యువకుడు అతని భార్యను, కారును నడిరోడ్డులో వదిలేసి పరుగు తీశాడు. ట్రాఫిక్ జామ్ అయ్యిందని తెలుసుకున్న యువకుడు కొత్త పెళ్లికూతుర్ని అక్కడే వదిలేసి పారిపోవడం హాట్ టాపిక్ అయ్యింది. కారు దిగి భార్యను వదిలి పారిపోయిన కొత్త పెళ్లి కొడుకు ఎక్కడ ఉన్నాడు ?, ఏం చేస్తున్నాడు ? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. పెళ్లి జరిగిన కొన్ని రోజులకే భర్త అతని భార్యకు, కుటుంబ సభ్యులకు అందరికి షాక్ ఇవ్వడం ఐటీ హబ్ లో హాట్ టాపిక్ అయ్యింది.

జంట సూపర్ గా ఉంది

జంట సూపర్ గా ఉంది


బెంగళూరులోని మహదేవపురలో నివాసం ఉంటున్న యువకుడికి ఫిబ్రవరి 15వ తేదీన అతని కుటుంబ సభ్యులు వివాహం జరిపించారు. యువతి, యువకుడి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు అందరి సమక్షంలో చర్చిలో పెళ్లి జరిగింది. యువకుడికి 26 సంవత్సరాలు, యువతికి 24 సంవత్సరాలు. జంట చూడటానికి ముచ్చటగా ఉన్నారని అందరూ మురిసిపోయారు. పెళ్లి సందర్బంగా అందరికి ఫంక్షన్ హాల్ లో గ్రాండ్ గా పార్టీ ఇచ్చారు.

గోవా నుంచి పిలిపించి ?


యువకుడికి బాగా తెలిసిన యువతితోనే పెళ్లి జరిగింది. యువకుడి తండ్రి బెంగళూరులో, గోవాలో ఉద్యోగాలు ఇప్పించే ఏజెన్సీ కార్యాలయాలు నిర్వహిస్తున్నాడు. తండ్రి కార్యాలయాలను ఆ యువకుడు చూసుకుంటున్నాడు. బెంగళూరులో పని ఉందని యువకుడిని అర్జెంట్ గా పిలిపించి కుటుంబ సభ్యులకు తెలిసిన అమ్మాయితోనే పెళ్లి జరిపించేశారు. అమ్మాయిని పెళ్లి చేసుకోను అని ఆ యువకుడు చెప్పలేకపోయాడని తెలిసింది.

చర్చిలో ప్రార్థనలు చేసి ?

చర్చిలో ప్రార్థనలు చేసి ?

వివాహం జరిగిన తరువాత దంపతులు బెంగళూరులోనే నివాసం ఉంటున్నారు. టిన్ ఫ్యాక్టరీ సమీపంలోనే చర్చికి నవ దంపతులు వెళ్లారు. మద్యాహ్నం వరకు దంపతులు చర్చిలో ప్రార్థనలు చేశారు. మద్యాహ్నం 2 గంటల సమయంలో దంపతులు ఇద్దరు కారులో బయలుదేరారు. మార్గం మధ్యలో కొత్త పెళ్లికొడుక్కి గోవాలో ఉన్న అతని గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసింది.

కారు, భార్యను ట్రాఫిక్ లో వదిలేసి జంప్

కారు, భార్యను ట్రాఫిక్ లో వదిలేసి జంప్

గోవా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ లో మాట్లాడుతున్న కొత్త పెళ్లి కొడుకు కారు నడుపుకుంటూ వెలుతున్నాడు. పై లేఔట్ సమీపంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆ సందర్బంలో కొత్త పెళ్లి కొడుకు కారు డ్రైవ్ చేస్తుంటే అతని పక్కనే కొత్త పెళ్లికూతురు కుర్చుని ఉంది. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిన సమయంలో కారు డోర్ తీసిన కొత్త పెళ్లి కొడుకు కారు, పక్కన ఉన్న కొత్త పెళ్లికూతురిని నడిరోడ్డు మీద వదిలేసి పరారైనాడు.

మొబైల్ కూడా వదిలేసి వెళ్లిపోయాడు

మొబైల్ కూడా వదిలేసి వెళ్లిపోయాడు

కొత్త పెళ్లికూతురు కారు దిగి ఆమె భర్తను కొంతదూరం వెంబడించి అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించింది. అయితే వాహనాలు పక్కపక్కన అటూఇటూ తిరుగుతూ చిన్నగా అక్కడి నుంచి కొత్తపెళ్లికొడుకు ఎస్కేప్ అయ్యాడు. కారు డ్రైవింగ్ రాకపోవడంతో కొత్త పెళ్లికూతురు బిత్తరపోయింది. కొత్త పెళ్లికూతురు కారులో చూస్తే ఆమె భర్త మొబైల్ ఫోన్ అక్కడే ఉండటంతో ఆమెకు ఏం చెయ్యాలో తోచక వెంటనే కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పింది. కొత్త పెళ్లికూతురు, అతని కుటుంబ సభ్యులు కొత్త పెళ్లికొడుకు కోసం వెతికారు.

 ఎక్కడ ఉన్నాడో మహానుభావుడు ?

ఎక్కడ ఉన్నాడో మహానుభావుడు ?


కొత్త పెళ్లికొడుకు కనపడకపోవడంతో అతని భార్య మహదేవపుర పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. గోవాలో ఉన్న మాజీ గర్ల్ ఫ్రెండ్ తన భర్తను బ్లాక్ మెయిల్ చేస్తోందని, నీకు నేను మద్దతుగా ఉంటానని చెప్పినా నడిరోడ్డులో నన్ను వదిలేసి వెళ్లిపోయాడని కొత్త పెళ్లికూతురు చెప్పిందని, అతని కోసం గాలిస్తున్నామని మహదేవపుర పోలీసులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+