బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Birthday party: సెంట్రల్ జైల్లో గ్రాండ్ గా బర్త్ డే పార్టీ, కేక్ కట్ చేసిన ఖైదీ, సోషల్ మీడియాలో ఫోటోలు!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/రామనగర: నేరాలు చేసిన నిందితులు తమ తప్పు తెలుసుకుని, మంచి మనసు నేర్చుకుని, సమాజంలో మంచి వ్యక్తిగా ఎదగాలనే ఉద్దేశ్యంతో జైలు శిక్ష విధిస్తారు. అయితే ఈ రోజుల్లో జైళ్లు నేరగాళ్లకు సరదా ప్రదేశాలుగా మారిపోతున్నాయి. కర్ణాటకలోని రామనగర జిల్లా జైలులో ఉన్న ఓ అండర్ ట్రయల్ ఖైదీ తన పుట్టినరోజు వేడుకలను జైలులో చాలా ఘనంగా జరుపుకున్నాడు.

జైలులో ఖైదీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Wife: బిగ్ షాట్ భార్య, భర్త ఫ్రెండ్ తో రొమాన్స్, భర్త హత్యకు ఆన్ లైన్ లో ఏం ఆర్డర్ చేసిందంటే, కిల్ కిలాడి!Wife: బిగ్ షాట్ భార్య, భర్త ఫ్రెండ్ తో రొమాన్స్, భర్త హత్యకు ఆన్ లైన్ లో ఏం ఆర్డర్ చేసిందంటే, కిల్ కిలాడి!

నేరస్తులు జైలులో చాలా ఉల్లాసంగా గడుపుతున్నారనడానికి ఈ బర్త్ డే పార్టీ ఉదాహరణ అని ప్రజలు మండిపడుతున్నారు. జనవరి 14వ తేదీన రామనగర జిల్లా జైలులో అండర్ ట్రయల్‌గా ఉన్న కిరణ్‌ అలియాస్‌ తమటే కిరణ్‌ పుట్టినరోజు వేడుకలను జైల్లో ఘనంగా నిర్వహించారు. కిరణ్ అతని పుట్టినరోజు వేడుకలను ఇతర ఖైదీలతో కలిసి ఫోటోలు తీసుకుని ఇన్‌స్టాగ్రామ్‌తో సహా వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పోస్టు చేశాడు.

The prisoner who had a grand birthday party in the Central Jail, what actually happened in the Ramanagar Central Jail

సోషల్ మీడియాలో ఖైదీ కిరణ్ బర్త్ డే పార్టీ ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ విషయంలో సర్వత్రా విమర్శలకు దారితీస్తున్నాయి. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో జిల్లా కారాగారంలో పోలీసు సూపరింటెండెంట్ సంతోష్‌బాబు ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్లు గిరిరాజ్, నరసింహమూర్తి, సిబ్బంది బృందం జైలులో సోదాలు చేశారు. ఆ సమయంలో ఖైదీల నుంచి రెండు మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు.

Wife: కొత్త పెళ్లికూతుర్ని చంపిన హార్డ్ వేర్ ఇంజనీర్, ఆ బిడ్డకు తండ్రి నేనా, అక్క మొగుడా ?, విమానంలో జంప్!Wife: కొత్త పెళ్లికూతుర్ని చంపిన హార్డ్ వేర్ ఇంజనీర్, ఆ బిడ్డకు తండ్రి నేనా, అక్క మొగుడా ?, విమానంలో జంప్!

The prisoner who had a grand birthday party in the Central Jail, what actually happened in the Ramanagar Central Jail

రామనగర జిల్లా జైలుపై పోలీసుల సోదాల్లో రెండు మొబైల్ ఫోన్లు బయటపడడం జైలు సూపరింటెండెంట్, సిబ్బంది వైఫల్యానికి అద్దం పడుతోంది. అలాగే గతంలో పోలీసులు జైలుపై దాడి చేసినప్పుడు మొబైల్ ఫోన్లు, బీడీలు, సిగరెట్లు, పొగాకుతోపాటు నిషేధిత వస్తువులు దొరికాయి. జైలులో అక్రమంగా పుట్టినరోజు జరుపుకున్న అండర్ ట్రయల్ ఖైదీ కిరణ్ అలియాస్ తమ్తే కిరణ్, అతడి సహచరులపై రామనగర పోలీస్ స్టేషన్‌లో మరో కేసు నమోదు అయ్యింది. నిందితులకు సహకరించిన జైలు సిబ్బంది మీద విచారణకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

English summary
The prisoner who had a grand birthday party in the Central Jail, what actually happened in the Ramanagar Central Jail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X