Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Video call: భార్య ప్రియుడికి ఆటైపులో వీడియో కాల్ చేసింది, భర్తకు తెలిసింది, భర్త దెబ్బకు భార్య!

బెంగళూరు: వివాహం చేసుకున్న వ్యక్తి భార్యతో సంతోషంగా కాపురం చెయ్యడంతో కొడుకు పుట్టాడు. వ్యాపారం విషయాల్లో భర్త ఎక్కువగా బయట తిరుగుతున్నాడు. భర్త డబ్బులు సంపాధించడానికి బయట తిరుగుతుంటే అతని భార్య పక్కఊర్లో ఉంటున్న ఎల్ఐసీ ఏజెంట్ తో పరిచయం పెంచుకుని అతనితో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేసింది. పద్దతి మార్చుకోవాలని భర్త అతని భార్యకు నచ్చ చెబుతూ వచ్చాడు. భార్యలో మార్పు రాకపోవడంతో భర్త అసహనంతో రగిలిపోయాడు.

కొడుకును వెంట పిలుచుకుని వెళ్లి చెరువులో దూకేసిన భర్త ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకునే ముందు భర్త అతని భార్య, ఎల్ఐసీ ఏజెంట్ రంకుభాగోతం గురించి డెత్ నోట్ రాసి పెట్టాడు. అయితే భర్త డెత్ నోట్ ఇచ్చిన ఒక చిన్నక్లూతో అతని భార్య, ఆమె ప్రియుడు ఎన్ని ఆటలు ఆడారో అనే విషయం వెలుగు చూసింది. తన భార్య నగ్నంగా ప్రియుడికి వీడియో కాల్స్ చేసే వరకు వచ్చిందని భర్త పరోక్షంగా డెత్ నోట్ లో ఓ చిన్నక్లూ ఇచ్చాడు. పోలీసులు భార్య, ఆమె ప్రియుడు మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకుని పరిశీలించగా ఇద్దరి రాసలీలల పురాణం మ్యాటర్ మొత్తం బయటకు రాకవడం కలకలం రేపింది.

పెద్దలు సెట్ చేస్తే సంతోషంగా పెళ్లి చేసుకున్నారు

పెద్దలు సెట్ చేస్తే సంతోషంగా పెళ్లి చేసుకున్నారు

కర్ణాటకలోని మండ్య జిల్లా, నాగమంగల తాలుకాలోని పిట్టకోప్పలు సమీపంలోని చెన్నాపురలో గంగాధరగౌడ అలియాస్ గంగాధర్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 8 సంవత్సరాల క్రితం గంగాధరగౌడ సింధూ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. సింధూను వివాహం చేసుకున్న గంగాధరగౌడ అతని భార్యతో సంతోషంగా కాపురం చేస్తున్నాడు. గంగాధరగౌడ, సింధూ దంపతులకు జస్మిత్ (6) అనే కుమారుడు ఉన్నాడు.

భార్య అదోటైపు

భార్య అదోటైపు

కూలీలను పెట్టుకుని వ్యవసాయం చేయిస్తున్న గంగాధరగౌడ బయట వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారం విషయాల్లో గంగాధరగౌడ ఎక్కువగా బెంగళూరు, మైసూరు, కొడుగు తదితర ప్రాంతాలకు తిరుగుతున్నాడు. గంగాధరగౌడ డబ్బు సంపాధించాలని ఆశతో బయట ఊర్లకు తిరుగుతుంటే అతని భార్య సింధూ మగాళ్ల వ్యామోహంలో గాల్లో తేలిపోయింది.

ఎల్ఐసీ పాలసీ చెయ్యాలని మొగుడికి బాగానే చేశాడు

ఎల్ఐసీ పాలసీ చెయ్యాలని మొగుడికి బాగానే చేశాడు

మండ్య జిల్లాలోని నాగమంగల తాలుకాలోనే గరుడాపురలో బిసి. నంజుండేగౌడ అనే ఎల్ఐసీ ఏజెంట్ నివాసం ఉంటున్నాడు. నంజుడేగౌడ బలవంతం చెయ్యడంత మూడు సంవత్సరాల క్రితం గంగాధర్ గౌడ్ అతని దగ్గర ఓ ఇన్సూరెన్స్ పాలసీ చేశాడు.

పక్కఊర్లోనే నివాసం ఉంటున్న ఎల్ఐసీ ఏజెంట్ నంజుండేగౌడ ఇంటికి వచ్చి వెలుతున్న సమయంలో పరిచయం పెంచుకున్న గంగాధరగౌడ భార్య సింధూ అతనితో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేసింది. ఎల్ఐసీ ఏజెంట్ ప్రియుడు నంజుండేగౌడ అతని స్నేహితుడు గంగాధరగౌడ భార్య సింధూతో కలిసి ఎంజాయ్ చేస్తూ తిరగడం మొదలు పెట్టారు.

ఊరంతా తెలిసిపోయిందని భర్త ఆవేదన

ఊరంతా తెలిసిపోయిందని భర్త ఆవేదన

గత ఏడాది గంగాధరగౌడకు అతని భార్య సింధూ, ఎల్ఐసీ ఏజెంట్ నంజుండేగౌడ అక్రమ సంబంధం విషయం తెలిసిపోయింది. భార్య సింధూ, నంజుండేగౌడ అక్రమ సంబందం విషయం గురించి ఊర్లో, చుట్టుపక్కల గ్రామంల్లో పదిమంది పది రకాలుగా మాట్లాడుకోవడంతో సింధూ భర్త గంగాధరౌడ ఆవేదనతో కుమిలిపోయాడు. పద్దతి మార్చుకోవాలని సింధూకు ఆమె భర్త గంగాధరగౌడ ఇప్పటికే చాలాసార్లు నచ్చ చెబుతూ వచ్చాడు.

భార్య టార్చర్ తట్టుకోలేక?

భార్య టార్చర్ తట్టుకోలేక?

ప్రియుడు నంజుండేగౌడతో ఎంజాయ్ చేస్తున్న సింధూ ఆమె భర్త గంగాధరగౌడను లెక్కలేకుండా మాట్లాడటం, ఎవరి ముందు అంటే వాళ్ల ముందు చులకనగా మాట్లాడటం మొదలుపెట్టింది. భార్య సింధూ పద్దతి మార్చుకోలేదని రగిలిపోయిన ఆమె భర్త గంగాధరగౌడ ఆమెను ఏమీ చెయ్యలేక, కొడుకును వదిలి ఆత్మహత్య చేసుకోలేక కుమిలిపోయాడు. కొడుకును జస్విత్ (6)ను వెంట పిలుచుకుని వెళ్లిన గంగాధరగౌడ చెన్నాపుర చెరువులో దూకేసి ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు.

చెరువు పక్కనే బైక్, డెత్ నోట్

చెరువు పక్కనే బైక్, డెత్ నోట్

గంగాధరగౌడ అతని కొడుకు జస్విత్ తో కలిసి ఆత్మహత్య చేసుకునే ముందు డెత్ నోట్ లో అతని భార్య సింధూ, ఆమె ప్రియుడు ఎల్ఐసీ ఏజెంట్ నంజుండేగౌడ గురించి పిన్ టూ పిన్ రాసిపెట్టారు. తన భార్య సింధూ, ఆమె ప్రియుడు నంజుండేగౌడ కలిసి మా పరువు తీస్తున్నారని, మా కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా వారు పద్దతి మార్చుకోలేదని, మా ఆత్మహత్యలకు నా భార్య సింధూ, ఆమె ప్రియుడు నంజుండేగౌడ కారణం అని గంగాధర్ గౌడ డెత్ నోట్ రాసి చెరువు సమీపంలో బెక్ లో పెట్టి తరువాత ఆత్మహత్య చేసుకున్నాడు.

బతికిపోయిన భార్య

బతికిపోయిన భార్య

పోలీసులు సింధూ ఆమె ప్రియుడు నంజుండేగౌడ కోసం గాలించారు. తన అక్రమ సంబంధం విషయంలోనే తన భర్త గంగాధరగౌడ, కొడుకు జస్విత్ ఆత్మహత్య చేసుకున్నారని, పోలీసులు తన కోసం వెతుకుతున్నారని తెలుసుకున్న కిలాడీ లేడీ సింధూ కూడా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవాలన ప్రయత్నించింది. అయితే స్థానికులు విషయం గమనించి సింధూను ప్రాణాలతో రక్షించి ఆసుపత్రికి తరలించడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది.

భార్య నగ్నంగా వీడియో కాల్స్ చేసే వరకు వెళ్లిందని?

భార్య నగ్నంగా వీడియో కాల్స్ చేసే వరకు వెళ్లిందని?

గంగాధర్ గౌడ ఆత్మహత్య చేసుకునే ముందు అతని భార్య మొబైల్ ఫోన్ పరిశీలించాడు. తన భార్య సింధూ ఆమె ప్రియుడు నంజుండేగౌడకు నగ్నంగా వాట్సాప్ లో వీడియో కాల్స్ చేసిందని గంగాధర్ గౌడ్ కు తెలిసిపోయింది. తన భార్య నగ్న వీడియోలను ఆమె ప్రియుడు నంజుండేగౌడ అతని స్నేహితులకు చూపించి ఉంటాడని, ఈ వ్యవహారం ఎక్కడెక్కడికి వెళ్లి ఉంటుందని ఆవేదనతో గంగాధార్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

Recommended Video

    Omicron Variant Already In Major Cities Of India, Wake Up Call | Oneindia Telugu
    భార్య, ప్రియుడి మొబైల్ ఫోన్లు సీజ్

    భార్య, ప్రియుడి మొబైల్ ఫోన్లు సీజ్

    గంగాధర్ గౌడ్ భార్య సింధూ, ఆమె ప్రియుడు నంజేండేగౌడ మొబైల్ ఫోన్లు సీజ్ చేసిన పోలీసులు వాటిని పరిశీలిస్తున్నారు. మొత్తం మీద భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని, నగ్నంగా వీడియో కాల్స్ చేసి ప్రియుడితో మాట్లాడుతోందని ఆవేదనతో గంగాధర్ గౌడ్ అతని కొడుకుతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు అంటున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+